మెడిక‌ల్ టెస్టులు, వాటి ఉప‌యోగాలు!

medical-tests-their-uses

మెడిక‌ల్ టెస్టులు, వాటి ఉప‌యోగాలు!

మ‌నం ఎంత ఆరోగ్యంగా క‌నిపించినా.. ప్ర‌తీ ఆరు నెల‌కు ఒకసారి వైద్య ప‌రిక్ష‌లు చేయించుకోవాలని డాక్ట‌ర్లు సూచిస్తుంటారు. కార‌ణం పైకి క‌నిపించే ఆరోగ్యం వేరు లోప‌ల మ‌న శ‌రీర అవ‌య‌వాల ప‌నితీరు వేరు అని చెబుతుంటారు. ఇలా టెస్టులు చేయించుకుంటే ఏ రోగం అయినా వ‌చ్చే అవ‌కాశం ఉంటే తెలుసుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు. దీంతో ఆ రోగాన్ని మొద‌ట్లోనే తుంచేయొచ్చిన సూచిస్తున్నారు. దీంతో మ‌నం ఆరోగ్యంగా ఉంటామ‌ని చెబుతున్నారు. అయితే ఈ టెస్టులు అనేక ర‌కాలుగా ఉంటాయి. ఒక్కో టెస్ట్ తో ఒక్కో రోగాన్ని గుర్తించొచ్చని సూచిస్తున్నారు.

అయితే అలాంటి టెస్టుల‌పై మ‌న‌కు కూడా కొంత అవ‌గాహ‌న అవస‌రం అప్పుడు మ‌నం దేనివ‌ల‌న ఇబ్బంది ప‌డుతున్నాం.. ఏ టెస్ట్ చేయించుకోవాల‌నేది తెలుస్తుంది. డాక్టర్లు ఒక‌ సమస్యకు చికిత్స చేసేందుకు దాని కారకాలు ఏంటో తెలుసుకుంటారు. అందులో భాగంగానే.. అత‌ని ఆరోగ్యం పై ఆరా తీస్తారు. అలాగే ప‌లు ప‌రీక్ష‌ల‌ను ప‌రిశీలిస్తారు. అయ‌తే సాధారణ వ్యాధులకు రక్త, మూత్ర పరీక్షలు అవసరం లేదు కానీ.. ఇప్పుడు ఆ ప‌రీక్ష‌లు స‌ర్వ‌సాధార‌ణం అయిపోయాయి. దాంతో ఎన్నో విష‌యాలు తెలుసుకోవ‌చ్చిని వైద్య‌లు చెబుతున్నారు.

ర‌క్త ప‌రీక్షః

ముందుగా వైద్యుడు మ‌న ఆరోగ్యం స‌రిగ్గా లేద‌ని భావిస్తే.. ర‌క్త ప‌రీక్ష చేయించుకోవాల‌ని సూచిస్తాడు. ఈ ప‌రీక్ష వ‌ల‌న ఎన్నో విష‌యాలు తెలుస్తాయి. దీని సాయంతో ఏ వైద్యం చేయాల‌నేది డాక్ట‌ర్ల‌కు సులువైతుంద‌ని తెలుస్తుంది. దీంతో వ్యాధి తాలుక చ‌రిత్ర కూడా తెలుస్తుంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. అయితే ఇందులో ప‌లు ర‌కాలు ఉన్నాయి. వాలిల్లో

కంప్లీట్ బ్లడ్ పిక్చర్

ఈ ర‌క్త‌ పరీక్షలో రెడ్ బ్లడ్ సెల్స్, హెమోగ్లోబిన్, ఈఎస్ఆర్, పీసీవీ, ఎంసీవీ, ఎంసీహెచ్, ఎంసీహెచ్ సీ, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్ లెట్స్ ల స్థాయి తెలుసుకోవ‌చ్చు. మ‌న శ‌రీరంలో ఎర్ర రక్త కణాలు క్యుబిక్ మీటర్ కు 4.56 మిలియన్ల మధ్య ఉండాలి. హెమోగ్లోబిన్ పురుషుల్లో 42-52 శాతం, మహిళలకు 36-48 శాతం ఉండాలి. ఇలా వీటి సంఖ్యను బట్టే డాక్ట‌ర్ ఒక అంచ‌నాకు వ‌స్తాడు.

యూరిన్ టెస్ట్ః

మ‌న శ‌రీరంలో మూత్ర పిండాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అవి మ‌నం ఆరోగ్యంగా ఉండ‌టంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మూత్ర పిండాలు శుద్ధి చేసిన తర్వాత వ్యర్థాలను బయటకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇది శరీరంలో అవసరానికి మించి నీటి నిల్వ‌లు ఉంటే వాటిని బ‌య‌ట‌కు పంపుతాయి. మనం తీసుకునే ఆహారం, ద్రవ పదార్థాల స్థాయిని బ‌ట్టి యూరిన్ కాంపోజిషన్ ఉంటుంది. మూత్రంలో సాధార‌ణంగా యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటిన్, సోడియం క్లోరైడ్, అమ్మోనియా, సల్ఫేట్స్, ఫాస్ఫేట్స్ ఉంటాయి. అయితే మూత్రాన్ని ప‌రీక్షించ‌డం వ‌ల‌న ఎన్నో ర‌కాల అనారోగ్యాల‌ను గుర్తించొచ్చని వైద్యులు తెలుపుతున్నారు.కంప్లీట్ యూరిన్ అనలైసిస్ లో యూరిన్ భౌతిక రూపాన్ని పరీక్షిస్తారు. అలాగే రసాయనిక విశ్లేషణ, మైక్రోస్కోప్ పరీక్ష కూడా చేస్తారు.

స్పెసిఫిక్ గ్రావిటీ అనే దాంతో యూరిన్ గాఢతను తెలుసుకుంటారు. దీని ఆధారంగా మూత్రంలో ప‌లు రకాల పదార్థాలను గుర్తిస్తారు. ఇది తక్కువ ఉంటే నీరు తీసుకున్నట్లు అర్థం. ఇక‌ పీహెచ్ అనేది అధికంగా లేదా తక్కువగా ఉంటే మూత్రంలో స్ఫటికాలు ఏర్పడే అవ‌కాశం ఉంద‌ని అర్థం. దాంతో కిడ్నీలో రాళ్లు తయార‌య్యే అవ‌కాశం ఉంది. పీహెచ్ ను ఆహారం, మందుల ద్వారా సరిచేయొచ్చు. ఇక మూత్రం రంగును బ‌ట్టి మ‌న ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు. మ‌న మూత్రం క‌నుక‌ గాఢంగా ఉంటే అది పలు మందులు తీసుకోవడం వల‌న‌, కొన్ని రకాల ఆహార పదార్థాలు కార‌ణాలు అయ్యే అవ‌కాశం ఉంది.

ఎక్స్ రేః

శరీరంలోని ఏదైనా భాగంలోకి రేడియేషన్ ను పంపినప్పుడు అక్కడి దృశ్యం మరోవైపు ఉంచిన ఫొటోగ్రఫీ ప్లేట్ పై తీసుకోవ‌చ్చు. దీని ఆధారంగా డాక్ట‌ర్లు రోగి స‌మ‌స్య‌ల‌ను గుర్తిస్తారు.ఒక వ్య‌క్తి న్యూమోనియాతో బాధపడుతుంటే అత‌నికి ఊపరితిత్తులను ఎక్స్ రే తీసినప్పుడు, ఎక్స్ రేలో ఆ భాగం తెల్లగా కనిపిస్తుంది. ఇలా రోగి ఆరోగ్య ప‌రిస్థితుల‌ను తెలుసుకునేందుకు ఎక్స్ రే ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ ఎక్స్ రేలతో బోన్ ను స్కాన్ చేసి ఎముకల రోగాల‌ను కూడా గుర్తించొచ్చు.

ఎంఆర్ఐః

మ్యాగ్నటిక్ రీసోనన్స్ ఇమేజింగ్ అనేది ఎంతో శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రాన్ని వాడుకుని వ్యాధి నిర్ధారణ చేస్తుంది. ఇందులో మ‌న‌ శరీరంలో ఉన్న నీటిని కుదుపునకు గురి చేస్తుంది. వీటిని ఎంఆర్ఐ మెషిన్ రికార్డు చేస్తుంది. ఈ రికార్డు ఆధారంగా ఫొటోల‌ను తీస్తుంది.

అల్ట్రాసౌండ్ః

అల్ట్రాసౌండ్ స్కాన్ ఇప్పుడు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో ఎక్కువ‌ ఫ్రీక్వెన్సీ ఉన్న తరంగాలను శరీరంలోకి పంపిస్తారు. ఇవి మ‌నకు ఏ విధమైన నొప్పి, అసౌకర్యాన్ని క‌లిగించ‌కుండా స్కాన్ చేస్తాయి. గర్భంలో ఉన్న పిండం, మూత్ర పిండాల్లో అణువణువుల‌ను ప‌రీక్షించేందుకు ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ఈసీజీ, ఈకేజీః

గుండెకు సంబంధించి రోగాల‌ను తెలుసుకునేందు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది గుండె కండరాలు, ఎలక్ట్రికల్ యాక్టివిటీని తెలుసుకునేందుకు చేస్తారు. నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఈ పరీక్ష పూర్తవుతుంది. దీని సాయంతో హార్ట్ బీట్ రేటును తెలుసుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *