పాదాలు పగులుతున్నాయా.. ఈ చిట్కాలను ప్రయత్నించండి!

cracked feet home remedies

పాదాలు పగులుతున్నాయా.. ఈ చిట్కాలను ప్రయత్నించండి!

సాధారణంగా చాలామందిలో వేసవి కాలం, శీతాకాలం మన సంబంధం లేకుండా పాదాల పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఈ విధంగా పాదాలు పొందడంతో చూడటానికి ఎంతో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కొందరిలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఈ విధంగా కాళ్లు పగలటం కొందరు సాధారణ విషయంగా తీసుకొని వదిలేస్తారు. అలాంటి వారిలో ఈ సమస్య మరింత తీవ్రమై ఎక్కువ నొప్పిని కలిగిస్తుంది. ఈ విధంగా పగిలిన పాదాల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ సమస్య మరింత బలపడి పగుళ్ల నుంచి రక్తం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.

సాధారణంగా ఇతర చర్మ భాగాలు మాదిరిగా కాకుండా పాదాలు తొందరగా పొడిబారతాయి. ఎందుకంటే పాదాల చర్మంలో నూనె గ్రంధులు లేకపోవడం వల్ల చర్మం త్వరగా పొడిబారుతుంది. ఏ విధంగా పాదాల చర్మం త్వరగా పొడిబారడం వల్లే పగుళ్లు ఏర్పడతాయి. అదే విధంగా పాదాలకు సరైన మాయిశ్చరైజర్ లేకపోవడం, వాతావరణ కాలుష్యానికి గురికావడం వంటివి పాదాల పగుళ్ళకు కారణం అవుతాయి. ఈ విధంగా పగుళ్లు ఏర్పడిన పాదాల నుంచి రక్షణ పొందడం మన చేతుల్లోనే ఉంది.ఈ విధమైనటువంటి పాదాల పగుళ్ల నుంచి రక్షణ పొందటానికి మన ఇంట్లో దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి పాదాల పగుళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

1) లిస్టరిన్,వెనిగర్:

పగిలిన పాదాలను నయం చేయడానికి, పాదాల పగుళ్లు నొప్పి నుంచి విముక్తి కలగడానికి లిస్టరిన్,వెనిగర్ ద్రావణాలు ఎంతగానో ఉపయోగపడతాయి. లిస్టరిన్‌లో థైమోల్ మరియు ఆల్కహాల్ ఉన్నాయి. ఈ రసాయనాలు గోరు ఫంగస్ తో పోరాడటానికి పగిలిన పాదాలను నయం చేయటానికి, చర్మాన్ని ఉపశమనం కలిగించడానికి దోహదపడతాయి. అదేవిధంగా వెనిగర్ లో ఉండే తేలికపాటి ఆమ్లాలు పొడిబారిన మరియు చనిపోయిన చర్మానికి మృదువుగా చేయటంవల్ల చర్మం ఎక్స్‌ఫోలియేట్ సులభం అవుతుంది.

ఒక కప్పు లిస్టరిన్, ఒక కప్పు తెలుపు వెనిగర్ మరియు 2 కప్పుల నీటి మిశ్రమాన్ని సిద్ధం చేయాలి. ఈ మిశ్రమంలో మన పాదాలను 15 నిమిషాల పాటు నానబెట్టాలి.15నిమిషాల తర్వాత మన పాదాలను బయటకు తీసే పాదాలపై ఉన్న చనిపోయిన చర్మాన్ని తీసి వేయాలి. తరువాత ప్యూమిస్ రాయిని  ఉపయోగించి చర్మంపై బాగా స్ర్కబ్ చేయాలి. తర్వాత శుభ్రమైన నీటితో మన పాదాలను కడగాలి.ఈ విధంగా పాదాల పగుళ్ళు మాయం అయ్యే వరకు ప్రతి రోజూ చేయడం వల్ల మన పాదాలు పగుళ్ళ సమస్యల నుంచి విముక్తి పొందడమే కాకుండా, ఎంతో మృదువుగా తయారవుతాయి.

2) బియ్యపు పిండి, తేనె, వెనిగర్:

పగిలిన మన పాదాల సమస్య నుంచి విముక్తి పొందటానికి బియ్యపు పిండి, తేనె, వెనిగర్ ఎంతగానో దోహదపడతాయి. బియ్యపు పిండి మన చర్మానికి ఎక్స్‌ఫోలియేట్ చేసి శుద్ధి చేస్తుంది. తేనే అనేది అనేది సహజ క్రిమినాశక మందు, ఇది పగిలిన పాదాలను నయం చేయడానికి సహాయపడుతుంది. ఇక వెనిగర్లో తేలికపాటి ఆమ్లాలు ఉండటంవల్ల చర్మం మృదువుగా తయారు కావడానికి దోహదపడుతుంది.ఈ మూడింటిని మిశ్రమంలా తయారు చేసుకుని వాటి ద్వారా ఈ పగిలిన పాదాల నుంచి విముక్తి పొందవచ్చు.

ముందుగా మూడు స్పూన్ల బియ్యం పిండి, ఒక స్పూన్ తేనె, మరియు 2-3 చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపడం ద్వారా స్క్రబ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఒక మందపాటి పేస్టులా తయారు చేస్తూ బాగా కలియబెట్టాలి.మీ పాదాలను గోరువెచ్చని నీటిలో పది నిమిషాల పాటు నానబెట్టి తరువాత ఈ మిశ్రమాన్ని వేసి బాగా రబ్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల పాదాల పై ఏర్పడిన చనిపోయిన చర్మం తొలగిపోయి పాదాలు మృదువుగా తయారవుతాయి.

3) అరటిపండు:
అరటిపండు సహజ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. అరటి పండులో విటమిన్ ఏ, బి6, సి అధికంగా ఉన్నాయి.ఈ విధంగా అరటిపండులో అధిక మొత్తంలో విటమిన్లు ఉండటం వల్ల ఇవి చర్మం స్థితిస్థాపకతను కాపాడటానికి, చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది.ఇన్ని ప్రయోజనాలు కలిగిన అరటి పండును ఉపయోగించి మన పాదాలకు కలిగిన పగుళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు.

బాగా పండిన అరటి పండ్లను మెత్తని మిశ్రమంలా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని కాలి గోరు నుంచి పాదాలు మొత్తం ఈ మిశ్రమాన్ని సున్నితంగా రాయాలి.ఈ మిశ్రమాన్ని సుమారు 20 నిమిషాల పాటు అలాగే ఉండనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ విధంగా చేయటం వల్ల పాదాల పగుళ్లు తగ్గిపోవడమే కాకుండా చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అయితే ఈ విధమైన పద్ధతిని రెండు వారాలపాటు పడుకునే ముందు చేయటం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు.

4) తేనె:
పగిలిన పాదాలకు తేనె ఒక మంచి నివారణిగా సహాయపడుతుంది. తేనె ఒక సహజ హ్యూమెక్టాంట్, అంటే ఇది లోపలి కణజాలాల నుంచి చర్మం బయటి పొరలకు నీటిని ఆకర్షిస్తుంది. ఈ మార్పు పాదాల పగుళ్ళను నయం చేయడానికి దోహదపడుతుంది.

గోరువెచ్చని నీటిలోకి ఒక కప్పు తేనె జోడించి, మీ పాదాలను దాదాపు 20 నిమిషాల పాటు ఆ మిశ్రమంలో నానబెట్టి మసాజ్ చేయాలి. అదేవిధంగా 20 నిమిషాల మసాజ్ అనంతరం ప్యూమిస్ రాయిని తీసుకొని స్క్రబ్ చేయడం ద్వారా చర్మం మృదువుగా తయారవుతుంది. అయితే ఇది ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు చేయటం వల్ల ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

5) కూరగాయల నూనె:
కూరగాయల నుంచి తయారయ్యే నూనెలు తొందరగా మన చర్మం గ్రహించబడుతుంది. ఈ నూనెలలో ఎక్కువ భాగం ప్రోవిటమిన్ ఏ, డి ,ఈ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని పోషించడానికి మరియు కొత్త కణాలను ఏర్పాటు చేయడానికి దోహద పడతాయి.

కూరగాయల నూనె ద్వారా మృదువైన పాదాలను పొందటానికి ముందుగా గోరు వెచ్చని నీటితో పాదాలను శుభ్రం చేసే, శుభ్రమైన టవల్ తో పాదాలను తుడచాలి. తర్వాత కూరగాయల నూనెతో పాదాలపై మసాజ్ చేసి, శుభ్రమైన సాక్స్ ధరించి రాత్రంతా అలాగే ఉంచాలి. ఈ విధంగా చేయటం ద్వారా మన పాదాలకు నూనెలు మంచి మాయిశ్చరైజర్ గా ఉపయోగపడి పగుళ్ళను నివారిస్తుంది.

6) వంట సోడా:
పగిలిన పాదాలకు వంటసోడా మంచి ఎక్స్‌ఫోలియంట్. వంట సోడా మన పాదాలపై చనిపోయిన కణాలను తొలగించి శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉండటమే కాకుండా దుర్వాసనను కూడా తటస్థం చేస్తుంది. గోరువెచ్చని నీటిలోకి మూడు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేసి అది కరిగే వరకు నీటిని బాగా కలియబెట్టాలి. ఈ నీటిలో మన పాదాలను 15 నిమిషాలపాటు నానబెట్టాలి. 15 నిమిషాల తర్వాత పాదాలను తీసి ప్యూమిస్ రాయితో మెత్తగా స్క్రబ్ చేయండి. తరువాత శుభ్రమైన నీటితో పాదాలను కడిగి ఆరబెట్టాలి. ఈ విధంగా చేయటం ద్వారా పాదాల పగుళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు.

7) కలబంద జెల్:
పగిలిన పాదాలకు కలబంద మంచి నివారణగా చెప్పవచ్చు. కలబందలో విటమిన్ ఏ, సి ,ఇ పుష్కలంగా ఉన్నాయి. కలబందలో అధికభాగం యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు దాగి ఉన్నాయి.కలబంద, కొలెస్టెరాల్, β- సిటోస్టెరాల్ మరియు కలబందలో ఉండే లుపియోల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. లుపియోల్ క్రిమినాశక మరియు అనాల్జేసిక్ గా కూడా పనిచేస్తుంది. కలబందలో ఉండే ఆక్సిన్స్ మరియు గిబ్బెరెల్లిన్స్ పాదాల పై ఏర్పడిన గాయాలను నయం చేయడానికి దోహదపడతాయి.

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పాదాలను గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసే పాదాలపై కలబంద జెల్ మందపాటి పొరను పాదాలకు అంటించాలి.కాటన్ సాక్స్ ధరించి రాత్రంతా అలాగే పడుకొని మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో పాదాలను శుభ్రం చేసుకోవాలి. కనీసం వారం రోజుల పాటు ఈ విధంగా చేయటం వల్ల పాదాలు ఎంతో మృదువుగా తయారవడం కాకుండా సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *