రక్తం నీలం రంగులోకి మారింది అంటే ఈ సమస్య ఉన్నట్లే..

cyanosis symptoms

సైనోసిస్ గురించి మీకు తెలుసా?

మ‌న శ‌రీరంలో ఉండే ర‌క్తంలో ఆక్సిజ‌న్ స్థాయి చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఒకవేళ రక్తంలో తగినంత ఆక్సిజన్ లేకపోతే.. ర‌క్తం ఎరుపు రంగులో ముదురు రంగు నుంచి ముదురు, నీలం రంగులోకి మారిపోతుంది. దీన్నే సైనోసిస్ అని పిలుస్తారు. ఇలా జ‌ర‌గ‌డంతో మ‌న చర్మం, పెదవులు మాములుకంటే ఎక్కువ నీలం రంగులోకి మారిపోతాయి.

అయితే ముదురు రంగు చర్మం ఉన్నవాళ్ల‌ల్లో ఈ సైనోసిస్ లక్షణాలు ఈజీగా క‌నిపిస్తాయి. వారి పెదవులు, గోర్లు , అలాగే చిగుళ్ళల్లో ఈ ల‌క్ష‌ణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలా మ‌న ర‌క్తంలో క‌నుక‌ ఆక్సిజన్ త‌క్కువ‌గా ఉంటే.. మ‌న చ‌ర్మం నీలం లేక‌పోతే ముదురు రంగులోకి మారుతుంది. ఈ సైనోసిస్‌కు చాలా కారణాలు ఉంటాయి. అందులో కొన్ని కార‌ణాలు తీవ్రంగా ఉంటాయి. అవి మ‌నం త‌ప్ప‌క తెలుసుకోవాలి.

ఆందోళన ప‌డాల్సింది ఎప్పుడుః

మ‌న చర్మం ఒక్క‌సారిగా నీలం రంగులోకి మారిపోతే.. మీరు త్వ‌ర‌గా హాస్పిట‌ల్ కు వెళ్లాలి. ఇది చిన్న పిల్ల‌ల్లో చూసినా ఆల‌స్యం చేయ‌కుండా వైద్యుల‌ను క‌ల‌వాలి. మ‌న చ‌ర్మం క‌నుక నీలం రంగులో కనిపించిన‌ప్పుడు.. అలాగే గాలి పీల్చ‌డంలో ఇబ్బంది క‌లిగితే.. అలాగే ఛాతీ భాగంలో నొప్పిగా అనిపిస్తే.. అస‌లు ఆల‌స్యం చేయొద్దు. వెంట‌నే డాక్ట‌ర్ ను క‌ల‌వాలి. ఈ ల‌క్ష‌ణాలు మ‌న శ‌రీరంలో ఒక ద‌గ్గ‌ర క‌నిపిస్తే.. అవి క్ర‌మంగా మిగ‌తా భాగాల్లో కూడా క‌నిపిస్తాయి. అలాగే నీలం రంగు క్ర‌మంగా మారిపోతుంది. దీనికి కార‌ణం మ‌న‌ రక్త ప్రసరణ సరిగ్గా లేద‌ని అర్థం.

ఈ సైనోసిస్‌కు కారణః

ఈ సైనోసిస్ కార‌ణాలు అనేకం ఉంటాయి. కానీ ఇది నిమ్మ‌దిగా లేక‌పోతే అక‌స్మాత్తుగా వచ్చే అవ‌కాశం ఉంది. అయితే ఈ సైనోసిన్ కు రెండు ప్ర‌ధాన కార‌ణాలు ఉన్నాయి. అవి సెంట్రల్ సైనోసిస్ మ‌రియు ప‌రిధీయ సైనోసిస్.

సెంట్రల్ సైనోసిస్ః

సాధార‌ణంగా సెంట్రల్ సైనోసిస్ రావ‌డానికి కార‌ణం రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండట‌మే. సెంట్రల్ సైనోసిస్ క‌నుక మీకు ఉంటే,. అప్పుడు మీ చర్మం, పెదవులు నీలం రంగులోకి మారిపోతాయి. ఇవే కాకుంగా ప‌లు కార‌ణాల వ‌ల్ల ఇది సంభ‌వించొచ్చు. ఆ కార‌ణాల్లో ఉబ్బసం ఉన్న‌ప్పుడు,
ఊరితిత్తుల ధమనులలో రక్తం గడ్డకట్టడం వ‌ల‌న‌, అలెర్జీ కారకానికి ఆకస్మిక ప్రతిచర్య అయిన‌ప్పుడు, ఈ స‌మ‌యాల్లో శరీరంలోని ఆక్సిజన్ స్థాయి త‌గ్గిపోతుంది. అలాగే పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు ఉన్న‌ప్పుడు, శరీరంలోని మిగిలిన భాగాలకు డీఆక్సిజనేటెడ్ రక్తం ప్ర‌వ‌హించేలా చేస్తుంది.

పరిధీయ సైనోసిస్ః

ఈ పరిధీయ సైనోసిస్ పేలవమైన ప్రసరణ వ‌ల‌న మ‌న వేళ్లు, కాలు, ఇతర అవయవాలు ప్ర‌భావితం అవుతాయి. దీన్ని ప‌రిధీయ సైనోసిన్ అంటారు. ఇది రావ‌డం వ‌ల‌న మ‌న శ‌రీరంలోని ప‌లు భాగాలు నీలం రంగులోకి మారుతాయి. అలాగే ఆ అవ‌య‌వాలు చల్లగా అనిపించొచ్చు. దీనికి కార‌ణం మ‌నం చల్లని వాతావరణంలో ఉండ‌టం వ‌ల‌న కావొచ్చు. అలాగే చల్లటి నీటితో ఉండటం వ‌ల‌న అయినా కావొచ్చు. మ‌నం క‌నుక చల్లటి ఉష్ణోగ్రతలు లేక‌పోతే ఒత్తిడికి లోనైన‌ప్పుడు వేళ్లు, కాలు మొదలైన అవ‌య‌వాల్లో రక్త నాళాలు సన్నగా మారిపోయే అవ‌కాశం ఉంది. అలా మారిన‌ప్పుడు రక్త ప్రవాహం తగ్గుతుంది. దాంతో మ‌న వేళ్లు, కాళ్లు, చర్మం నీలం లేక‌పోతే తెలుపు రంగులోకి మారిపోయే అవ‌కాశం ఉంది. ఈ ల‌క్ష‌ణం నుంచి ఉప‌శ‌మ‌నంన పొందాలంటే వెచ్చ‌గా ఉండేందుకు ప్ర‌య‌త్నం చేయాలి.

పరిధీయ ధమని వ్యాధి అంటే కాళ్ళకు రక్తం ప్రవహించడం కష్టతరం అయ్యే పరిస్థితి. ఈ స‌మ‌యంలో మ‌న కాలు ధమనులలో కొవ్వు లేక‌పోతే కొలెస్ట్రాల్ వంటివి ఏర్పడినప్పుడు సంభవించే అవ‌కాశం ఉంద‌. ధూమపానం అల‌వాటు ఉన్న వారిలో అధిక కొలెస్ట్రాల్ ఉంటే పరిధీయ ధమనుల వ్యాధి వచ్చే అవ‌కాశం ఉంది.

రక్తం గడ్డకట్టడంః

మ‌న శరీరంలో రక్తం గడ్డకట్టడం మొద‌లైన‌ప్పుడు కూడా.. మ‌న‌ వేళ్లు, కాళ్లు లాంటి ప్ర‌దేశాల్లో రక్తం ప్రవహించడం కష్టంగా మారుతుంది. బీటా బ్లాకర్లను తీసుకోవడం వ‌ల‌న కూడా శ‌రీర భాగాలు నీలం రంగులో క‌నిపిస్తాయి. ఈ బీటా బ్లాకర్స్ అనేవి ఒక రకమైన గుండె సమస్యలకు చికిత్స చేయ‌డానికి ఉప‌యోగించే మందులు. ఈ బీటా బ్లాకర్స్ గుండె త్వ‌ర‌గా కొట్టుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే ఇవి వాడ‌టం వ‌ల‌న‌ రక్త నాళాలు ఇరుకైనవిగా మారతాయి, ప‌సి పిల్లలలో సైనోసిస్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డానికి చేతులు, కాళ్ళలో చర్మం ఉపరితలం దగ్గరగా ఉంటుంది. దాంతో ఇలా మారిపోతాయి. ఈ ల‌క్ష‌ణాలు ఉన్న‌ప్పుడు వైద్యుని ద‌గ్గ‌ర‌కు పోవ‌డం చాలా ఉత్త‌మం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *