అధికంగా నీరు తాగడం వల్ల.. ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవచ్చు..!

water-can-solve-many-problems

 

అధికంగా నీరు తాగడం వల్ల.. ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవచ్చు..!

మన శరీరానికి ఎంతో అవసరమైన వాటిలో నీరు ఒకటి అని చెప్పవచ్చు.మన శరీరంలో జరిగే ప్రక్రియలు నిరంతరం ఎటువంటి సమస్యలు లేకుండా కొనసాగాలంటే మన శరీరానికి తప్పకుండా సరైన మోతాదులో నీరు అవసరం ఉంటుంది.మన శరీరానికి సరిపడా నీటిని తాగడం వల్ల మన శరీరం లోపల జరిగే ప్రక్రియలు సక్రమంగా జరగడమే కాకుండా మన శరీర సౌందర్యాన్ని మెరుగు పరచడంలోను నీరు కీలక పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా అధిక శాతం నీటిని తాగటం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అధికంగా నీటిని తీసుకోవడం వల్ల మనం ఎలాంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చ అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం…

జీవక్రియను మెరుగుపరుస్తుంది:

ప్రతిరోజు మన శరీరానికి సరిపడినంత నీటిని తాగడం వల్ల మన శరీరంలో జరిగే జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది.అదే విధంగా అధికంగా బరువు ఉన్న వారు అధిక శాతం నీటిని తీసుకోవడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడానికి ఉపయోగపడుతుంది. జనరల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం ఒక అధ్యయనం ప్రకారం అధికంగా నీటిని తాగడం వల్ల పురుషులలో కన్నా మహిళలలో 30 శాతం అధికంగా జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది.

గుండె పోటు నుంచి రక్షిస్తుంది:

ప్రతిరోజు దాదాపు ఐదు నుంచి ఏడు గ్లాసుల వరకు మంచి నీటిని తాగటం వల్ల అనేక రకాల గుండెకు సంబంధించిన వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. కొన్నిసార్లు గుండెపోటు ప్రమాదం నుంచి కూడా రక్షించుకోవచ్చు. అదేవిధంగా మన శరీరం నీటిశాతాన్ని కోల్పోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురవుతారు. ఈ విధంగా మన శరీరం డీహైడ్రేట్ అయితే పెద్ద పేగు క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకోసమే నీటిని అధికంగా తీసుకోవడం ద్వారా గుండెకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ల నుంచి కూడా విముక్తి పొందవచ్చు.

లాలాజలం, శ్లేష్మం ఉత్పత్తి చేస్తుంది:

అధికంగా నీటిని తీసుకోవడం వల్ల మన శరీరంలో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. అధిక శాతం లాలాజలం ఉత్పత్తి కావడం వల్ల మనం తీసుకునే ఆహారం తొందరగా జీర్ణం అవ్వడానికి ఎంతగానో సహకరిస్తుంది. అదేవిధంగా అధిక శాతం నీటిని తీసుకోవడం వల్ల మన ముక్కు, కళ్ళు ఎప్పుడు పొడిబారకుండా అధికశాతం తేమను కలిగి ఉంటాయి. కొన్నిసార్లు మనం తీయటి ద్రావణాలను సేవించినప్పుడు మంచి నీటిని తప్పకుండా తాగాలి. అలా త్రాగటం వల్ల దంతక్షయం తగ్గుతుంది.

తల నొప్పిని తగ్గిస్తుంది:

అధిక ఒత్తిడి, పని కలిగినప్పుడు శారీరకంగా ఎంతో అలసట చెందటం వల్ల కొన్నిసార్లు తీవ్రమైన తలనొప్పి బాధిస్తుంటుంది. అలాంటప్పుడు అధికంగా నీటిని తీసుకోవడం వల్ల తొందరగా ఒత్తిడి ,తలనొప్పి నుంచి సాధారణ స్థితికి చేరుకుంటారు.అదేవిధంగా మన శరీరంలో ప్రక్రియలన్నీ నిరంతరంగా కొనసాగాలంటే మన శరీరానికి సరిపడినంత ఆక్సిజన్ తప్పనిసరిగా అవసరం అవుతుంది.అందుకోసమే క్రమం తప్పకుండా ఎక్కువ మోతాదులో నీటిని తాగడం వల్ల మన శరీరానికి కావలసినంత ఆక్సిజన్ నీటి నుంచి పొందవచ్చు.

చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది:

మన శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల చర్మం పొడిబారిపోయి పేలగా కనిపిస్తుంది. అలాంటప్పుడు అధిక శాతం నీటిని త్రాగటం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపరచడమే కాకుండా ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది.అదేవిధంగా అధికంగా నీటిని తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది.

కండరాల తిమ్మిరి:

మనం ప్రతి రోజు అధిక పనిలో పడి మన ఆరోగ్యాన్ని అజాగ్రత్త చేస్తుంటాము. ఈ క్రమంలోని పని ఒత్తిడి వల్ల కండరాలు పట్టేసినట్టు నొప్పులు కలగజేస్తాయి. ఈ విధంగా కండరాలు తిమ్మిర్లు ఏర్పడటానికి గల కారణం మన శరీరం డీహైడ్రేషన్ కు గురికావడమే. ఈ విధమైన సమస్యలను ఎదుర్కొనే వారు అధికంగా నీటిని తాగడం లేదా నీరు కలిగిన పండ్లు అనగా కీర దోసకాయ, పుచ్చకాయ వంటి పండ్లను తినడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

మలబద్ధకం:

మలబద్దక సమస్య చాలా మందిలో ఎదురయ్యే సమస్యలలో మల బద్ధకం ఒకటి.కేవలం ఆహారం మాత్రమే తీసుకొని సరిపడినంత నీరు తాగకపోవడం వల్ల మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం జరగక మలబద్దక సమస్య ఏర్పడుతుంది. ఈ మలబద్దక సమస్య నుంచి విముక్తి పొందాలంటే ఆహారంతో పాటు అధిక శాతం నీటిని తీసుకోవాలి.అదేవిధంగా ఫైబర్ కంటెంట్ అధికంగా ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా మలబద్దక సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

కిడ్నీలో రాళ్లు తొలగిస్తుంది:

తక్కువగా నీటిని తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి దోహదపడుతుంది.అయితే కిడ్నీలో రాళ్లు తొలగించడానికి మందులకన్నా అధికంగా నీటిని త్రాగటం వల్ల కిడ్నీలో ఏర్పడిన రాళ్లు యూరిన్ ద్వారా బయటకు తొలగిపోతాయి. అదేవిధంగా మన శరీరంలో ఏర్పడినటువంటి బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ లకు నీటిని తాగడమే ఒక సులువైన మార్గం అని చెప్పవచ్చు. అధిక శాతం నీటిని తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి కూడా విముక్తి పొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *