కళ్ళకింద ఏర్పడిన బ్యాగ్స్ తొలగిపోవాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే..!

 

 

how to get rid of eye bags

కళ్ళకింద ఏర్పడిన బ్యాగ్స్ తొలగిపోవాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే..!

ప్రతి ఒక్కరు ఎంతో అందంగా కనిపించాలని మార్కెట్లో లభించే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మనం అందంగా కనపడాలంటే మార్కెట్లో దొరికే సౌందర్య ఉత్పత్తులను వాడటం కాకుండా కొంతవరకు మన చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవాలి. ఈ విధంగా ఎంతోమంది అందంగా తయారైనప్పటికీ కొందరిలో మాత్రం కళ్ళ కింద నల్లటి వలయాలు, అదేవిధంగా కళ్ళకింద ఎత్తుగా బ్యాగ్స్ ఏర్పడి ఉంటాయి.

ఈ విధంగా కళ్ళకింద ఈ బ్యాగ్స్ ఏర్పడటంవల్ల ఎంతోమందికి అందవిహీనంగా ఉంటుంది. ఈ బ్యాగులను తొలగించుకోవాలని ప్రతి ఒక్కరు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొందరిలో ఎలాంటి ప్రయోజనాలు కనపడక కళ్ళ కింద బ్యాగ్స్ తో బాధపడుతుంటారు.

ఈ విధంగా కళ్ళకింద బ్యాగులు ఏర్పడ్డాయి అంటే వయసు ఎక్కువైందని అర్థం కాదు. వయసుతో సంబంధం లేకుండా కనురెప్పలకు మద్దతు ఇచ్చే కండరాలతో సహా మన కళ్ళ చుట్టూ ఉన్నటువంటి కణజాలాలు వాటి స్థితిస్థాపన కోల్పోవటం వల్ల కళ్ళు అలసిపోయి తరచూ మనల్ని నిద్రపోయేలా ప్రేరేపిస్తాయి. ఈ విధంగా అధిక అలసట ఒత్తిడి కలిగినప్పుడు మన కళ్ళ కింద బ్యాగులు ఏర్పడతాయి. ఈ బ్యాగ్ ను తొలగించుకోవడం కోసం ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే సులువైన చిట్కాలు పాటించడం ద్వారా తొలగించుకోవచ్చు. అయితే ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

టీ బ్యాగులు:

తల కింద ఏర్పడిన బ్యాగులను తొలిగించుకోవాలంటే టీ బ్యాగులు ఎంతో ఉపయోగపడతాయి. టీ బ్యాగ్స్ మన కంటి పై పెట్టుకోవడం వల్ల కంటి కింద ఉన్నటువంటి బ్యాగులు తొలగిపోతాయి. రెండు చిన్న సంచులులలో ఒక టేబుల్ తీసుకొని టీ పౌడర్ వేసి ఐదు నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. ఈ వేడిగా ఉన్న టీ సంచులను మన కళ్ళ పై వేసుకొని ఒక మృదువైన వస్త్రంతో కప్పి అరగంట పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఈ టీ పౌడర్ లో ఉన్న కెఫిన్ అనే పదార్థం కళ్ళ కింద ఏర్పడిన ఈ బ్యాగ్ లను తొలగించడంలో ఉపయోగపడుతుంది.

అదేవిధంగా గ్రీన్ టీ బ్యాగులను ఉపయోగించి కూడా కళ్ళకింద ఏర్పడిన బ్యాగ్స్ ను తొలగించుకోవచ్చు. అయితే ఈ గ్రీన్ టీ సంచులను చల్లటి నీటిలో నానబెట్టి కళ్ళపై వేసుకోవాలి.గ్రీన్ టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మన కళ్ళ చుట్టూ ఉన్న కణజాలాలలో తిరిగి చైతన్యాన్ని నింపుతాయి. అదేవిధంగా కళ్ళు ఎరుపుగా ఉండటం, కళ్ల మంటలు కూడా గ్రీన్ టీ సంచులు నివారిస్తాయి. అయితే ఈ చిట్కాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాటించడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు.

నూనెలు:

తలకింద ఉన్నటువంటి కణజాలాలు నిర్జీవంగా మారినప్పుడు కళ్ళకింద ఉబ్బెత్తుగా ఏర్పడి ఉంటాయి. వీటిని తొలగించడానికి కొన్ని రకాల నూనెలు ఎంతో ఉపయోగపడతాయి. వాటిలోలావెండర్ ఆయిల్ చర్మంపై అంటించుకోవడం వల్ల చర్మాన్ని, నరాలు బిగుతుగా ఉండే విధంగా చేస్తుంది. అదేవిధంగా నిమ్మనూనె మన శరీరాన్ని అధిక ఒత్తిడి నుంచి విముక్తిని కల్పిస్తుంది. ఈ నూనెలో సహజ యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల కళ్ల కింద ఉన్న చర్మం ఎంతో ఆరోగ్యంగా బిగుతుగా చేసుకునే విధంగా చేస్తుంది.చమోమిలే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఇరిటెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇది కళ్ళ కింద ఏర్పడిన చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.

మనం చేయాల్సిందల్లా ఈ మూడు రకాల నూనెలను ఒక టేబుల్ టీ స్పూన్ చొప్పున ఒక గిన్నెలో తీసుకొని అందులోకి టీ స్పూన్ నీటిని కలిపి బాగా మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ విధంగా కలిపిన నూనెలను రాత్రి పడుకునే సమయంలో మన కళ్ళ కింద చర్మంపై రాసి నెమ్మదిగా, మృదువుగా మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ చిట్కాను క్రమం తప్పకుండా పాటించడం వల్ల మేలైన ఫలితాలు కనిపిస్తాయి.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె, లారిక్ ఆమ్లంలో శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇవి మన శరీరానికి కావలసిన పోషకాలను అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా మన చర్మం పొడిబారకుండా తేమగా ఉండే విధంగా చేస్తాయి. ఈ కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా వాడటం ద్వారా కళ్ళ కింద ఏర్పడిన బ్యాగులను తొలగించవచ్చు. రాత్రి పడుకునే సమయంలో కళ్ళ చుట్టూ ఈ నూనెను సవ్య, అపసవ్య దిశలో మృదువుగా మసాజ్ చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

కోల్డ్ స్పూన్స్:

మన ఇంట్లో లభించే టటువంటి స్టీల్ స్పూన్ లను ఉపయోగించడం వల్ల మన శరీరంలో రక్త నాళాలను సడలించడానికి, అదేవిధంగా వాపును తగ్గించడానికి ముఖ్య పాత్ర వహిస్తాయి.4 నుంచి 5 స్పూన్స్ ను రిఫ్రిజిరేటర్ లో ఉంచుకొని మన కళ్ళ పై దాదాపు 15 నిమిషాల వరకు పెట్టుకోవాలి. ఈ విధంగా చేయటం ద్వారా మన కళ్ళ కింద ఏర్పడిన వాపును ఎంతో సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది. ఈ విధంగా రోజుకు కనీసం రెండు మూడు సార్లు పాటించాలి.

బేకింగ్ సోడా:

ప్రధానంగా మనం వంటలలో ఉపయోగించే బేకింగ్ సోడారక్తప్రవాహాన్ని ప్రోత్సహించి కంటి కింద ఏర్పడిన సంచులను సైతం తొలగించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడా మంచి ఎక్స్‌ఫోలియెంట్‌గా పని చేయడమే కాకుండా కంటి కింద చనిపోయిన చర్మకణాలను సైతం తొలగిస్తుంది. ఈ చిట్కాను ఉపయోగించడానికి ఒక టేబుల్ టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక టీ స్పూన్ వేడి నీటిని కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి.

ఈ మిశ్రమంలో శుభ్రమైన కాటన్ బాల్స్ వేసి బాగా నానబెట్టాలి. నానబెట్టిన కాటన్ బాల్స్ ను మన కళ్ళపై వేసుకొని దాదాపు 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. అనంతరం చల్ల నీటితో మనం ముఖం శుభ్రం చేసుకోవాలి. అయితే చాలా మృదువైన చర్మం ఉన్నవారు బేకింగ్ సోడాను ఉపయోగించకపోవడం ఎంతో ఉత్తమం.

కీర దోసకాయ:

కీరదోసకాయ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది. ఈ కీరదోసకాయ ముక్కలను ఒక ఇరవై నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్ లో ఉంచుకొని వాటిని 15 నిమిషాలపాటు మన కళ్ల పై ఉంచుకోవటం వల్ల కంటిలో ఉన్నటువంటి మలినాలను తొలగించడం కాకుండా, మన కళ్ళకు తేమను కూడా కలిగిస్తాయి. అదేవిధంగా కళ్ళ కింద ఏర్పడిన వాపులను తగ్గించడంలో కీర దోసకాయ కీలక పాత్ర పోషిస్తుంది.

అదేవిధంగా కళ్ళ కింద ఏర్పడినటువంటి నల్లటి వలయాలను సైతం ఈ కీరదోస దూరం చేస్తుంది. ప్రతిరోజు ఈ విధంగా రెండు సార్లు చేయడం వల్ల కంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

కలబంద:

మన చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో కలబంద కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కలబందలో అవసరమైన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల మన చర్మాన్ని ఎంతో అందంగా తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా కలబంద మన కళ్ళ కింద ఏర్పడిన సంచులను తగ్గించడమే కాకుండా, యాంటీఏజింగ్ ఎఫెక్ట్ ను కలిగి ఉంటుంది.

కలబంద లో ఉన్న జల్ ను మన చర్మానికి రాసుకొని దాదాపు 8_10 నిమిషాల వరకు విశ్రాంతి తీసుకునే అనంతరం చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.ఈ సులువైన చిట్కాలను పాటించడం వల్ల కళ్ళ కింద ఏర్పడిన సంచులను పోగొట్టుకొని ఎంతో అందమైన కళ్ళను మీ సొంతం చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *