దంతాలు పుచ్చిపోవద్దు అంటే ఇలా చేయాలి!

home remedies for tooth cavities

దంత క్షయం  అరికట్టే హోంరెమెడీస్..

మ‌న ఆరోగ్యం బాగా ఉండాలంటే మంచి ఆహారం, వ్యాయ‌మం చాలా అవ‌స‌రం కదా.. వీటితో పాటు ఆహారాన్ని తినేట‌ప్పుడు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే మన దంతాలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే మ‌నం తీసుకునే ఆహారాన్ని స‌రిగ్గా న‌మ‌ల‌గ‌లుగుతాం. లేక‌పోతే మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ మీద ఒత్తిడి ప‌డుతుంది. కానీ ప్ర‌పంచంలో ఎంతో మంది టూత్ డికే, కేవిటీల వంటి ఓరల్ హెల్త్ ప్రాబ్లెమ్స్ తో బాధ‌ప‌డుతున్నారు. పిల్లల్లో, టీనేజర్స్ అలాగే వృద్ధులలో కూడా ఈ స‌మ‌స్య స‌ర్వ‌సాధార‌ణం అయిపోయింది.

అయితే ఈ స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించ‌క‌పోతే ఎన్నో ఇబ్బందులు వ‌స్తాయ‌ని వైద్యులు సూచిస్తున్నారు. వాటిల్లో టూత్ డికే తో పళ్ళ మధ్యలో రంధ్రాలు ఏర్పడతాయి. వీటిని డెంటల్ కేవిటీస్ అని పిలుస్తారు. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వ‌ల్ల‌ ఇవి వ‌స్తాయి. దీంతో పళ్లలోని హార్డ్ టిష్యూస్ పూర్తిగా దెబ్బతింటాయి. సరైన డెంటల్ హైజీన్ పాటించాలి. లేక‌పోతే ఇలాంటి స‌మ‌స్య‌లే వ‌స్తాయి.

ఈ కేవిటీస్ బారిన పడే ప్రమాదాన్నికొన్ని ఫ్యాక్టర్స్ ఎక్కువ‌గా పెంచుతాయి. వాటిల్లో దంతాల మధ్యలో ఆహారపదార్థాలు ఇరుక్కుపోవడం, ఎప్పుడూ ఎదో ఒకటి తినటం, సరైన ఓరల్ హైజీన్ ను పాటించకపోవడం, డ్రై మౌత్ వంటి కార‌ణాలతో ఈ కేవిటీస్ ఏర్ప‌డుతుంది. బులీమియా, అనోరెక్సియా లాంటి ఈటింగ్ డిజార్డర్స్ కూడా ప‌ళ్ల స‌మ‌స్య‌ల‌కు కార‌ణం అవుతాయి. దంతాల‌ నొప్పులు, టూత్ సెన్సిటివిటీ, తినేటప్పుడు అలాగే తాగేటప్పుడు చిన్నపాటి నుంచి విపరీతమైన నొప్పి లాంటివి టూత్ డికే, కేవిటీలకు సంబంధించిన స‌మ‌స్య‌ల లక్షణాలు.

అయితే ఈ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డానికి క్రోన్స్, రూట్ కెనాల్స్ , ఫిల్లింగ్స్ లాంటివి టూత్ డికే , కేవిటీలకు చేసే ట్రీట్మెంట్స్ గా చెప్పొచ్చు. అయితే కొన్ని నేచుర‌ల్ రెమెడీస్ ను వాడితే.. కేవిటీల‌తో పాటు టూత్ డికేను అరిక‌ట్టొచ్చు.. వాటిలో

లవంగంః

దంత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో లవంగాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇందులో యాంటీ ఇంఫ్లేమేటరీ, అనాల్జేసిక్ , యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు ఉంటాయి. ఇవి దంతాల‌ నొప్పిని తగ్గిస్తాయి. అలాగే కేవిటీలను స్ప్రెడ్ కానివ్వకుండా రక్షిస్తాయి. లవంగాన్ని నములుతూ ఉంటే దాని నుంచి ఆయిల్ వస్తుంది. అప్పుడు ఆ లవంగాన్ని కొన్ని నిముషాలు అలా చ‌ప్ప‌రిస్తూ ఉండాలి.

ఉప్పుః

దంత స‌మ‌స్య‌ల‌కు ఉప్పుకూడా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో కేవిటీలను అరికట్టే గుణం ఉంటుంది. ప‌లు దంత సమస్యలకు ఉప్పు ప‌రిష్కారం చూపుతుంది. ఉప్పులో యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు ఉంటాయి. నోట్లోని ఇంఫ్లేమేషన్ ను ఇది తగ్గిస్తుంది. అలాగే దంతాల నొప్పిని అదుపులో ఉంచుతుంది. అలాగే బాక్టీరియా గ్రోత్ ను అరిక‌ట్టేస్తుంది. ఒక టీస్పూన్ ఉప్పును ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలోకి క‌ల‌పాలి. దాన్ని ఒక నిమిషం పాటు పుక్కిలించాలి. ఇలా రోజుకు మూడు, నాలుగు సార్లు చేస్తే దంత స‌మ‌స్య‌లు రావు.

గార్లిక్ః

యాంటీ బాక్టీరియల్, యాంటీ బయోటిక్ ప్రాపర్టీస్ సమృద్ధిగా గార్లిక్ లో ఉంటాయి. ఇవి టూత్ డికే, కేవిటీలను సులభంగా త‌గ్గిస్తుంది. నాలుగు గార్లిక్ క్లోవ్స్ ను క్రష్ చేసి అందులో పావు టీస్పూన్ రాక్ సాల్ట్ క‌ల‌పాలి. దాన్ని ఇంఫెక్టెడ్ టూత్ కి అప్లై చేయాలి. 10 నిమిషాల పాటు అలాగే ఉంచి రిన్స్ చేయాలి. రోజుకు ఒక మూడు సార్లు అలా చేస్తే ఎంతో ప్ర‌యోజ‌నం ఉంటుంది.

లికోరైస్ః

దంతాల రూల్ కు లికోరైస్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది దంతాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. కేవిటీని కలిగించే బాక్టీరియా గ్రోత్ ను పూర్తిగా చంపేస్తుంది. ఎండిన లికోరైస్ రూట్ పౌడర్ తో బ్రష్ చేసుకుంటే చాలా మంచిది.

పసుపుః

యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ పసుపులో ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే టూత్ డికే ను అరికడతాయి. కొంచెం పసుపును ప్రభావిత పంటిపై అప్లై చేయాలి. కొన్ని నిమిషాలప‌టు అలాగే ఉండ‌నివ్వాలి.

వేపాకులుః

వేపాకులు దంతాల సంర‌క్ష‌ణ‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డతాయి. అలాగే ఇందులో కేవిటీలను అరికట్టే లక్షణాలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి కేవిటీలను కలిగించే బాక్టీరియాను చంపేస్తుంది. వేపాకుల రసాన్ని పళ్ళపై చిగుళ్లపై రబ్ చేస్తే.. దంత సంర‌క్ష‌ణ‌కు మంచిది. రోజుకు రెండు సార్లు చేయ‌డం ఉత్త‌మం.

ఉసిరిః

యాంటీ ఆక్సిడెంట్స్ ఉసిరి లో పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ సీ కూడా పుష్క‌లంగా దొరుకుతుంది. ఉసిరిలో బాక్టీరియాపై పోరాటం జ‌రిపే శ‌క్తి ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ ను అరికట్టే శ‌క్తి కూడా ఉంటుంది. ప్రతి రోజూ ఉసిరిని తిన‌డం ఎంతో మంచిది.

టీ ట్రీ ఆయిల్ః

నోటిని ఆరోగ్యంగా ఉంచ‌డంలో టీ ట్రీ ఆయిల్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది చిగుళ్ళను దృఢంగా మారుస్తుంది. ఈ ఆయిల్ లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి దంత సమస్యలపై పోరాటం చేస్తాయి. దంతాల‌ను, చిగుళ్ళను కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ తో మసాజ్ చేయాలి. దాంతో దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *