ఎండు మిర్చి వల్ల… పది కాలాల పాటు గుండె పదిలం..!

is-chilli-good-for-heart

ఎండు మిర్చి వల్ల… పది కాలాల పాటు గుండె పదిలం..!

ఎండు మిరపకాయలు భారతదేశంలో ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయి. అసలు ఎండుమిరపకాయలు లేదా పొడి లేకుండా భారతీయ వంటకాల రుచులను ఊహించుకోలేము. ఎండు మిరపకాయలను పౌడర్ రూపంలో లేదా మసాలా రూపంలో ఏదో ఒక విధంగా మన వంటలలో తరచూ ఉపయోగిస్తున్నాము. మన దేశ వ్యాప్తంగా వివిధ రకాల ప్రాంతాలలో ఒక్కో రకమైన ఎండుమిర్చిలను పండిస్తున్నారు.ఇంతటి ప్రాధాన్యత కలిగి ఉన్న ఈ ఎండు మిరపకాయలను కేవలం వంటలలో రుచికి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా దాగి ఉన్నాయి. ఈ ఎండుమిర్చి లను ప్రతిరోజు వంటల రూపంలో తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

చూడటానికి ఎరుపు రంగును కలిగి ఉండే ఈ మిరపకాయలలో ప్రాధమిక బయోయాక్టివ్ ప్లాంట్ సమ్మేళనం, క్యాప్సైసిన్ అని పిలుస్తారు, ఎర్ర మిరపకాయల రుచిని ఆరోగ్యప్రయోజనాలను కలిగించడానికి క్యాప్సైసిన్ అనే పదార్థం కీలక పాత్ర పోషిస్తుంది.

కండరాలు, కీళ్లనొప్పులతో పోరాడుతుంది:

చాలా మందిలో అధికంగా వేధించే సమస్యలు కండరాలు, కీళ్ల నొప్పులు సమస్య ఒకటి. ఈ సమస్యకు క్యాప్సైసిన్ ఒక చక్కటి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు. ఎండు మిరపకాయలలో ఉండే ఈ పదార్థం కండరాలు కీళ్ళ నొప్పులు వల్ల వచ్చేటటువంటి మంటతో పోరాడుతుంది. క్యాప్సైసిన్ నొప్పి అనుభూతిని తగ్గించడానికి నొప్పిని గ్రహించి నరాల చివర్లో బంధించడం వల్ల కండరాలు కీళ్ళ నొప్పుల సమస్య నుంచి పూర్తి విముక్తి కలిగిస్తుంది.

జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది:

మన శరీరములు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎండుమిరపకాయలు కీలకపాత్ర పోషిస్తాయి.ఎండు మిరపకాయలను ఆహారం ద్వారా తీసుకోవడం వల్ల శరీరంలోకి వెళ్లి అధికశాతం జీర్ణరసాలను ఉత్పత్తి చేయడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి. జీర్ణక్రియ రేటు మెరుగుపడటం వల్ల మలబద్దక సమస్య నుంచి పూర్తిగా విముక్తి కలిగిస్తుంది. ఎండు మిరపకాయలలో ఉన్నటువంటి యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మన శరీరంలో ఉన్న హానికర బ్యాక్టీరియాలతో పోరాడి వాటిని మన శరీరం నుంచి బయటకు పంపుతాయి.

బరువును తగ్గిస్తుంది:

అధికంగా శరీర బరువు పెరిగిన వారు ఎండు మిరపకాయలను తరచూ ఆహారపదార్థాల ద్వారా తీసుకోవడం వల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఈ ఎండుమిరపకాయలలో ఉన్నటువంటి క్యాప్సైసిన్ పలు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను క్రమంగా దహనం చేస్తూ వస్తోంది. అదే విధంగా మనలో కలిగే ఆకలి కోరికలను సైతం చంపేస్తుంది కాబట్టి శరీర బరువు పెరగకుండా క్రమంగా బరువును నియంత్రించడానికి దోహదపడుతుంది.

హిమోగ్లోబిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది:

మన శరీరానికి కావల్సినంత హిమోగ్లోబిన్, ఐరన్ ఉత్పత్తిని ఎండుమిరపకాయలు పెంపొందిస్తాయి. ఎండు మిరపకాయల పొడిని వంటల్లో ఉపయోగించడం వల్ల మన శరీరానికి కావలసినంత ఐరన్, హిమోగ్లోబిన్ ను ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా మన శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంపొందిస్తుంది. ఈ విధంగా మన శరీరానికి మెదడుకు కావలసినంత ఆక్సిజన్,రక్తం సరఫరా కావడంతో అభిజ్ఞ రుగ్మతలను తగ్గించడమే కాకుండా, పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

గుండె పనితీరును మెరుగుపరుస్తుంది:

ఎర్ర కారం పొడిలో ఉన్నటువంటి ముఖ్యమైన క్యాప్సైసిన్ ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ మరియు ప్లేట్‌లెట్ అగ్రిగేషన్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఇది శరీరం ఏర్పడిన ఫైబ్రిన్ ను కరిగించడానికి కూడా సహాయపడుతుంది. ఎండు మిరపకాయలలో ఉన్నటువంటి ఈ పదార్థాలన్నీ మన శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంతో పాటు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అదేవిధంగా గుండెకు సంబంధించినటువంటి వ్యాధులను దూరం చేస్తుంది.

ఇటలీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ప్రకారం తరచూ ఎండు మిరపకాయలను ఆహారపదార్థాల ద్వారా తీసుకునే వారిలోగుండెపోటు లేదా గుండెపోటుతో చనిపోయిన వారి సంఖ్య దాదాపు 41 శాతం తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే ఎండు మిరపకాయలను వారంలో కనీసం నాలుగు రోజుల పాటు తీసుకోవడం ద్వారా గుండె పనితీరు ఎంతో మెరుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు

శ్లేష్మమాన్ని శుభ్రం చేస్తుంది:

ఈ ఎర్రటి కారంపొడి ముక్కు నుంచి శ్లేష్మం క్లియర్ చేయడం ద్వారా నాసికా రద్దీని తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దానిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు దీర్ఘకాలిక సైనస్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. తద్వారా జలుబు వంటి సమస్యల తో బాధపడుతున్నప్పుడు ముక్కు ద్వారా శ్లేష్మం బయటకు విడుదలయి శ్వాసక్రియకు ఎలాంటి అంతరాయం లేకుండా కాపాడుతుంది.

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది:

ఎండు మిరపకాయలు లేదా పొడిలో తగినంత మోతాదులో బీటాకెరోటిన్, విటమిన్-సి లభిస్తాయి. ఈ రెండు మన శరీరంలో ఏర్పడేటటువంటి జీర్ణ వ్యవస్థ, మూత్ర మార్గం ఇన్ఫెక్షన్ల నుంచి మాత్రమే కాకుండా, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి అనేక సమస్యల నుంచి కూడా మన శరీరాన్ని కాపాడి మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

చర్మంపై ముడతలను తొలగిస్తుంది:

ఎండు మిరపకాయలలో ఉన్నటువంటి క్యాప్సైసిన్ అనే పదార్థం ఆరోగ్య ప్రయోజనాలను అందించడం మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.చర్మ సౌందర్య ఉత్పత్తులను తయారు చేసేటప్పుడు ఎండుమిరపకాయలలో ఉన్నటువంటి క్యాప్సైసిన్ అనే పదార్థాన్ని ఉపయోగించడం వల్ల మన చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు.

అయితే అధిక ప్రయోజనాలు కలిగి ఉన్నాయని ఈ ఎండు మిరపకాయలను ప్రతిరోజు ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ముఖ్యంగా అజీర్తి, కడుపులో మంట, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి, తగినంత పరిమాణంలో ఎండు మిరపకాయలను తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *