నల్ల జుట్టును పొందడానికి అద్భుతమైన పద్ధతులివే!

Some-amazing-ways-to-get-black-hair

నల్ల జుట్టును పొందడానికి అద్భుతమైన పద్ధతులివే!

ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే ఎంతో మంది ఎన్నో జుట్టు సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలలో కూడా జుట్టు బూడిద ఎరుపు రంగులోకి మారడం, లేదా తెలుపు రంగులోకి మారడం వంటివి జరుగుతుంటుంది.ఈ విధమైన బూడిద రంగులో ఉన్న జుట్టును నల్లగా చేయడం కోసం మార్కెట్లో దొరికే వివిధ రకాల రసాయనాలను ఉపయోగించి హెన్నాలను ఉపయోగిస్తుంటారు. నిజమైన రసాయనాలు కలిగిన వాటిని ఉపయోగించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి.

అతి చిన్న వయసులోనే ఈ విధంగా జుట్టు రంగు మారడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల ఏర్పడితే.. మరికొందరిలో సరైన పోషకాహారం లోపం వల్ల ఈ విధమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ క్రమంలోనే సరైన పోషకాహారం కలిగిన తాజాపండ్లు, ఆకుకూరలు తినడం వల్ల మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కాకుండా ఈ విధమైనటువంటి జుట్టు సమస్యల నుంచి కూడా విముక్తి పొందవచ్చు.

ఈ విధమైనటువంటి బూడిదరంగు చుట్టూ ఉన్న నలుపు గా మార్చుకోవడం కోసం మార్కెట్లో దొరికే హెయిర్ డైలు కాకుండా మన ఇంట్లో సహజ సిద్ధంగా దొరికే వాటినుంచి తయారుచేసుకుని జుట్టుకు ఉపయోగించడం వల్ల బూడిద రంగులో ఉన్న లేదా తెలుపు రంగులో ఉన్న జుట్టు సైతం నల్లగా నిగనిగలాడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సహజ నివారణ పద్ధతులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

1) బ్లాక్ టీ రెమిడీ:

బూడిద రంగులో లేదా తెలుపు రంగులో ఉన్న జుట్టు నల్లగా మారడానికి బ్లాక్ టీ రెమిడి ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్లాక్ టీ నిస్సహాయంగా మారిన మన జుట్టును పునరుద్ధరించడానికి బ్లాక్ ఎంతగానో దోహదపడుతుంది.

బ్లాక్ టీ తయారు చేయడం కోసం రెండు టేబుల్ తీసుకున్న బ్లాక్ టీ ఆకులు, ఒక కప్పు నీరు తీసుకోవాలి. బ్లాక్ టీ ఆకులను ఒక కప్పు నీటిని వేసి కొన్ని నిమిషాలపాటు బాగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన ఈ టీ ఆకులను చల్లార నివ్వాలి. చల్లారిన టీ ని మన జుట్టు కుదుళ్ల నుంచి పూర్తిగా అంటించుకుని కాసేపు ఆరనివ్వాలి.ఒక అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ బ్లాక్ టీ రెండిటిని క్రమం తప్పకుండా ప్రతి రెండు వారాలకు ఒకసారి ఈ విధంగా చేయటం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

2) హెన్నా, బ్లాక్ టీ, నిమ్మ, ఆమ్లా రెమిడీస్:

తెల్ల గా మారిన జుట్టు నల్లగా మార్చడానికి హెన్నా ఎంతో ఉపయోగపడుతుంది. హెన్నా రంగు మారిన జుట్టుకు ఒక సహజ రంగు మరియు దాని యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు నెత్తి యొక్క pH సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయి. ఆమ్లా జుట్టు దృఢంగా బలంగా తయారు చేయడానికి దోహదపడుతుంది.

బ్లాక్ టీ నిమ్మకాయ కూడా జుట్టుని ఎంతో దృఢంగా ముదురు చేస్తుంది. నిమ్మకాయ మన జుట్టులో ఉన్న అదనపు నూనె ను నివారిస్తుంది. వీటన్నింటినీ కలిపి ఒక మిశ్రమం లా తయారు చేసుకొని జుట్టుకు వేయడం వల్ల జుట్టు ఎంత దృఢంగా తయారవుతుంది. అదే విధంగా జుట్టు నల్లగా మారడానికి కూడా ఎంతో దోహదపడతాయి.

 • ఈ ఈ మిశ్రమం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:
 • నాలుగు టేబుల్ టీస్పూన్ల గోరింటాకు పొడి
 • రెండు టేబుల్ టీ స్పూన్ల బ్లాక్ టీ ఆకులు
 • ఒక టేబుల్ టీస్పూన్ నిమ్మరసం
 • ఒక టేబుల్ టీస్పూన్ ఆమ్లా పౌడర్.
 • ముందుగా గోరింటాకు పొడిని ముందు రోజు రాత్రి కొద్దిగా నీటిని వేసి బాగా7-8 గంటలవరకు నానబెట్టాలి.
 • మరుసటి రోజు ఉదయం రెండు టేబుల్ తీసుకున్న బ్లాక్ టీ ఆకులను ఒక గ్లాసు నీటిని వేసి బాగా మరిగించాలి. తర్వాత బ్లాక్ టీను చల్లబరచి, అందులోకి ముందురోజు రాత్రి నానబెట్టి గోరింటాకు పొడి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం ఆమ్ల పౌడర్ వేసి బాగా కలియబెట్టాలి.
 • ఈ మిశ్రమంలో ఎలాంటి ఉండలు లేకుండా, బాగా కలియబెట్టి అన్న తర్వాత గ్లౌజ్ సహాయంతో జుట్టు మొదల్లో నుంచి కొనవరకు నీటిగా అంటించాలి.ఈ మిశ్రమం మొత్తం తలలో పొడిబారిపోయే వరకు విశ్రాంతి తీసుకొని అనంతరం గోరువెచ్చని నీటితో కండీషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా ప్రతి నెలకు ఒకసారి చేయటం వల్ల నల్లని అందమైన జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు.

3) కొబ్బరి నూనె, నిమ్మరసం:

బూడిద రంగులోకి మారిన జుట్టు నలుపు రంగులోకి మార్చడం కోసం కొబ్బరి నూనె నిమ్మరసం ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. కొబ్బరి నూనె నిమ్మరసం మన వెంట్రుకల కణాలకు రక్షణగా ఉండి మన జుట్టు నలుపు రంగులో మారడానికి దోహదపడుతుంది.

ముందుగాఒక చిన్న కప్పు లో రెండు టేబుల్ తీసుకోవాలా కొబ్బరి నూనె ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకొని జుట్టు మొనల నుంచి కొనవరకు అంటించి అరగంట తర్వాత జుట్టును శుభ్రపరచుకోవాలి. ఈ పద్ధతిని కనీసం వారంలో రెండుసార్లు పాటించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

4) కరివేపాకు, కొబ్బరి నూనె:
బూడిద రంగులో ఉన్న జుట్టు నల్లగా మార్చడానికి కరివేపాకు ఎంతో ఉపయోగపడుతుంది. పూర్వకాలం నుంచి మన పెద్దలు దీనిని ఎంతో విరివిగా ఉపయోగించేవారు. కరివేపాకులు వివిధ రకాల విటమిన్లు ఖనిజాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యవంతంగా, దృఢంగా ఉంచడానికి దోహదపడుతుంది. ఒక కొబ్బరి నూనె జుట్టు కణాలను సంరక్షిస్తుంది.

 • కొద్దిగా కరివేపాకు రెబ్బలు, మూడు టేబుల్ టీస్పూన్ల కొబ్బరి నూనె ను తీసుకోవాలి.
 • ముందుగా ఒక ఫ్యాన్ తీసుకొని కొబ్బరి నూనె వేసి అందులో కరివేపాకు రెబ్బలను వేసి వేయించాలి.
 • వేయించిన నూనె చల్లారిన తర్వాత నేను నేను జుట్టు మొదటినుంచి కొన్నళ్ళ వరకు బాగా రాయాలి. అరగంట తర్వాత షాంపూ లేదా కండిషనర్జు
 • జుట్టును శుభ్రపరచుకోవాలి.ఈ విధంగా వారంలో రెండు మూడు సార్లు చేయడం వల్ల జుట్టు నల్లగా మారడం కాకుండా ఎంతో ఒత్తుగా పెరిగి ఎంతో దృఢంగా తయారవుతుంది.

5) బంగాళాదుంప తొక్క:
బూడిద రంగులో ఉన్న జుట్టు నల్లబడటానికి బంగాళదుంప తొక్కలు ఎంతో ఉపయోగపడతాయి. పిండి ద్రావణాలు జుట్టును నల్లగా మార్చి, పునరుద్ధరించడానికి దోహదపడతాయి.

 • ఇందుకు కావలసింది కేవలం బంగాళదుంపలు తొక్కలు రెండు కప్పుల నీరు.
 • ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో బంగాళదుంప తొక్కలు, రెండు కప్పుల నీటిని వేసి బాగా మరిగించాలి.
 • ఆ ద్రావణం నుంచి స్టార్ట్ ఏర్పడే వరకు వీటిని బాగా ఉడికించాలి.
 • స్టార్ట్ ఏర్పడిన తర్వాత దానిని స్నానం చేసిన తర్వాత కండిషనర్ లాగా ఉపయోగించడం వల్ల మన జుట్టు ఎంతో మృదువుగా, ఒత్తుగా తయారవుతుంది. స్టార్ట్ జుట్టుకి రాసిన తర్వాత మరి జుట్టును శుభ్రం చేయకూడదు.

ఈ విధంగా మన ఇంట్లో దొరికే వాటితో వచ్చే బూడిద రంగులోకి మారిన చుట్టును లేదా తెలుపు రంగు జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఈ సహజ నివారణ పద్ధతులు ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగానే సహజ నివారణచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *