వికారం, వాంతులను త‌గ్గించ‌డం ఇలా..!

vomiting-sensation-Remedies

వికారం, వాంతులను త‌గ్గించ‌డం ఇలా..!

వికారం, వాంతులు మ‌న‌కు ఎంతో ఇబ్బందిని క‌లిగిస్తాయి. వీటి వ‌ల‌న నీర‌సంగా త‌యార‌వుతాము. కొన్నిసార్లు తీవ్ర అనారోగ్యానికి కూడా కార‌ణం అవుతాయి. కొన్ని సార్లు కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను చూసిన‌ప్ప‌డు కూడా వాంతికొస్తున్న‌ట్లు అనిపిస్తుంది. దాంతో వెంట‌నే మ‌నం ఆ ఆహార ప‌దార్థాల‌ను తిన‌కూడ‌ద‌ని అనుకుంటం. ఈ వికారాన్ని ఆప‌డానికి కేవ‌లం ఆహార ప‌దార్థాల‌ను తిన‌కుండా ఆప‌డంతో లాభం ఉండ‌దు. ఇలా చేయ‌డం మ‌రింత అనారోగ్యానికి కార‌ణం కావొచ్చు.

మ‌న‌కు వికారం, వాంతులు అవ్వ‌డానికి ప‌లు కారణాలు ఉంటాయి. వాటిల్లో మ‌న పొట్టలో పుండ్లు, అసిడిటి, ప్రెగ్నెన్సీ లేక‌పోతే స్ట‌మక్ అప్ సెట్ వంటి ప‌లు కార‌ణాలు కావొచ్చు. వికారం, కడుపు నొప్పి  అజీర్ణం లాంటి స‌మ‌స్య‌ల నుంచి రావొచ్చు. ఈ వికారం వ‌ల‌న ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌లు అలాగే ఫుడ్ పాయిజన్, వైరల్ గాస్ట్రో లాంటివి బ‌య‌ట‌ప‌డొచ్చు. అజీర్తి  లేక‌పోతే స్ట‌మక్ అప్ సెట్, అజీర్ణం లాంటివి క‌ల‌గ‌డానికి కార‌ణాలు ఎన్నో ఉంటాయి. వాటిల్లో తినే ట‌ప్పుడు వేగంగా తిన‌డం, అతిగా తినడం లేక‌పోతే కొవ్వు ఎక్కువగా ఉండే వాటిని తిన‌డం, కారాన్ని ఎక్కువ‌గా త‌రుచుగా తీన‌డం వ‌ల‌న ఈ స‌మ‌స్య‌లు సంభ‌వించొచ్చు.

అయితే మ‌న‌కు వికారం క‌లిగిన‌ప్పుడు ఎంత మంచి ఆహారాన్ని మ‌న ముందు పెట్టినా కూడా మ‌న‌కు తినాలని అనిపించ‌దు. ఈ స‌మ‌యంలో మ‌న‌కు న‌చ్చిన వాటిని కూడా ప‌క్క‌న పెట్టేస్తాము. ఇలా వికారం క‌లిగితే మీరు ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఈ స‌మ‌యంలో ప్రత్యేక శ్రద్ద చాలా అవ‌స‌రం. ఎన్నో ర‌కాల వాస‌న‌లు మ‌న‌లో వికారం క‌లిగేలా చేస్తాయి. వాటి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి. వికారం క‌లిగిన‌ప్పుడు కొన్ని ర‌కాల ఆహారాలు తీసుకుంటే మ‌న‌కు రిలీఫ్ క‌లుగుతుంది. ఆ స‌మ‌యంలో వాటిని తీసుకోవ‌డం చాలా ముఖ్యం.

వాటిల్లో జ్యూసీగా ఉండే ఆపిల్ తినడం ఒక‌టి. ఇది మ‌న మానసిక స్థితిని సెట్ చేస్తుంది. అలాగే ఇది వికారం, వాంతులను నిరోధించే శక్తిని మీకు అందిస్తుంది.  అలాగే నిమ్మరసం కూడా దీనికి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. వికారంతో ఉన్న‌ప్పుడు మ‌రికొన్ని ఆహార నియ‌మాల‌ను పాటించాలి వాటిల్లో కొన్ని మీ కోసం..

ఆపిల్ పండుః ఆపిల్స్ లో విటమిన్స్ , మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి వికారాన్ని పొగొడుతాయి. అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. స్ట‌మక్ అప్ సెట్ లాంటి వాటిని కానివ్వ‌వు.

అల్లంః

అల్లం వికారం నుంచి త్వ‌ర‌గా ఉపశమనం కలుగ జేస్తుంది. వికారంగా అనిపించిన‌ప్పుడు చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకోవాలి. లేక‌పోతే అల్లం టీని తాగాలి. అలాగే అల్లం ర‌సం వాటిని తీసుకోవాలి. దాంతో ఎంతో ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.

అరటిపండుః
త్వ‌ర‌గా అర‌టిపండ్లు ఎనర్జీని అంద‌జేస్తాయి. వికారం అయిన‌ప్పుడు ఎంతో అలసటగా ఉంటుంది. అలాగే శక్తి లేకుండా త‌యార‌వుతాము. ఆ స‌మ‌యంలో వెంట‌నే శక్తి రావ‌డానికి అర‌టి పండ్ల‌ను తినాలి. ఇది వికారాన్ని నివారించ‌డంలో ఎంతో ఉప‌యోగ ప‌డుతుంది.

పండ్ల జ్యూస్: పండ్ల జ్యూస్ ను తీసుకోవ‌డం మ‌న‌ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇవి వికారాన్ని తగ్గిస్తాయి. వికారం క‌లిగిన‌ప్పుడు మ‌న‌కు న‌చ్చిన జ్యూస్ ను ఎంచుకుని తాగాలి. ఇది మంచి ఎనర్జీని ఇస్తాయి.

నట్స్ః వికారం క‌లుగడానికి ప్రోటీనుల లోపం కూడా ఒక‌టి. అందుకే ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవ‌డం చాలా మంచిది. ఈ ప్రోటీన్ల్ఉ నట్స్ లో ఎక్కువ‌గా ఉంటాయి.  బాదం , పీనట్స్ లాంటి వాటిల్లో ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి మ‌న‌కు ఎంతో ఎన‌ర్జీని ఇస్తాయి. అలాగే వికారాన్ని త‌గ్గిస్తాయి.

క్రాకర్ బిస్కెట్స్ః క్య్రాకర్ బిస్కెట్స్ , బ్రెడ్ లాంటివి వికారం నుంచి త్వ‌ర‌గా  ఉపశమనాన్ని కలుగజేస్తాయి.

నిమ్మరసంః నిమ్మరసంలో త్వ‌ర‌గా అలసటను తగ్గిస్తుంది. అలాగే శక్తిసామర్థ్యాల‌ను పెంచుతుంది. మ‌న‌కు శక్తిలేకుండా అయిన‌ప్పుడు త్వ‌ర‌గా ఎనర్జీ కావాలంటే నిమ్మ‌ర‌సం తాగాలి. ఇది శరీరానికి కావల్సిన హైడ్రేషన్ అందిస్తుంది. అలాగే అలసటను తగ్గిస్తుంది.

సిట్రస్ పండ్లుః వికారాన్ని నివారించడంలో సిట్రస్ ఫ్రూట్స్ ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వికారంగా ఉన్న‌ప్పుడు సిట్రస్ పండ్లను లేకుంటే పండ్ల రసాలను తీసుకోవ‌డం మంచిది.

పుదీనాః పుదీనా ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఘాటైన సువాసనుండే పుదీనా ఆకుల‌ను వికారం ఉన్న‌ప్పుడు తింటే ఎంతో ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

నీళ్లుః  వికారం స‌మ‌యంలో ఎక్క‌వ నీటిని ఒకేసారి తాగొద్దు. కొంచెం కొంచెంగా తాగితే ఎంతో మంచిది. అలా తాగితే రిలీప్ వ‌స్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *