చర్మం పొడిబారుతోందా.. రోజు వాటర్ తో ఈ సమస్యకు చెక్ పెట్టండి..!

rose-water-for-skin

చర్మం పొడిబారుతోందా.. రోజు వాటర్ తో ఈ సమస్యకు చెక్ పెట్టండి..!

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. అయితే కాలానికి అనుగుణంగా మన చర్మంలో మార్పులు రావడం సర్వసాధారణమే. ముఖ్యంగా శీతాకాలంలో చర్మ సౌందర్యం పూర్తిగా మారుతుంది. చలి అధికంగా ఉండటం వల్ల చర్మం పొడిగా మారి దురదగా అనిపించడం వల్ల చర్మ సమస్యలు అధికమవుతాయి అయితే శీతాకాలం నుంచే కాకుండా ఇతర కాలాలలో కూడా మన చర్మం తేమ శాతాన్ని కోల్పోవడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ సమస్యలన్నింటిని తొలగించుకొని చర్మం మృదువుగా తయారు కావాలంటే రోజ్ వాటర్ ఒక చక్కని పరిష్కార మార్గం అని చెప్పవచ్చు. రోజ్ వాటర్ ఉపయోగించి మన చర్మ సౌందర్యాన్ని ఏ విధంగా పెంపొందించుకోవచ్చు ఇక్కడ తెలుసుకుందాం….

స్వచ్ఛమైన గులాబీ రెక్కలతో తయారుచేయబడిన ఈ రోజు వాటర్ ఉపయోగించడం వల్ల మన శరీరానికి సరిపడినంత తేమను అందించడమే కాకుండా చర్మాన్ని మృదువుగా కూడా ఉంచుకోవచ్చు. తరచూ రోజ్ వాటర్ ఉపయోగించి మన చర్మాన్ని శుభ్రం చేసుకోవడం ద్వారా సోరియాసిస్, చర్మం దద్దుర్లు వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. తరచూ రోజ్ వాటర్ వాడటం వల్ల మన చర్మం పొడిబారకుండా తేమగా ఉండడమే కాకుండా మృదుత్వాన్ని కూడా కలిగి ఉంటుంది.

పొడిబారిన చర్మం కోసం రోజ్ వాటర్ తేనె మాస్క్:

పొడిబారిన చర్మం మృదుత్వంగా తయారవడానికి త్రీ టేబుల్ టీ స్పూన్ రోజ్ వాటర్ ఒక టేబుల్ టీ స్పూన్ తేనె మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. ఈ మాస్క్ బాగా ఆరిన తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల ముఖం ఎంతో తాజాగా మృదువుగా తయారవుతుంది.తరచూ ఈ చిట్కాలను పాటించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.

రోజ్ వాటర్ మాయిశ్చరైజర్:

సాధారణంగా మన చర్మం పొడిబారడం వల్ల తేమ శాతాన్ని కోల్పోతుంది కాబట్టి మనం మాయిశ్చరైజర్ లను ఉపయోగిస్తుంటాము.కొన్ని రకాల మాయిశ్చరైజర్ లను ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు ఎదురవుతాయి. అలాంటి వారు రోజ్ వాటర్ తో మాయిశ్చరైజర్ తయారు చేసుకొని అంటించుకోవడం వల్ల మన చర్మం ఎంతో మృదువుగా నిగనిగలాడుతుంది. స్వచ్ఛమైన కొబ్బరినూనెలో ఒక వంతు గ్లిజరిన్, ఒక వంతు రోజ్ వాటర్ ఉపయోగించి చర్మానికి అంటించుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

రోజ్ వాటర్, బంగాళదుంప ఫేస్ ప్యాక్:

పొడిబారిన చర్మం కోసం టేబుల్ టీస్పూన్ బంగాళాదుంప రసం, ఒక టేబుల్ టీస్పూన్ రోజ్ వాటర్, పొడిబారిన చర్మ సమస్యలతో బాధపడేవారు మాత్రమే అర టీ స్పూన్ తేనెను కలుపుకుని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రంగా ముఖాన్ని కడిగిన తర్వాత ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా చేయడం ద్వారా మన మొహం పై ఏర్పడినటువంటి మొటిమలు, మచ్చలు సైతం తొలగిపోతాయి.

వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది:

మన చర్మం తేమ శాతాన్ని కోల్పోవడం వల్ల చర్మం పై ముడతలు పడి తొందరగా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. అదేవిధంగా uv రేడియేషన్, కాలుష్యం, చర్మ సంరక్షణ ఉత్పత్తుల వల్ల మన శరీరంలో అనేక హానికరమైన ఫ్రీరాడికల్స్ ఏర్పడతాయి. మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఏర్పడటంవల్ల తొందరగా మన చర్మం ముడతలు పడి వృద్ధాప్య ఛాయలు కనబడతాయి. మన శరీరంలో ఏర్పడినటువంటి ఫ్రీ రాడికల్స్ తొలగించటానికి రోజ్ వాటర్ ఎంతో ఉపయోగపడతాయి. రోజ్ వాటర్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఏర్పడిన ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపి శరీరంలో ఏర్పడే ముడతలను, తగ్గించి సహజ చర్మ సౌందర్యాన్ని కలిగించడంలో తోడ్పడుతుంది. అదే విధంగా ప్రతి రోజు రోజు వాటర్ తో మన మొహాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ముఖంపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్, బ్లాక్ హెడ్స్ తొలగిపోయి చర్మం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది.

కళ్ళ కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది:

చాలా మంది ముఖ సౌందర్యం ఎంతో అందంగా ఉన్నప్పటికీ కళ్ళకింద నల్లటి వలయాలు వారి అందాన్ని తగ్గిస్తుంది. ఈ విధంగా కళ్ళ క్రింద నల్లటి వలయాలు ఏర్పడినప్పుడు రోజ్ వాటర్ లో కాటన్ బాల్స్ వేసి ఆ కాటన్ బాల్స్ ను మన కళ్లపై వేసుకుని పది నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవడం వల్ల కళ్ళ కింద ఏర్పడినటువంటి నల్లటి వలయాలు తగ్గిపోతాయి. అయితే ఈ విధంగా మూడు నుంచి నాలుగు వారాల పాటు క్రమం తప్పకుండా పాటించడంవల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా రోజ్ వాటర్ లో ఉన్నటువంటి యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు దుమ్ము ,ధూళి కణాలవల్ల మన కంటిలో ఏర్పడినటువంటి ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది. వాతావరణంలో కాలుష్యం వల్ల కొన్ని సార్లు మన కళ్ళు ఎంతో ఎరుపుగా మారుతాయి. ఆ సమస్య కూడా ఈ రోజు వాటర్ వాడటం వల్ల తగ్గిపోతుంది.

చర్మం పి హెచ్ ను బ్యాలెన్స్ చేస్తుంది:

ప్రస్తుతం మార్కెట్లో లభించేటటువంటి చర్మ సౌందర్య ఉత్పత్తులు, సబ్బులు తయారీలో పీహెచ్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మన చర్మం ఎంతో కఠినంగా తయారవుతుంది. రోజ్ వాటర్ లో పిహెచ్ స్థాయిలు 5.5 ఉండటం వల్ల చర్మాన్ని సాధారణ పిహెచ్ స్థాయిని పునరుద్ధరించడానికి రోజు వాటర్ కీలకపాత్ర పోషిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *