అసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా… అయితే ఈ ఇంటి చిట్కాలు పాటించాల్సిందే..!

home-remedies-for-acidity

 

అసిడిటీ నివారించడానికి  ఇంటి చిట్కాలు ఇవే…!

ప్రస్తుతం ఎంతోమంది అసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి గల కారణం మనం తీసుకునే ఆహారంలో అనేక మార్పులు చోటు చేసుకోవడమే. మనం అధిక గాఢత కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మన శరీరంలో గ్యాస్ట్రిక్ గ్రంథుల నుంచి అధిక మోతాదులో యాసిడ్ విడుదలవడం వల్ల కడుపులో మంట, నొప్పిని కలుగజేస్తుంది. ఈ విధంగా అసిడిటీ సమస్య ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు గురిచేస్తుంది.

అదే విధంగా సరైన సమయానికి భోజనం చేయకుండా ఖాళీ కడుపుతో ధూమపానం, మద్యపానం సిగరేట్ వంటి వాటిని సేవించడం వల్ల కూడా మన శరీరంలో అధిక శాతం ఆమ్లాలు విడుదల అవుతాయి. ఈ విధంగా సాధారణ స్థాయి కంటే అధికంగా మన శరీరంలో ఆమ్లాలు విడుదల అవడం వల్ల చాతిలో ఎక్కువగా మంటను కలుగజేస్తూ ఎంతో ఇబ్బంది పెడుతుంది. ఈ విధమైన ఎసిడిటీ సమస్యతో తరచూ బాధపడేవారు మన వంటింట్లో దొరికే మసాలా దినుసులు ద్వారా కొన్ని చిట్కాలను పాటిస్తూ ఈ సమస్యలు తగ్గించుకోవచ్చు. అసిడిటీని తగ్గించే ఆ సులువైన చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

తులసి ఆకులు:

ప్రతి ఇంటి ఆవరణంలో లభించే ఈ తులసి ఆకులలో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నాయని మనకు తెలిసిందే.ఈ తులసి ఆకులను ప్రతి రోజు బాగా నీటిలో మరిగించి ఆ నీటిని తాగడం ద్వారా మన శరీరంలో ఏర్పడిన ఎటువంటి అసిడిటీనీ పూర్తిగా తగ్గిస్తుంది.ఈ విధంగా కాంచి చల్లార్చిన నీటిని తాగలేని పక్షంలో ప్రతిరోజు రెండు మూడు తులసి ఆకులను నమిలి తినడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందవచ్చు.

జీలకర్ర:

అధికంగా అసిడిటీ సమస్యతో బాధపడేవారు భోజనం తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర నోట్లో వేసుకుని ఉండటం లేదా నమిలి మింగడం ద్వారా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.అదే విధంగా ఈ జీలకర్రతో టీ తయారు చేసుకునే త్రాగటం వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి.

దాల్చిన చెక్క టీ:

దాల్చిన చెక్కలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పూర్వం నుంచి ఆయుర్వేదంలో దాల్చిన చెక్కను విరివిగా ఉపయోగించేవారు. దాల్చిన చెక్కను రెండు కప్పుల నీటిలో బాగా మరగనిచ్చి త్రాగటం ద్వారా మన శరీరంలో ఏర్పడిన అసిడిటీ నుంచి విముక్తి పొందవచ్చు. అదేవిధంగా ప్రేగులలో ఏర్పడినటువంటి ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది.

మజ్జిగ:

అధిక గాఢత కలిగిన ఆహార పదార్థాలను తీసుకున్న సమయంలో చాలామంది కడుపులో మంట వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఒక గ్లాసు మజ్జిగలో కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర కలుపుకుని తాగడం వల్ల అసిడిటీ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. మజ్జిగలో ఉన్నటువంటి లాక్టో బ్యాక్టీరియా లాక్టిక్ ఆమ్లాన్ని విడుదల చేయటం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి విషపదార్థం ని సైతం బయటకు తొలగిస్తుంది.

కొబ్బరినీళ్లు:

మనం ఎక్కువగా అసిడిటీ సమస్యతో బాధపడుతున్నప్పుడు కొబ్బరి నీళ్ళు త్రాగాలి. ఈ విధంగా కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు మన శరీరంలో పి.హెచ్ స్థాయిలు ఆమ్లత్వాన్ని తగ్గిస్తాయి. అదేవిధంగా కొబ్బరినీళ్లు శ్లేష్మాన్ని ఉత్పత్తి చేయడానికి కూడా సహకరిస్తాయి. కొబ్బరినీళ్లు అధిక ఆమ్ల ఉత్పత్తికి, హానికరమైన ప్రభావాల నుంచి రక్షిస్తుంది.అదేవిధంగా ఫైబర్ శాతం అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి కల్పిస్తుంది.

చల్లటి పాలు:

అధికంగా అసిడిటి సమస్యతో బాధపడేవారు గ్లాసు చల్లటి పాలను తాగాలి. ఈ పాలు కడుపులోని గ్యాస్ట్రిక్ ఆమ్లాలను స్థిరీకరించడానికి సహాయపడుతుంది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, ఇది కడుపులో ఆమ్లం ఏర్పడకుండా చేస్తుంది.ఎప్పుడైతే మనం అధిక అసిడిటీ సమస్యతో బాధపడతామో అప్పుడు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల అసిడిటీ నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.

సరైన సమయానికి తినడం:

చాలామంది పని ఒత్తిడిలో నిమగ్నమై సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల అధికంగా అసిడిటీ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం ఆహారం సరైన సమయానికి తీసుకోకపోవడం వల్ల మన జీర్ణశయం నుంచి హైడ్రోక్లోరిక్ ఆమ్లం విడుదల అవుతుంది. మన జీర్ణాశయంలో ఆహారం లేకపోవడం వల్ల అధిక ఆమ్లత్వం జీర్ణాశయగోడలకు తగలడం వల్ల కడుపులో మంట ఏర్పడుతుంది.కనుక కొద్ది పరిమాణంలో అయిన సరైన సమయానికి తినడం వల్ల ఈ అసిడిటీ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.

అరటి పండ్లు:

ఆరోగ్య ప్రయోజనకరమైన లక్షణాల విషయానికి వస్తే, అరటిపండ్లకు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. అరటిలో యాసిడ్ రిఫ్లక్స్‌కు వ్యతిరేకంగా బఫర్‌గా పని చేసేటటువంటి సహజ యాంటాసిడ్ లు ఉండటం వల్ల మన శరీరంలో ఏర్పడిన ఆమ్లత్వాన్ని తొలగించడంలో అరటి పండు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత అరటిపండు తినడం వల్ల అసిడిటీ నుంచి విముక్తి కల్పించడమే కాకుండా, అరటిపండులో దాగి ఉన్న ఫైబర్ కంటెంట్ మన శరీరంలో జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.ఈ విధంగా ఈ సమస్యతో బాధపడేవారు ఈ విధమైన చిట్కాలను ఉపయోగించడం ద్వారా ఆ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *