సిగరెట్లు బాగా తాగితే.. కంటి చూపు పోతుందా..!

smoking-will-lose-your-eyesight

సిగరెట్లు బాగా తాగితే.. కంటి చూపు పోతుందా..!

సిగరెట్ వాడకం:

ప్రస్తుతమున్న సమాజంలో ప్రతి ఒక్కరు సిగరెట్ తాగడం ఓ అలవాటుగా మార్చుకున్నారు. ఇక యువత మాత్రం అదొక ఫ్యాషన్ గా మార్చుకుంటున్నారు. సిగరెట్, మద్యపానం తాగొద్దని వాటి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఎన్నో చోట్ల లో ప్రకటిస్తుంటారు. కానీ వాటిని విని వినకుండా, చూసి చూడకుండా వదిలేస్తుంటారు. అంతేకాకుండా వాటి వాడుక కూడా ఎక్కువగానే ఉంది. ఈ సిగరెట్ కాల్చిన వారికే కాకుండా.. అవతలి వారు వాటి ద్వారా వచ్చిన పొగను పీల్చినా వారికి కూడా నష్టాలు జరుగుతాయి.

ఇలా ఎంతోమంది పురుషులే కాకుండా, పలుచోట్ల లో స్త్రీలు కూడా సిగరెట్ తాగడం అలవాటు చేసుకుంటున్నారు. సమాజం మొత్తం చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయారు. వీటి వల్ల ప్రాణాలు తొందరగా కోల్పోతున్నారు. ఎక్కువగా వయసు పైబడిన వారి కంటే వయసులో ఉన్న వారే సిగరెట్లు తాగుతున్నట్టు అధ్యయనంలో తేలింది.

సిగరెట్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు:

ఇక సిగరెట్ తాగడం వల్ల ఎక్కువ ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తుంటాయి. ఇప్పటివరకు ఎక్కువగా సిగరెట్లు తాగిన వాళ్ళల్లో చాలామంది గుండెకు, ఊపిరితిత్తుల సమస్యలతో మరణించారు. కానీ తాజాగా చేసిన అధ్యయనం ప్రకారం సిగరెట్ ఎక్కువ తాగితే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

అంతేకాకుండా మూత్రాశయం, కాలేయం వంటి అవయవాలు కూడా దెబ్బతింటాయి. అంతేకాకుండా 17 రకాల క్యాన్సర్ వ్యాధులు కూడా వ్యాపించే ప్రభావం ఉందని వైద్య నిపుణులు తెలిపారు.

అంతేకాకుండా మెదడువాపు, శ్వాసకోశ ఇబ్బందులు, అలర్జీ, తీవ్రమైన దగ్గు వంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇదే కాకుండా రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. సిగరెట్లు ఎక్కువగా తాగడం వలన లంగ్ క్యాన్సర్ కూడా వస్తుంది.

ఇతరులు సిగరెట్ తాగేటప్పుడు పొగను పీల్చినా వారికి కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.

రోజుకు కేవలం ఒక సిగరెట్ తాగితే కలిగే నష్టాలు:

రోజుకొక సిగరేటు తాగితే రక్తనాళాలకు హాని కలుగుతుంది. కేవలం ఒక్క సిగరెట్ తీసుకోవడం వల్ల రక్తనాళాలు గట్టిపడి గుండెపై ప్రభావం చూపుతుంది.

సిగరెట్ మీద చేసిన అధ్యయనం:

రట్గెర్స్ రీసెర్చ్ సంస్థకు చెందిన నిపుణులు చేసిన అధ్యయనం ప్రకారం ప్రతిరోజు 20 కంటే ఎక్కువ సిగరెట్లు తాగితే కంటి చూపు కోల్పోతారని తేలింది. ఈ విషయాన్ని సైకియాట్రీ రీసెర్చ్ జర్నల్ లోనూ ప్రచురించారు. సిగరెట్లు తాగే 25 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న వారి పై చేసిన పరిశోధనలో అందులో 63 మంది రోజుకు 20 కంటే ఎక్కువ సిగరెట్స్ తాగుతున్నారట‌.

ఈ విధంగా వాళ్ళని పరీక్షించినట్లయితే క్యాథోడ్ రే ట్యూబ్ మానిటర్ పై వస్తున్న చాలా రంగుల్ని చూపించారు. దీంతో వాళ్లు దానిపై వస్తున్న రంగులను సరిగ్గా గుర్తించలేకపోవడంతో వారిలో కంటిచూపు సమస్య ఎదురైందని తెలిపారు. సిగరెట్ లో న్యూరో టాక్సిక్ కెమికల్స్ ఎక్కువగా ఉండటం వల్ల వాటి ప్రభావం కళ్ళపై పడటం వల్ల కంటి చూపు పోతుందని వారి అధ్యయనంలో తేలింది. ఇకనైనా మంచి ఆరోగ్యం కోసం సిగరెట్ తాగే ప్రతి ఒక్కరు మానుకోవాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

సిగరెట్ ఎక్కువ తీసుకునే సందర్భాలు:

కొందరు సిగరెట్ ను క్రమం తప్పకుండా తీసుకుంటారు. మరికొందరు ఏదైనా ఒత్తిడికి లోనైనప్పుడు మాత్రమే తీసుకుంటారు. ప్రతిరోజూ తీసుకునే వాళ్లను గమనించినట్లయితే ఇక వారు సందర్భం అని లేకుండా అలవాటుగా తాగుతారు. కానీ ఏదో ఒక సమయంలో సిగరెట్ తాగే వాళ్ళు కేవలం ఒత్తిడికి లోనైనప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే తాగుతుంటారు. మరికొంతమంది మద్యం సేవించే సమయంలో కూడా సిగరెట్ తాగుతుంటారు.

సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళకి మానేసే చిట్కాలు:

ఇప్పటికీ సిగరెట్ ఎక్కువగా అలవాటు ఉన్న వాళ్లు మానేయడానికి తగిన దారులు ఉన్నాయి. ఎంతోమంది సిగరెట్ మానేయాలని అనుకున్నా.. దానికి అలవాటు పడిపోయి మానేయలేకపోతారు. కానీ ఇది మానేయడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.

సిగరెట్ ఎక్కువ తాగే అలవాటు ఉన్న వాళ్లు ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడానికి అలవాటు చేసుకోవాలి. ఎక్కువగా డ్రైఫ్రూట్స్, చిప్స్, పచ్చళ్ళు వంటివి ఎక్కువగా తినాలి. ఇవి ఎక్కువగా తినడం వల్ల సిగరెట్ తాగాలనే కోరిక తగ్గుతుంది. అందుకే ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

ఉదయం పరిగడుపున రెండు గ్లాసుల వేడినీటిలో నిమ్మరసం పిండుకొని తాగాలి. అంతే కాకుండా అందులో తేనె కూడా వేసుకోవచ్చు.

అల్లం, కరక్కాయలను బాగా నల్ల గొట్టి ఎండబెట్టి దానిలో నిమ్మకాయ రసం, ఉప్పు వేసి నిల్వ ఉంచకండి. ఇది మీకు ఎప్పుడైనా సిగరెట్ తాగాలనిపించినప్పుడు ఆ పొడిని తీసుకుంటే చాలు. అంతేకాకుండా నారింజ, ద్రాక్ష పండ్లు ఇలాంటి జ్యూసులు తీసుకోవడం వల్ల కూడా తగ్గే అవకాశం ఉంది.

సెల్ఫ్ కంట్రోల్ తో సిగరేటు మానేయవచ్చు:

మామూలుగా చిట్కాలే కాకుండా మానసికంగా గట్టిగా నిశ్చయించుకుంటే సిగరెట్ కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది. ఎవరికైనా సిగరెట్ తాగాలనిపించినప్పుడు.. వెంటనే మనసులో తాగకూడదు అని దృఢంగా ఫిక్స్ అవ్వాలి. అలా అనిపించినప్పుడు ఆ సమయంలో వేరే పనిపై ఆసక్తి చూపాలి. దీనివల్ల త్వరగా అలవాటును తప్పించుకోవచ్చు.

సిగరెట్ తాగాలనిపించినప్పుడు వ్యాయామం చేస్తే కూడా మర్చిపోయే అలవాటు ఉంటుంది. ఎప్పుడైనా అలా అనిపించిన సమయంలో రన్నింగ్ లేదా వాకింగ్ లాంటివి చేయాలి. అంతేకాకుండా గార్డెనింగ్ వంటి మొక్కలతో సమయాన్ని గడపాలి. వీటివల్ల సిగరేటు పై దృష్టి అనేది ఎక్కువగా పోదు.

సిగరెట్లు మానేయడానికి మందులు:

చాలామంది సిగరెట్ తాగడం మానేయడానికి రకరకాల మందులు వాడుతుంటారు. అంతేకాకుండా టీవీల్లో ప్రకటనలు ఇచ్చే మందులు కూడా వాడుతుంటారు. వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ కేవలం నికోటిన్ ప్యాచులు, హిప్నాటిజం, డాక్టర్ సూచించిన మందులను మాత్రమే వాడాలి. డాక్టర్ సలహాలు లేకుండా ఎటువంటి మందులు తీసుకోకూడదు. అంతేకాకుండా ఈ మందులను వాడే బదులు పైన ఉన్న చిట్కాలను వాడటం వల్ల ఆరోగ్యానికి మేలు ఉంటుంది.

సిగరేటు నిషేధంపై ప్రకటనలు:

ప్రస్తుతం సిగరెట్ల వాడుక ఎక్కువగా ఉన్నందు వలన వాటిని దృష్టిలో పెట్టుకొని పలు ప్రచారాలు, ప్రకటనలు చేస్తూ ఉంటారు. సిగరెట్ డబ్బా పైన పొగతాగడం హానికరం అంటూనే సిగరెట్ లను తయారు చేస్తారు. అంతేకాకుండా ప్రజలు ఎక్కువగా ఉండే చోటు, రవాణా సంస్థలలో, వాహనాలు ఆపే చోటు, ఇతర కాలుష్య రహిత మైన రసాయన ల వద్ద, ఫ్యాక్టరీలలో, సినిమా థియేటర్లలో ఇలా ఎన్నో చోట్లలో మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రకటిస్తారు. అంతేకాకుండా టీవీలలో ప్రసారం అవుతున్న సమయంలో కూడా ప్రకటిస్తారు. ఇలా ఎన్నో చోట్ల ప్రకటించిన సిగరెట్లు తాగే వారు మాత్రం మానేయడం లేదు. ఇలా ప్రకటించిన చోట్లలో సిగరెట్టు తాగితే అనుకోకుండా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి సిగరేటు ను వీలైనంత వరకు తగ్గిస్తూ మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా కాపాడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *