ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే మీ లివర్ డేంజర్ జోన్ లో ఉన్న‌ట్లే !

Lever Diseases

ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే మీ లివర్ డేంజర్ జోన్ లో ఉన్న‌ట్లే !

మ‌న శ‌రీరంలో అత్యంత పెద్ద అవయవమైన  కాలేయం (లివర్) అధిక ప్రాధాన్య‌త‌ను క‌లిగి ఉంటుంది. ఎందుకంటే మ‌నకు ఎలాంటి అనారోగ్య సమ‌స్య‌లు రాకుండా.. మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో లివ‌ర్ ముఖ్య భూమిక పోషిస్తుంది. ఇది శ‌రీరంలోని అనేక విధుల‌ను నిర్వర్తించ‌డంలో కీల‌కంగా ఉంటుంది.

శ‌రీరంలో ఐదు ప్ర‌త్యేక‌మైన ప‌నుల‌ను చేయ‌డంతో పాటు శ‌రీరానికి అవ‌స‌ర‌మైన వేయికి పైగా ఎంజైమ్స్ త‌యారీలో ఇది పాలుపంచుకుంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు మ‌న శ‌రీరంలో ఏ భాగంలోనైనా గాయం అయితే.. వెంట‌నే కారుతున్న రక్తం గ‌డ్డ‌క‌ట్టి.. ప్ర‌స‌ర‌ణ‌ను అడ్డుకుంటుందంటే అది లివ‌ర్ చేసే ప‌నుల్లో ఒక‌ట‌ని అర్థం. అలాగే, లివ‌ర్  జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరులో, జీర్ణ‌క్రియ‌లో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

మ‌రీ ముఖ్యంగా మ‌నం అనారోగ్యానికి గురైతే, ఏమైనా వ్యాధులు మ‌న‌ల్ని అటాక్ చేస్తే.. వాటి నుంచి శ‌రీరానికి ర‌క్ష‌ణ క‌ల్పించే విధంగా యాంటీబాడీస్‌ను ఉత్ప‌త్తి చేసేది కూడా లివ‌రే. అలాగే, శ‌రీరంలో పేరుకుపోయిన మృత క‌ణాల‌ను బ‌య‌ట‌కు పంపించేది కూడా లివ‌రే. ఇలాంటి అత్యంత ప్ర‌ధాన‌మైన ప‌నులు చేసే లివ‌ర్ దెబ్బ‌తింటే మ‌నిషి ప్రాణాలు కోల్పోవ‌డం ఖాయం. అయితే, లివ‌ర్ డెంజ‌ర్ జోన్‌లోకి చేరుకుంటోంది అనే ల‌క్ష‌ణాలు ముందుగానే గుర్తంచ‌వ‌చ్చు. ఎక్కువ‌గా లివ‌ర్ దెబ్బ‌తింటున్న‌ది అంటే దానికి మ‌ద్య‌పానం ఒక్క‌టే కార‌ణం అని సాధార‌ణంగా ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు.

మ‌ద్య‌పానం సేవించ‌ని వారికి లివ‌ర్ స‌వ‌స్య‌లు రావ‌నుకుంటే కూడా పొర‌బాటే. కొన్ని సార్లు మ‌నం తీసుకునే ప‌లు ర‌కాలైన ఆహారాల వ‌ల్ల కూడా లివ‌ర్ దెబ్బ‌తింటుంది. దీనికి ప్ర‌ధానం కారణం లివ‌ర్ పై భాగంలో దాని చుట్టూ కోవ్వు అధికంగా చేరుకోవ‌డ‌మే. దీనిని వైద్య ప‌రిభాష‌లో ఫ్యాటీ లివ‌ర్ సిండ్రోమ్‌గా పిలుస్తుంటారు. అంటే లివ‌ర్ చేడిపోతున్న‌ద‌ని అర్థం. ఇదొక్క‌టే కాదు చాలా ర‌కాలైన వ్యాధులు లివ‌ర్‌ను ప్ర‌భావితం చేస్తాయి. ముందుగానే లివ‌ర్ సంబంధ వ్యాధులు వ‌స్తున్నాయ‌న‌డానికి గుర్తించే కొన్ని ల‌క్ష‌ణ‌లు ఇప్పుడు తెలుసుకుందాం..!

కామెర్లుః

కాలేయం దెబ్బ‌తింటున్న‌ది అన‌డానికి స‌ర్వ సాధార‌ణంగా క‌నిపించే ల‌క్ష‌ణాల్లో కామెర్లు ఒక‌టి. కామెర్ల కార‌ణంగా చ‌ర్మం ప‌సుపు వ‌ర్ణంలోకి మారుతుంది. అలాగే, క‌ళ్లు సైతం లేత ప‌సుపు రంగులోకి మారితే అది త‌ప్ప‌కుండా కామెర్లు అని గుర్తించాలి. కాలేయం దెబ్బ‌తింటున్న‌ద‌ని అన‌డానికి ఈ ల‌క్ష‌ణాల‌తో పాటు పాలిపోయిన చ‌ర్మం, ప‌సుపు రంగులోకి మారుతున్న కళ్లు  కూడా సాక్షంగా నిలుస్తాయి. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే కాలేయం ప‌నిచేయ‌కుండా.. మ‌లినాల‌ను శ‌రీరం నుంచి బ‌య‌ట‌కు పంపించ‌డంలో విఫ‌ల‌మ‌వుతుంది. దీని కార‌ణంగా శ‌రీరంలోని ఇత‌ర అవ‌య‌వాల‌పై ప్ర‌భావం పడుతుంది.

లివర్ ఫైబ్రోసిస్:

ఆరోగ్య క‌ర‌మైన లివ‌ర్ క‌ణజాలం దెబ్బ‌తిన్న‌ప్పుడు లివ‌ర్ ఫైబ్రోసిస్ ఏర్ప‌డుతుంది. అంటే లివ‌ర్ దెబ్బ‌తిని కొంత భాగం మ‌చ్చ‌గా మారిపోతుంది. ఈ ర‌క‌మైన లివ‌ర్ డ్యామేజ్ వ‌ల్ల కాళ్ల‌ల్లో కొద్దిగా వాపులు క‌నిపిస్తాయి. ఇది ఫైబ్ర‌యోస్ సార్స్ దెబ్బ‌తీస్తుంద‌ని గ‌ర్తించాలి.

లివర్ సిస్ట్:

లివ‌ర్  సిస్ట్ అనేది కాలేయంలో గ‌డ్డ‌లు ఏర్ప‌డ‌టం. దీని కార‌ణంగా పొత్తి క‌డుపు పైన కుడివైపు మూల‌న లేదా ప‌క్క‌టెముకకు కింది కుడి భాగంలో నొప్పి క‌లుగుతుంది. అంటే ఇది కాలేయం దెబ్బ‌తిన్న‌ద‌న‌డానికి ల‌క్ష‌ణంగా గుర్తించాలి. ఇది లివ‌ర్ ప‌రిస్థితి మ‌రింత తీవ్ర ప్ర‌భావానికి గురైన‌ప్పుడు క‌నిపిస్తుంటుంది.

హెపటైటిస్:

క‌లుషిత‌మైన ఆహరం, నీరు తీసుకోవ‌డం ద్వారా కూడా లివ‌ర్ ప్ర‌భావానికి గుర‌వుతుంది. అంటే, కాలేయం స‌మ‌స్య‌లు మ‌రింత ముదిరితే దానిని హెప‌టైటిస్‌గా పేర్కొంటారు. ఈ స‌మ‌యంలో వాంతులు, విరేచ‌నాలు, జ్వ‌రం, అల‌స‌ట‌, క‌ళ్లు తిర‌గ‌డం, జ‌లుబు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయి. ఇది కాలేయం దెబ్బ‌తింటున్న‌ద‌న‌డానికి ల‌క్ష‌ణాలుగా గుర్తించాలి.

వికారం చేయ‌డంః

సాధార‌ణంగా కాలేయం స‌రిగా ప‌నిచేయ‌క‌పోతే వికారంగా అనిపిస్తుంటుంది. అంటే మ‌నం తీసుకుంటున్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. క‌డుపు ఉబ్బ‌రంగా అనిపిస్తుంటుంది. ఇది వ‌రుస‌గా రెండు మూడు రోజులు క‌నిపిస్తే.. లివ‌ర్ డ్యామేజ్ అవుతున్న‌ద‌ని అర్థం చేసుకోవాలి.

మూత్రం రంగు మార‌టం.. ఎక్కువ‌గా అల‌స‌ట అనిపించ‌టం !

సాధార‌ణంగా మనం నీరు రోజుకూ ఐదు లీట‌ర్ల ద‌గ్గ‌ర‌గా తీసుకుంటున్న‌ప్ప‌టికీ.. మూత్రం రంగూ మారుతూ వ‌స్తుందంటే లివ‌ర్ బెబ్బ‌తిన‌డం మూలానే అని తెలుసుకోవాలి. మ‌రీ ముఖ్యంగా మూత్రం డార్క్ ఎల్లో రంగులో వ‌స్తే.. లివ‌ర్ సంబంధ వ్యాధులు వ‌స్తున్నాయ‌ని గుర్తించాలి.

పై ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించినా.. అవి మ‌రింత‌గా ఎక్కువ‌గా అనిపించినా వైద్యుల‌ను వెంట‌నే సంప్ర‌దించ‌డం ఉత్త‌మ‌మైన ప‌ని. ఎందుకంటే లివ‌ర్ సంబంధం వ్యాధులు ముదిరితే ఒక్కో సారి ప్రాణాల‌కే  ప్ర‌‌మాద‌కరంగా మారుతుంది.  అయితే, సాధార‌ణంగా లివ‌ర్ వ్యాధుల బారిన‌ప‌డ‌కుండా ఉండాలంటే ఇంటి వ‌ద్ద‌ల‌నే కొన్ని ప‌నులు చేస్తే స‌రిపోతుంది. వాటిల్లో ముఖ్యమైంది ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవ‌డం. అంటే ఆహారం, మ‌నం తాగే నీరు శుభ్ర‌మైన‌దిగా ఉండాలి.  నీరు అధికంగా తాగాలి. అయిన‌ప్ప‌టికీ.. సంబంధిత స‌మ‌స్య‌లు, ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *