గోర్లే మీ ఆరోగ్యాన్ని నిర్ధారిస్తాయి!

గోర్లే మీ ఆరోగ్యాన్ని  నిర్ధారిస్తాయి!

శ‌రీరంలో కొన్ని అవ‌య‌వాలకు ప్ర‌త్యేకత ఉంటుంది. వాటిని చూస్తే మ‌నం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో చెప్పేస్తారు వైద్యులు. అలాంటి వాటిల్లో గోర్లు ముందు వ‌రుస‌లో ఉంటాయి. అవును గోర్ల‌ను చూసి మ‌న ఆరోగ్యాన్ని చెప్పేయొచ్చని వైద్యులు కూడా అంటున్నారు. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి వ్యాధుల‌ను ప‌రిశీలించ‌డానికి మొద‌టి త‌నిఖీగా వైద్యులు గోర్ల‌ను చూస్తార‌ని మీకు తెలుసా..? అందుకే మ‌న గోర్ల‌పై మ‌నం దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంది.

ఈ విష‌యం మీద మీకు పూర్తి అవ‌గాహ‌న రావాలంటే మీ గోర్ల‌ను ఒక‌సారి ప‌రిశీలించుకోవాలి. ఆ ప‌రిశీల‌న‌లో మీకు ఈ ఆర్టిక‌ల్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో ఏమైన సంకేతాలు మీకు క‌నిపిస్తే వెంట‌నే డాక్ట‌రును సంప్రదించండి. మీ ప‌రిశీల‌న నిజ‌మో కాదో తెల‌స్తుంది. అయితే గోర్ల విష‌యంలో మీరు ప‌రిశీలించాల్సిన విష‌యాలు..

పలుచటి గోర్లుః

పాలిపోయిన, పలుచగా గోర్లు మీరు ఉంటే.. మీ శ‌రీరంలో ఇనుము త‌క్కువైంద‌ని అర్థం. మీరు తీసుకునే ఆహారంలో ఇనుము అవసరమైనదని గుర్తించాలి. ఇనుము లేకపోతే మీ శరీరంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. దీన్ని రిక‌వ‌రీ చేయాలంటే.. ఎక్కువ మోతాదులో పాలకూర, ఆకుపచ్చ కూరగాయలు , మాంసం తినాలి. అట్లాగే పలుచని గోర్లు రక్తహీనతకు సంకేతం. ఇది ర‌క్తంలో ఎర్ర ర‌క్త క‌ణాన‌లు లేక‌పోవ‌డాన్ని సూచించొచ్చు. అలసట వంటి ల‌క్ష‌ణాలు మీకు ఉండొచ్చు. ఇవే ల‌క్ష‌ణాలు మీకు ఉంటే త్వ‌ర‌గా మీరు డాక్ట‌ర్ ను సంప్ర‌దించ‌డం మేలు.

గోర్ల బేస్ ద‌గ్గ‌ర‌ నీలంగా ఉంటేః
గోర్ల బేస్ చుట్టూ నీలం టోన్ ఉండ‌టాన్ని మీరు  గ‌మ‌నిస్తే.. అది ఇన్సులిన్ లోపానికి సంకేతం కావొచ్చు. లేక‌పోతే డ‌యాబెటిస్ అయి ఉండొచ్చు. ఈ స‌మ‌యంలో  చక్కెరను త‌క్కువ‌గా తీసుకోవ‌డం చాలా మంచిది. ఇలాంటి సంకేతాలు క‌నిపిస్తే.. ఆందోళ‌న చెంద‌కుండా డాక్ల‌ర్ ను క‌ల‌వ‌డం మంచిది.

గోర్ల మీద తెలుపు చారలుంటేః
గోర్ల మీద‌ పాలిపోయిన లేకుంటే తెల్ల చారలు ఉంటే మీరు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ స‌రిగ్గా  లేదని అర్ధం. మీరు దీన్ని అధిగ‌మించాలంటే.. మంచి ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువ ప్రోటీన్ దొరికే లీన్ మాంసం, నట్స్, ఆకుపచ్చ కూరగాయలు, సోయా, సీడ్స్ , చేపలను ఎక్కువగా తినాలి. అప్పుడు మీ ఆరోగ్యం కుదుట‌ప‌డుతుంది. అయితే ఈ సంకేతాలు మూత్రపిండాలు, కాలేయానికి సంబంధించిన రోగాలకు సూచిక కావొచ్చు. ఇలాంటి సంకేతాలు ఉంటే మీరు డాక్ట‌ర్ ను సంప్ర‌దించ‌డం మేలు.

పసుపు రంగు గోర్లుః
మీకు పసుపు రంగు గోర్లు ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ కు ఉంద‌ని అర్థం. దీన్ని అధిగ‌మించాలంటే చాలా క‌ష్టం. దీనికి డాక్ల‌ర్లు మందుల‌ను సూచిస్తారు, వాటిని వాడాల్సి ఉంటుంది. అయితే వీటి వ‌ల్ల కూడా ప‌లు  దుష్ప్రభావాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అలా కాకుండా మీరు ఆపిల్ సైడర్ వెనిగర్, ఆలివ్ ఆకు సారం లాంటి వాటిని వాడాలి. వాటితో సహజంగా నివారించుకునే వెసులుబాటు క‌లుగుతుంది. అలాగే గోర్లు నెమ్మదిగా పెరగటం, రంగు పాలిపోవటం వంటి స‌మ‌స్య‌ల‌ను గమనిస్తే వెంటనే డాక్ట‌ర్ ను క‌ల‌వాలి. ఇది మీ ఆరోగ్యానికి సంబంధించిన తీవ్రమైన సంకేతం కావొచ్చు. పసుపు గోర్లు ఉంటే ఊపిరితిత్తులకు సంబంధించిన స‌మ‌స్య‌లు మీకు ఉండే అవ‌కాశం ఉంది.

గోర్లు ఎరుపు రంగులో ఉంటేః
గోర్లు ఎక్కువ ఎరుపు రంగుతో ఉంటే  త్వ‌ర‌గా మీరు డాక్ట‌ర్ ను సంప్ర‌దించాలి. అది మాకు చాలా అవ‌స‌రం. ఎందుకంటే ఈ సూచిక‌ గుండె కు సంబంధించిన సంకేతం కావచ్చు. ఈ స‌మ‌యంలో మీ గుండెను మెరుగుప‌రుచుకోవ‌డానికి ప్రాసెస్ కొవ్వులను తీసుకోవడం వీలైనంత త‌గ్గించాలి. అట్లాగే ఒమేగా 3 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవాలి. ఇది చేప నూనెలో ఉంటుంది. అలాగే విటమిన్ D3 ఉండే వాటిని ఎక్కువ‌గా తీసుకోవాలి.

నీలం రంగు గోర్లుః
గోర్లలో నీలం లేదా ఊదా రంగును గమనిస్తే ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాధల్లో మీరు ఉన్నార‌ని అర్థం. ఇది మీరు గ‌మ‌నిస్తే.. ఆందోళ‌న చెంద‌కుండా డాక్ట‌ర్ ను సంప్ర‌దిస్తే.. అన్ని తెలుస్తాయి. ఇది నిజ‌మే అయితే రిలాక్సింగ్ గా ఉండ‌టం.రోజూ వ్యాయామం చేయడం చేయాలి. అలాగే రోజ్మేరీ నూనెను ఉపయోగించాలి. కాఫీ,మద్యం వంటి వాటిని త‌గ్గించుకోవ‌డం చాలా ఉత్త‌మం.

గోర్ల‌ల్లో ముదురు చారలుః
గోర్ల అంతటా ముదురు గోధుమ రంగు చారలు ఉండ‌టాన్ని మీరు గ‌మ‌నిస్తే..  చర్మ క్యాన్సర్ కు సంకేతంగా భావించాలి. ఈ సంకేతాలు ఉంటే మీరు త్వ‌ర‌గా డాక్ట‌ర్ ను సంప్ర‌దించాలి. అలాగే యాంటి ఆక్సి డెంట్స్ ఎక్కువ‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా చేస్తే కణాల రాడికల్ నష్టం నుంచి కొంత నివారించ‌డానికి సాయం చేస్తుంది.

ఇక గోర్ల మీద గుంటలు ఉంటే సోరియాసిస్ కి సంకేతం కావొచ్చు. పలచని లేదా పెళుసు గోర్లు ఉంటే డైట్ లో పోషకాలు లేక‌పోవ‌డం కావొచ్చు. ఈ స‌మ‌స్య‌లు ఉంటే మీరు డాక్ట‌ర్ల ను సంప్ర‌దించ‌డం మేలు. ఇవి అన‌న్ని నిజం కాక‌పోవ‌చ్చు. కేవ‌లం ఇవి ప్రాథ‌మిక విచ‌ర‌ణ కోస‌మే అని మ‌రిచిపోవ‌ద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *