ఈ పండ్లను తినటం ద్వారా శరీర బరువును తగ్గించుకోవచ్చు..!

lose-weight-by-eating-fruits

ఈ పండ్లను తినటం ద్వారా శరీర బరువును తగ్గించుకోవచ్చు..!

ప్రస్తుతకాలంలో ఆహారపు అలవాట్లలో పెద్దఎత్తున మార్పులు చోటుచేసుకోవడం వల్ల చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఒక్కసారి బరువు పెరిగితే బరువును తగ్గించుకోవటం ఒక పెద్ద సవాలుగా మారుతుంది. ప్రస్తుతం ఈ ఆహారపు అలవాట్లలో మార్పులు రావడం వల్ల వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అనేక శారీరక సమస్యలు తలెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే అధిక బరువు పెరగటం వల్ల ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే శరీర బరువును నియంత్రించుకోవడం కోసం అనేక వ్యాయామాలు చేయడం, జిమ్ కి వెళ్లడం, మంచి ఆహారపు అలవాట్లను పాటించడం వంటివి చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కనిపించడం లేదు.

ఈ విధంగా శరీర బరువును తగ్గించుకోవాలనే ఆలోచన లో ఉన్నవారు వీలైనంతవరకు వారి ఆహార విషయంలో అధిక ప్రాధాన్యత పండ్లకు ఇవ్వాలి. అధిక మొత్తంలో పండ్లను తీసుకోవటంవల్ల వాటిలో ఉండే పోషకాలు మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ని కరిగించి శరీర బరువును నియంత్రించడంలో దోహదపడతాయి. అయితే శరీర బరువును నియంత్రించడం కోసం ఎలాంటి పండ్లను తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…

టమోటాలు:

ప్రతిరోజు మన ఆహారపదార్థాలలో ఎంతో విరివిగా ఉపయోగించే ఈ టమోటాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ టమోటాలలో అధిక శాతం ఫ్లేవనాయిడ్లు, లెప్టిన్ అనే పదార్థం పుష్కలంగా లభిస్తుంది. టమోటాలలో ఉండే లెప్టిన్ అనే పదార్థం మన శరీర బరువును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.అయితే టమోటాలను సహజసిద్ధంగా పండించే వాటిని మాత్రమే మన ఆహార పదార్థాల లో చేర్చుకోవడం వల్ల శరీర బరువును నియంత్రించుకోవడం. ఆ విధంగా కాకుండా ముందుగా తయారు చేసిన టమోటో కెచప్ లను, టమోటో సాస్ లను మన ఆహార పదార్థాలలో ఉపయోగించడం వల్ల శరీర బరువు తగ్గడం కాకుండా, అధిక శరీర బరువును పెంచుతుంది.

అవకాడో:

శరీర బరువు తగ్గాలనుకొనే వారికి అవకాడో ఒక మంచి ఆహార పదార్థం అని చెప్పవచ్చు. అవకాడో ఎక్కువభాగం యాంటీఆక్సిడెంట్ లతో నిండి ఉంటుంది. విటమిన్ బి, విటమిన్ బి 6, మెగ్నీషియం, మొదలైన ఖనిజాలు ఎక్కువగా లభిస్తాయి. ఈ అవకాడోను క్రమం తప్పకుండా మన ఆహార పదార్థాల లో భాగంగా తీసుకోవటంవల్ల శరీర బరువును నియంత్రించుకోవడం.

నారింజ పండ్లు:

శరీర బరువు వేగంగా తగ్గాలంటే కొనేవారు అధికభాగం నారింజ పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. నారింజ పండ్లలో శరీర బరువును తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. నారింజ పండ్లలో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం అధిక శాతంలో లభిస్తాయి.

అదేవిధంగా నారింజ పండ్లలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటంతో పాటు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఈ సిట్రస్ జాతి పండ్లు ను తరచూ తినడం వల్ల మన శరీరానికి తగినంత రోగనిరోధకశక్తి అందడమే కాకుండా, శరీర బరువును క్రమంగా తగ్గిస్తుంది.

స్ట్రాబెర్రీస్:

చూడటానికి ఎరుపు రంగులో ఉండి ఎంతో ఆకర్షణీయంగా కనిపించే స్ట్రాబెర్రీస్ తినడానికి తీపి పులుపు రుచి కలిగి ఉంటుంది.ఈ స్ట్రాబెర్రీస్ లో అధిక భాగం యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి లభిస్తుంది. అదేవిధంగా మన శరీరంలో హెచ్‌డిఎల్ లేదా మంచి కొవ్వు స్థాయిలను పెంచడానికి కూడా స్ట్రాబెర్రీస్ దోహదపడతాయి. ఇందులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీర బరువును నియంత్రించడంలో కీలక పాత్ర వహిస్తాయి.

పుచ్చకాయ:

పుచ్చకాయలు అధిక శాతం నీటిని కలిగి ఉండటం వల్ల మన శరీరానికి కావలసినంత నీటిని అందిస్తుంది. అధికంగా నీరు ను తీసుకోవడం వల్ల వీలైనంతవరకు శరీర బరువును తగ్గుతారు. అదేవిధంగా మన శరీరం అధిక శాతం నీటిని కలిగి ఉండటం వల్ల చెమట రూపంలో మన శరీరం నుంచి బయటకు విసర్జించబడతాయి.

అదేవిధంగా పుచ్చకాయలలో అర్జినిన్ అని పిలువబడే బొడ్డు కొవ్వు బర్నింగ్ అమైనో ఆమ్లాలతో సమృద్ధిగా ఉంటాయి. దీనివల్ల శరీర బరువును నియంత్రించుకోవడం. ఈ పుచ్చకాయలో పొటాషియం సమృద్ధిగా లభించడం వల్ల గుండె పనితీరును మెరుగు పరచడమే కాకుండా, కండరాల నొప్పులను కూడా తగ్గిస్తాయి.

జామ పండ్లు:

జామపండ్లు అధికభాగం లైకోపిన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ శాతం అధికంగా ఉంటాయి. క్రమం తప్పకుండా ఈ జామ పండ్లను తీసుకోవడం వల్ల మన శరీరంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహ సమస్యతో బాధపడేవారు అధికభాగం జామ పండును తీసుకోవడం వల్ల మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి లైకోపిన్ మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగించి,శరీర బరువును నియంత్రించడం కాకుండా గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

ద్రాక్ష:

శరీర బరువును నియంత్రించడానికి ద్రాక్ష ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ద్రాక్షలో అధిక భాగం ఫైటోకెమికల్స్, విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది, ఈ రెండూ వ్యాధులతో పోరాడటమే కాకుండా మన బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంతటి అద్భుతమైన పోషక విలువలు కలిగిన ద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చు.

ఆపిల్:

ప్రతిరోజు ఒక ఆపిల్ పండు తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు అనే విషయం మనకు తెలిసిందే. అయితే క్రమం తప్పకుండా ఆపిల్ తినడం వల్ల శరీర బరువును కూడా నియంత్రించవచ్చు. ఆపిల్ పండులో ఉండే ఫ్లేవనాయిడ్లు, ఫైబర్స్ శరీర బరువును నియంత్రించడంలో దోహదపడతాయి. అదేవిధంగా ఆపిల్ పండులో ముఖ్యంగా పెక్టిన్ ,ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఆపిల్‌లో కేలరీలు, చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల శరీర బరువును నియంత్రించడానికి దోహదపడుతుంది.

రాతి పండ్లు:

రాత్రి పనులు అనగా లోపల విత్తనం గట్టిగా ఉండి చుట్టూ కండ కలిగిన పండ్లను రాతి పండ్లు అని పిలుస్తారు. ఈ రాతి పండ్లనే డ్రూప్స్ అని కూడా పిలుస్తారు ఉదాహరణకు పీచ్, నేరేడు పండు, చెర్రీ, రేగుపండ్లు మొదలైనవి. ఈ రాతి పండ్లలో తక్కువ కేలరీలు కలిగి ఉండి, అధికంగా విటమిన్ సి, విటమిన్ ఏ అధికంగా లభిస్తాయి. ఈ పండ్లను అధికంగా తీసుకోవటం వల్ల శరీర బరువును నియంత్రించుకోవడం.

కివి:

కివి పండ్లను పోషకాల రారాజు అని పిలుస్తారు.విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలేట్ , ఫైబర్ వంటి అద్భుతమైన ఔషధాలు మనం కివీ నుంచి పొందవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి అధికంగా లభించడం వల్ల మన శరీరానికి తగినంత రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కివి పండ్లు దోహదపడతాయి.

పై తెలిపిన ఈ పండ్లను తరచూ తీసుకోవడం వల్ల మన శరీరానికి తగినంత పోషకాలు అందడంతో పాటు శరీర బరువును నియంత్రించడంలో దోహదపడతాయి. ఈ పండ్లను పండ్ల రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల మన శరీర బరువును వేగంగా నియంత్రించుకోవచ్చనీ నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లను తీసుకోవడంతో పాటు శరీర వ్యాయామాలను కూడా చేయాలి. వీలైనంత వరకు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లకు దూరంగా ఉండటం వల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *