హార్మోన్‌ ప్రాముఖ్యత ఏమిటంటే?

importance-of-hormones

హార్మోన్‌ ప్రాముఖ్యత ఏమిటంటే? 

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం తీసుకునే మంచి ఆహారం ఒక్క‌టే స‌రిపోదు. మ‌న శ‌రీరంలో ఉత్ప‌త్తి అయ్యే హర్మోన్లు కూడా చాలా అవ‌స‌రం. త‌ల్లి క‌డుపులో పిండంగా ఏర్పడిన‌ప్ప‌టి నుండి చ‌నిపోయే వ‌ర‌కు ఈ హార్మోన్ల ప్ర‌భావం చాలా ఉంటుంది. ఇవి మ‌న బాడీలో ఒక కణం నుంచి మరొక కణానికి రసాయనిక సమాచారం అందజేస్తాయి. ఈ సంకేతాలను తెలియ‌జేసే కెమికల్స్‌ను హార్మోన్లు అని పిలుస్తారు.

మెదడులోని హైపోథాలమస్‌, పిట్యూటరి గ్రంధులు హార్మోన్ల ఉత్పత్తికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇవి శరీరంలోని కణాల క్రమబద్ధతకు చాలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ హార్మోన్లు మ‌న శ‌రీరంలోని ప‌లు విష‌యాల‌ను అదుపులో ఉంచుతాయి. వాటిల్లో శరీర ఉష్ణోగ్రత, ఆకలి, మానసిక స్థితి, నిద్ర, దాహం, కామక్రోధలు మొద‌లైన‌వ‌న్నంటిని హార్మోన్లే అదుపులో ఉంచుతాయి.

ఇప్పుడు ఎక్కువ‌గా చూస్తున్న  హైపోథైరాయిడ్‌, సీసీఒడీ, సంతానలేమి, డయాబెటిస్‌ వంటి రోగాల‌కు ముఖ్య కార‌ణం ఈ హార్మోన్లు స‌మ‌తుల్యంగా లేక‌పోవ‌డ‌మే.. ఎన్నో రకాల హార్మోన్లు మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. హార్మోన్లు పాలిపెప్టైడ్‌తో నిర్మిత‌మ‌వుతాయి. ఇవి ర‌సాయ‌న వావ‌హ‌కాలు.ఇవి శరీరంలో ఒక ప్రాంత కణజాలం మాత్ర‌మే కానీ.. ప‌లు అవయవాల నుంచి ఉత్పత్తి అవుతుంది.శరీర భాగాలకు రక్తం ద్వారా ప్ర‌వ‌హిస్తుంది. ఇవి జీవప్రక్రియ సమతుల్యతకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

అయితే హార్మోన్ల సమతుల్యం దెబ్బతింటే ఎన్నో రోగాల బారిన ప‌డ‌తాము. హార్మోన్లు ఎండోక్రైన్‌, ఎక్సోక్రైన్‌ గ్రంధుల నుంచి విడుద‌ల అవుతాయి. ఇవి శరీరంలో త‌క్కువ మోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ ఇవి ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. జీర్ణక్రియ, శారీరక, మానసిక ఎగుదుదల, మానసిక సమతుల్యత‌ల‌కు ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.ఇందులో థైరాయిడ్‌ హార్మోన్లు టీ3, టీ4లు థైరాయిడ్‌ గ్రంధి నుంచి విడుద‌ల అవుతాయి. ఇవి స‌మ‌తుల్యంగా లేక‌పోతే అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఆ స‌మ‌స్య‌ల్లో హైపోథైరాయిడ్‌, హైపర్‌థైరాయిడ్‌, గాయిటర్ మొద‌లైన రోగాలు వ‌స్తాయి.

మహిళ‌ల్లో వ‌చ్చే హార్మోన్‌ సమస్యలుః

మ‌హిళ‌ల్లో ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టిరాన్‌, ప్రొలాక్టిన్‌, ఆక్సిటోసిన్‌ హార్మోన్లు ఉత్ప‌త్తి అవుతాయి. ఇవి మ‌హిళ‌ల్లో నెలసరి, లైంగిక లక్షణాలు, సంతానోత్పత్తి మొద‌లైన వాటికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే ఈ హార్మోన్లు స‌రిగ్గా ఉత్ప‌త్తి కాక‌పోతే ప‌లు స‌మ‌స్య‌లు వ‌స్తాయి. వాటిల్లో నెలసరి సమస్యలు, అవాంచిత రోమాలు, సంతానలేమి వంటి స‌మ‌స్య‌లు అధికంగా వ‌స్తాయి. అలాగే హార్మోన్లు ఎక్కువ త‌క్కువ అవ్వ‌డం వ‌ల‌న మ‌హిళ‌ల్లో మానసిక అశాంతి, నీరసం కీళ్లనొప్పులు కూడా వ‌స్తాయి.

పురుషుల్లో వ‌చ్చే‌ సమస్యలుః

పురుషుల్లో టెస్టోస్టిరాన్ విడుద‌ల అవుతుంది. ఇది ఎముకల సాంద్రతకు, కండరాల పటుత్వానికి, వీర్యకణాల వృద్ధికి ఉప‌యోగ ప‌డుతుంది. టెస్టోస్టిరాన్‌ లోపం వల్ల ఎన్నో ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తాయి. వాటిల్లో సెక్స్‌ప్రోబ్లమ్స్‌, కండరాల పటుత్వం త‌గ్గుద‌ల‌, డిప్రెషన్‌, టైప్‌ 2 డయాబెటిస్ వంటివి అధికంగా వ‌స్తాయి. ఇవే కాకుండా హై పోగొనాజిజమ్ కూడా వచ్చే అవకాశం ఉంది. టెస్టోస్టిరాన్‌ హార్మోన్ స‌రిగ్గా విడుద‌ల కాక‌పోతే.. శీఘ్రస్కలనం, అంగస్తంభన సమస్యలు వ‌స్తాయి. అలాగే వీర్యకణాల లోపాలు, సంతానలేమి సమస్యలు కూడా వస్తాయి. పిల్ల‌ల్లో అయితే బరువు, ఎత్తు, ఎదుగుదల సమస్యలు అధికంగా వస్తాయి.

హార్మోన్లు సమతుల్య‌త కోసంః

హార్మోన్ల సమతుల్యత లేపోవ‌డం ఈ రోజుల్లో ఎంతో మంది మహిళలు ఎదుర్కొంటున్న అతి పెద్ద స‌మ‌స్య‌. దీంతో బరువు ఎక్కువ‌గా పెరగడం, నిద్ర పట్టకపోవడం, బద్ధకంగా అనిపించడం, రుతు సంబంధిత రోగాలు వ‌స్తున్నాయి.హార్మోన్లు అన్ని స‌రిగ్గా విడుదలైనప్పుడే మ‌నం ఆరోగ్యంగా ఉండగ‌ల‌ము. అవి స‌రిగ్గా విడుద‌ల కావాలంటే కొన్ని చిట్కాలు..

ఎనిమిది గంటల నిద్రః
మ‌నం ప‌నుల మీద ప‌డి నిద్రస‌రిగ్గా పోక‌పోతే అది హార్మోన్ల విడుద‌ల‌పై ప్ర‌భావం చూపుతుంది. దాంతో హార్మోన్లు స‌రిగ్గా విడుద‌ల కావు. అందుకే రోజుకి 8 గంటల నిద్ర చాలా అవ‌స‌రం. దీన్ని అలవాటు చేసుకోవాలి. హార్మోన్లు సమతుల్యంగా ఉంటే మ‌న బ‌రువు కంట్రోల్ లో ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలు రావు.

వ్యాయామంః
హార్మోన్ల సమతుల్యంగా లేన‌ప్పుడు వ్యాయామం మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. వాకింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాల‌ను చేయ‌డంతో  హార్మోన్ల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. కానీ ఏ వ్యాయామం చేయాల‌నేది నిపుణుల స‌ల‌హా తీసుకుని చేయ‌డం చాలా మంచిది.

ఆహారంః
మంచి  ఆహారం తీసుకోడం వ‌ల‌న కూడా హార్మోన్లను స‌మ‌తుల్యంగా ఉంచొచ్చు. మ‌నం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లు అధికంగా ఉండాలి. రోజూ రెండుమూడు రకాల కూరగాయలు, పండ్ల‌ను తీసుకోవ‌డం చాలా ముఖ్యం. ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే ఆకుకూరల‌ను అధికంగా తీసుకోవాలి. ఇది ఇన్సులిన్ స్థాయిని స‌మ‌తుల్యంగా ఉంచుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *