బొల్లి వ్యాధి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి!

suffering-from-vitiligo-problems

బొల్లి వ్యాధి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి!

సాధారణంగా మనలో చాలా మందికి అనేక చర్మ సమస్యలు ఉంటాయి. ఈ చర్మ సమస్యల వల్ల పూర్తిగా చర్మం సహజ రంగును కోల్పోతుంది.ఈ విధమైనటువంటి చర్మవ్యాధులలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సమస్య బొల్లి చర్మ వ్యాధి. బొల్లి చర్మవ్యాధి అనేది ఒక రుగ్మత. ఈ వ్యాధి వ్యాపించినప్పుడు మన చర్మం పై తెల్లని మచ్చలు మాదిరిగా కనిపిస్తాయి. సాధారణంగా ఈ విధమైనటువంటి రుగ్మత ఎక్కువగా కాళ్ళు, చేతులు, మొహంపై ఏర్పడుతుంది. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఒక శాతం మంది ఈ రకమైన చర్మ సమస్యలు ఎదుర్కొంటున్నారు.

కొందరిలో బొల్లి వ్యాధి అనేది కేవలం చర్మం పై మాత్రమే కాకుండా జుట్టు ఉన్న ప్రాంతాలలో కూడా ఏర్పడుతుంది. ఈ విధంగా జుట్టు ఉన్న ప్రదేశంలో బొల్లి ఏర్పడితే మీ శరీరంలోని జుట్టు కూడా తెలుపుగా మారుతుంది. మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ద్వారా మెలనోసైట్లు నాశనం అయినప్పుడు ఈ విధమైనటువంటి తెల్లటి మచ్చలు మన చర్మం పై ఏర్పడతాయి.

బొల్లి ఎలా వ్యాప్తి చెందుతుందంటే:

సాధారణంగా బొల్లి వ్యాధి మన చర్మంపై చిన్నటి తెల్లని మచ్చల ఏర్పడి క్రమక్రమంగా అనేక నెలల కాలవ్యవధిలో చర్మం మొత్తం వ్యాపిస్తుంది. సాధారణంగా చేతులు కాళ్లు చేతులలో వ్యాపించే ఈ రుగ్మత కొందరిలో శ్లేష్మ పొరలు, కళ్ళు లోపలి చెవి భాగంలో అభివృద్ధి చెందుతుంది. కొన్ని కొన్ని సార్లు ఈ తెల్లటి మచ్చలు పెద్ద పాచెస్ విస్తరించడం మరియు వ్యాప్తి చెందుతూనే ఉంటాయి.

బొల్లిలో రకాలు:

సాధారణంగా బొల్లి నాలుగు రకాలుగా వ్యాప్తి చెందుతుంది. ఆ నాలుగు వాక్యాలు ఏమిటి అవి ఏ ప్రాంతాలలో ఏర్పడతాయో తెలుసుకుందాం…

* సెగ్మెంటల్ బొల్లి: ఈ విధమైనటువంటి బొల్లి వ్యాధి శరీరం ఒకవైపు లేదా చేతులు లేదా మొఖం వంటి ప్రాంతాలలో ఏర్పడే మచ్చలను సెగ్మెంటల్ బొల్లి అని పిలుస్తారు. అదేవిధంగా ఇది శ్లేష్మం , ఇది నోటి యొక్క శ్లేష్మ పొర మరియు / లేదా జననేంద్రియాలను కూడా ప్రభావితం చేస్తుంది.

*ఫోకల్: ఫోకల్ ఒక రకమైన బొల్లి సమస్య. ఈ రకమైన బొల్లిలో మాలిక్యూల్స్ కేవలంఒక చిన్న ప్రాంతానికి పరిమితమై ఉండి దాదాపు రెండు సంవత్సరాల వరకు ఇవి పెద్దగా వ్యాపించి ఉండవు.

* ట్రైకోమ్: ఈ రకమైన వ్యాధి ముందుగా తెలుపు లేదా రంగులేనిదిగా ఏర్పడుతుంది. ఆ తర్వాత తేలికపాటి
వర్ణద్రవ్యం ఉన్న ప్రాంతం, ఆపై సాధారణంగా రంగు చర్మం ఉన్న ప్రాంతం.

* యూనివర్సల్ ఇది ఒక రకమైన, అరుదైన బొల్లి సమస్య శరీర చర్మం 80% కంటే ఎక్కువ వర్ణద్రవ్యం లేదు.

ఈ రకమైన ఎటువంటి చర్మ రుగ్మతలు ప్రపంచవ్యాప్తంగా 1%లేదా కొంచెం ఎక్కువ జనాభాలో ఈ విధమైనటువంటి సమస్య వెలువడుతుంది. బొల్లి వ్యాధి అన్ని రకాల జాతులు మరియు లింగాలకి వ్యాపిస్తుంది.అయితే ఎక్కువగా ముదురు రంగు చర్మం ఉన్న వారిలో ఈ విధమైన ఎటువంటి చర్మ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విధమైనటువంటి బొల్లి సమస్య ఏ వయసులో వారికైనా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా 10 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వారిలో కనిపిస్తుంది.

బొల్లి సమస్య రావడానికి గల కారణాలు:

బొల్లి సంవత్సరావడానికి గల కారణాలు పూర్తిగా తెలియనప్పటికీ వీటిపై అనేక విభిన్న సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే ఈ బొల్లి సమస్య ఏ విధమైనటువంటి ఈ కారణాల చేత వస్తుందో తెలుసుకుందాం…

* ఆటో ఇమ్యూన్ డిజార్డర్: ఈ విధమైనటువంటి చర్మ సమస్యలకు ప్రభావితమైన వ్యక్తి రోగ నిరోధక వ్యవస్థ
మెలనోసైట్‌లను నాశనం చేసే ప్రతిరోధకాలను అభివృద్ధి చేయటం వల్ల ఈ విధమైనటువంటి సమస్య ఏర్పడుతుంది.

* జన్యుపరమైన కారణాలు: ఈ విధమైనటువంటి చర్మ సమస్య కొందరిలో జన్యుపరంగా ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమిస్తుంటాయి. ఈ విధమైనటువంటి జన్యుపరమైన కారణాల వల్ల 30 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.

* న్యూరోజెనిక్ కారకాలు: మెలనోసైట్స్‌కు విషపూరితమైన పదార్థం చర్మంలోని నరాల చివరన విడుదల కావటం వల్ల ఈ విధమైనటువంటి చర్మ రుగ్మతలు తలెత్తుతాయి.

చర్మంపై బొల్లి సమస్య శారీరక లేదా మానసిక వత్తిడి వంటి కొన్ని సంఘటనల వల్ల కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ విధమైనటువంటి చర్మ రుగ్మతలు వ్యాపించడానికి గల కారణాలు పూర్తిగా తెలియనప్పటికీ ఇటువంటి పరిస్థితులు ఏర్పడడానికి ఈ కారకాల కలయిక కారణమయ్యే అవకాశం ఉంది.

బొల్లి సమస్యకు చికిత్స:

బొల్లి సమస్యను అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ”సౌందర్య సమస్య కంటే ఎక్కువ”అని అభివర్ణించింది. ఇది కేవలం చర్మ సమస్య మాత్రమే కాకుండా ఆరోగ్య సమస్య అని కూడా తెలియజేసింది. ఈ విధమైనటువంటి చర్మ సమస్యలకు వైద్య సహాయం ఎంతో అవసరం.

*సన్ స్క్రీన్ ఉపయోగించడం:

అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ బొల్లి సమస్యతో బాధపడేవారికి సన్ స్క్రీన్ లోషన్ సిఫార్సు చేస్తోంది. ఎందుకంటే చర్మం పై ఏర్పడిన తేలికపాటి మచ్చలు ఎంతో సున్నితంగా ఉంటాయి. ఇది సున్నితంగా ఉండటం వల్ల సులభంగా తగ్గిపోతాయి.

*UVB కాంతి ఫోటో థెరపీ:

బొల్లి సమస్యతో బాధపడేవారికి UVB కాంతి ఫోటో థెరపీ ఒక చికిత్స నివారనని చెప్పవచ్చు. ఈ చికిత్స ద్వారా మన చర్మం అతినీలలోహిత కిరణాలకు గురి కావటం వల్ల ఈ తెరఫీ తెల్లటి మచ్చలు పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ విధమైనటువంటి థెరపీ వారంలో కనీసం రెండు మూడు సార్లు తీసుకోవడం వల్ల చర్మంపై ఉన్న పెద్ద మచ్చలు పూర్తిగా తగ్గిపోతాయని చెప్పకపోయినప్పటికీ కొంతవరకు మచ్చలను తొలగిస్తుంది.

విటమిన్ డి:
సాధారణ చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం కోసం
పోషకాహారంతో పాటు విటమిన్లు కూడా ఎంతో అవసరం. ముఖ్యంగా మన చర్మానికి విటమిన్ డి ఎంతో ఉపయోగపడుతుంది. విటమిన్-డి సహజసిద్దంగా మనకు సూర్యకిరణాల నుంచి లభిస్తుంది. కనుక మన చర్మం ఎండకు గురి కాకపోతే విటమిన్-డి లోపం వల్ల ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.కనుక మన శరీరంలో ఏర్పడే వివిధ రకాల చర్మ సమస్యలు తొలగిపోవాలంటే విటమిన్ డి ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడంతో పాటు, మన చర్మం సూర్యరశ్మికి తాకే విధంగా ఉండాలి.

బొల్లి వల్ల కలిగే ఇతర సమస్యలు:

సాధారణంగా బొల్లి వ్యాధి అనేది సౌందర్య సమస్య అయినప్పటికీ దీని ద్వారా ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి.

* బొల్లి వ్యాధి సమస్యతో బాధపడేవారికి వారి రెటినాస్‌లో కొన్ని సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ విధమైన సమస్య వల్ల కొన్నిసార్లు కంటిలోని కనుపాప, రెడీనా అయిన కొంత మంటగా ఉంటుంది. దీని వల్ల దృష్టి అసాధారణ అయితే ఏర్పడదు.

*ఎక్కువగా బొల్లి సమస్యతో బాధపడేవారు హైపోథైరాయిడిజం, డయాబెటిస్, హానికరమైన రక్తహీనత, అడిసన్ వ్యాధి,వంటి ఇతర స్వయం ప్రతిరక్షక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.అలాగే, ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నవారు బొల్లి అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది.

*ఈ విధమైన బొల్లి సమస్య ఉన్నవారు తమ చర్మం గురించి ఎంతో ఆందోళన చెందుతూ కొన్నిసార్లు ఎంతో మొరటగా ప్రవర్తిస్తుంటారు. కొందరు వారిని తదేకంగా చూడటం వ్యాధిపట్ల వారికి ఎంతో కఠినమైన విషయాలను చెబుతుంటారు. ఈ విధమైనటువంటి మాటలు, ప్రవర్తన ఈ సమస్యతో బాధపడే వారి ఆత్మగౌరవానికి కారణమవుతూ వారిలో ఆందోళన నిరాశను కలిగిస్తుంది.కనుక ఈ విధమైనటువంటి ఒత్తిడి ఆందోళన పడకుండా ఉండటం కోసం వారిపట్ల ఎంతో స్నేహపూర్వకంగా ప్రవర్తించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *