కిడ్నీ మార్పిడి ఎలా చేస్తారంటే..?

Kidney Transplantation

కిడ్నీ మార్పిడి ఎలా చేస్తారంటే..?

శ‌రీరంలో ప్ర‌తీ అవ‌య‌వం చాలా ముఖ్య‌మైంది. అయితే శ‌రీరం లోప‌ల ఉన్న అతి ముఖ్య‌మైన వాటిల్లో కిడ్నీ ఒక‌టి. అయితే కిడ్నీకి సంబంధించిన కొన్ని రోగాలు వ‌చ్చిన‌ప్పుడు వాటికి చికిత్స ఉండ‌దు. ఆ టైంలో కిడ్నీ మార్పిడి చాలా అవ‌స‌రం. ముఖ్యంగా క్రోనిక్ కిడ్నీ ఫెయిల్యూర్ రోగుల‌కు కిడ్నీ మార్పిడి చాలా అవ‌స‌రం. అందుకోసం ఆరోగ్య‌మైన వ్య‌క్తుల నుంచి అత‌ను బ్ర‌తికి ఉన్న లేకుంటే చ‌నిపోయినా కూడా ఆప‌రేష‌న్ ద్వారా అత‌ని నుంచి తీసి క్రోనిక్ కిడ్నీ ఫెయిల్యూర్ రోగుల‌కు అమార్చుతారు. ఈ ప్రాసెన్ నే కిడ్నీ మార్పిడి అంటారు.

ఇది ఎప్పుడు అన‌వసరంః

ఒక వ్య‌క్తికి రెండు కిడ్నీల్లో ఒక‌టి ప‌నిచేయ‌క‌పోతే శరీరంలో కిడ్నీకి సంభందించిన అన్నివిధుల‌ను రెండో కిడ్నీ చేస్తుంది. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ సరియైన చికిత్సతో కిడ్నీ బాగు చేయొచ్చు. అలా చికిత్స చేసిన త‌ర్వాత ఆ కిడ్నీ కూడా ప‌ని చేస్తుంది. అలాంటి రోగుల‌కు కిడ్నీ మార్పిడి అవ‌స‌రం ఉండ‌దు.

 

మార్పిడి ఎప్పుడు అవసరంః

క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ రోగుల్లో 100% పైగా పనిచేయనప్పుడు మందులు తీసుకున్నా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఆ స‌మ‌యంలో ఆరోగ్యం మ‌రింత క్షీణిస్తుంది. డ‌యాల‌సిస్ చాలా అవ‌స‌రం ఉంటుంది. ఆ రోగుల‌కు ఉత్త‌మ‌మైన మార్గం కిడ్నీ మార్పిడి.

 

కిడ్నీ మార్పిడి అవ‌స‌రం ఎంతః

క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు రెండు కిడ్నీలు పూర్తిగా పనిచేయనప్పుడు వారి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంది. అలాగే  ఆరోగ్యంగా ఉండేందుకు వారు వారంలో 3 నుంచి 4 సార్లు డయాలిసిస్ చేయించుకోవాలి. అలాగే మందుల‌ను వాడాల్సి ఉంటుంది. ఈ రోగులు ఆరోగ్యంగా ఉండేందుకు స‌రైన స‌మ‌యంలో డ‌యాల‌సిన్ చేయించుకోవాలి. మందుల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా వాడాలి. ఇలాంటి వారికి కిడ్నీ మార్పిడితో విముక్తి ల‌భిస్తుంది. అలా మార్చిన త‌ర్వాత వారు సంతోష‌క‌ర‌మైన జీవితాన్ని అనుభ‌విస్తారు.

మార్పిడి వల‌న క‌లిగే లాభాలుః

కిడ్నీ మార్పిడి వ‌ల‌న రోగులు మంచి లైఫ్ లీడ్ చేస్తారు. సామాన్య వ్యక్తుల లాగే జీవించే అవ‌కాశం వ‌స్తుంది. డయాలిసిస్ నుండి విముక్తి ల‌భిస్తుంది. ఆహార నియమాల్లో తక్కువ మార్పులు వ‌స్తాయి. రోగులు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. పురుషుల శారీరక సంబంధాల్లో  అవరోధాలు ఉండదు. ఈ ప్రాసెస్ ద్వారా మహిళలు పిల్లలకు జన్మ ఇవ్వొచ్చు. ఉపచారముకు అయ్యే మొదటి యేడాది ఖర్చు ఆ తరువాత ఉండదు.

కిడ్నీ మార్పిడి వల‌న క‌లిగే నష్టాలుః

కిడ్నీ మార్పిడితో  పెద్ద ఆపరేషన్ అవసరం ఉంటుంది. అయితే ఇది సురక్షితమైంది కూడా. మొదట్లో మార్పిడి మంచిగానే అయిన‌ప్ప‌టికి  కొందరు రోగుల్లో మ‌ళ్లీ కిడ్నీ పాడైయ్యే అవకాశం ఉండేది. కిడ్నీ మార్పిడి తరువాత వైద్యులు సూచించిన విధంగా మందుల‌ను వాడాల్సి ఉంటుంది. మొదట్లో ఇవి చాలా ఖర్చుతో కూడిన‌విగా ఉంటాయి. కొన్ని రోజుల వరకు మందులు ఆపేస్తే.. మార్పిడి చేసిన కిడ్నీ పాడైపోయే ప్రమాదం పొంచి ఉంది. అలాగే ఈ కిడ్నీ మార్పిడి చికిత్స చాలా ఖర్చుతో కూడినది. ఆపరేషన్ , హాస్పిటల్ ఖర్చు ఎక్కువ‌గా ఉంటాయి. అల‌లాగే  మందులు, తరుచు లేబరేటరీల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం చాలా ఉంటుంది. అది కూడా ఖ‌ర్చుతో కూడిన‌ది.
కిడ్నీ మార్పిడి ఎప్పుడు చేయింకుకోక‌పోవ‌డం మంచిదిః
వ్యాధి సోకిన వ్య‌క్తి ముస‌లివాడైన‌ప్పుడు. రోగికి ఎయిడ్స్, కాన్సర్ వంటి వ్యాధులు ఉన్న‌ప్పుడు కిడ్నీ మార్పిడి చేయరు. అయితే క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ రోగులంద‌రికి ప్ర‌తి దాత కిడ్నీ స‌రిప‌డ‌వు. రోగి బ్లడ్ గ్రూప్ దృష్టిలో ఉంచుకొని వైద్యులు వారికి ఎవ‌రి కిడ్నీ ఉప‌యెగ‌ప‌డుతుందో నిర్ణ‌యిస్తారు. కిడ్నీ దాతల అలాగే కిడ్నీ తీసుకొనే వ్యక్తుల బ్లడ్ గ్రూప్ సరిపడినా కూడా కొన్ని సార్లు మార్పుకు ఉప‌యోగ‌ప‌డ‌దు. ఎందుకంటే రక్తములోని తెల్ల కణాల్లో ఉండే హెచ్ ఎల్ఎ పదార్థ‌ స్థాయిలు సామానంగా ఉండాలి. దీన్ని హెచ్ఎల్ఎ మ్యాచింగ్ టెస్టు ద్వార గుర్తిస్తారు.
కిడ్నీ ఎవ‌రికి ఇవ్వొచ్చుః

సాధారణంగా 18 నుంచి 70 వయసున్న వ్యక్తుల నుంచి కిడ్నీని తీసుకుంటారు. స్త్రీలు, పురుషులు ఒకరికి ఇంకొక‌రు కిడ్నీ ఇవ్వొచ్చు. కవలలు తమ్ముడు లేదా చెల్లెలు కిడ్నీ దాతలుగా సరిపోతారు. కానీ ఇది సాధారణముగా జ‌ర‌గ‌ని ప‌ని. ఒక వేళ ఈ కిడ్నీ దాతల నుండి కిడ్నీ దొరకక‌పోతే.. వేరే కుటుంబ సభ్యుల నుంచి కిడ్నీ తీసుకోవచ్చు. ఇది కూడా జ‌ర‌గ‌క‌పోతే.. భార్య భ‌ర్త‌ల కిడ్నీని చెక్ చేస్తారు. ఇలా కూడా జ‌ర‌గ‌క‌పోతే.. ఇతర దేశాల్లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కిడ్నీని మార్పిడికి తీసుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *