గుండె మార్పిడి ఎలా చేస్తారు..?

heart transplantation procedure

గుండె మార్పిడి ఎలా చేస్తారు..?

శ‌రీరంలో గుండె చేసే ప‌ని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. గుండె క‌నుక స‌రిగ్గా ప‌ని చేయ‌క‌పోతే.. శ‌రీరంలో ప‌లు భాగాల‌కు ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌రిగ్గా జ‌ర‌గ‌దు. మంచి ర‌క్తం, చెడు రక్తాన్ని వేరు చేసే ప్ర‌క్రియకు ఎంతో ‌న‌ష్టం జ‌రుగుతుంది. అయితే ఇలా గుండె స‌రిగ్గా ప‌ని చేయ‌క ప‌లు రోగాల భారిన ఎంతో మంది ప‌డిపోతున్నారు. దీంతో ప‌లు రోగాల భారిన కూడా ప‌డే అవ‌కాశం లేక‌పోలేదు. ఇలా గుండె పూర్తిగా ప‌ని చేయ‌ని స్థితికి వ‌స్తుంటే వారికి గుండె మార్పిడి అవ‌స‌రం అవుతుంది.

స‌రిగ్గా ప‌ని చేయ‌ని గుండె ఉన్న వ్య‌క్తి గుండెను తీసి ఆరోగ్యంగా ఉన్న గుండెను క‌లిగిన దాతనుంచి తీసి శ‌స్త్ర‌చికిత్స ద్వారా రీప్లేస్ చేస్తారు. బ్రైన్ డెడ్ అయిన వ్య‌క్తుల‌ను దాత‌లుగా ఎంచుకుంటారు. దీనికి వారి కుటుంబ స‌భ్యుల అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి. వాళ్లు క‌నుక అవ‌య‌వాల దానానికి ఒప్పుకుంటే ఆ బ్రైన్ డెడ్ వ్య‌క్తి నుంచి ఉప‌యోగ ప‌డే అవ‌య‌వాల‌ను తీస్తారు. వాటిని ప‌లు శ‌రీర అవ‌య‌వాలు పాడైపోయి ఉన్న రోగుల‌కు వాటిని శస్త్ర చికిత్స ద్వారా అమార్చుతారు.

అయితే 1967 లో మొద‌టిసారిగా మానవ గుండె మార్పిడి ఆప‌రేష‌న్ ను ప్ర‌యోగాత్వ‌కంగా చేశారు. ఎన్నో ప‌రిశోధ‌న‌ల త‌ర్వాత దీన్ని చేయ‌గ‌లిగారు. ఇది ఆధునిక హృదయ వ్యాధికి ఒక చికిత్సగా మారిపోయింది. అమెరికాలో ప్ర‌తి యేడు సుమారు 2,300 గుండె మార్పిడిలు జ‌రుగుతునే ఉంటుంది.

ఎవ‌రికి గుండె మార్పిడి చేస్తారుః

గుండె మార్పిడిని ఎవ‌రికి ప‌డితే వారికి చేయ‌రు. దానికి కొన్ని ప్ర‌త్యేక కార‌ణాలు ఉంటాయి. వాటిల్లో చిన్న వ‌య‌సులో గుండె వైఫల్యం ఉన్నవారిని గుండె మార్పిడి కోసం ఎంచుకుంటారు.

ప‌లు ప్ర‌శ్నల‌తో వైద్యులు రోగిని గుర్తిస్తారు. అత‌నికి ఎంత వ‌ర‌కు గుండె మార్పిడి అవ‌స‌రం అనేది. ఆ ప్ర‌శ్నల్లో.. అన్నిర‌కాల‌ చికిత్సల‌కు ప్రయత్నించారా లేక‌పోతే మినహాయించబడ్డాయి?, ఈ మార్పిడి లేక‌పోతే తొంద‌ర్లో చనిపోతారా?, గుండె, ఊపిరితిత్తుల వ్యాధి కాకుండా మిగ‌తా వాటిల్లో మీకు ఏ రోగం లేదా?, చికిత్స త‌రువాత వ‌చ్చే సంక్ల‌ష్ట ప‌రిస్థితుల‌ను అధిగ‌మించే త‌త్వం ఉందా? అంటు ప‌లు ప్ర‌శ్నలను గుర్తుంచుకుని రోగిని ప‌రిశీలిస్తారు. వీటిల్లో ఏ ఒక్క దానికి ఆ రోగి నో చెప్పినా అత‌నికి గుండె మార్పిడి చేయరు. అలాగే ఇతర ప్ర‌మాధ‌‌క‌ర‌మైన‌ వ్యాధులు, క్రియాశీలక అంటురోగాలు, ఊబకాయం వంటి సమస్యలు ఉంటే, గుండె మార్పిడి చేయ‌రు.

గుండె మార్పిడి ప్రాసెస్ః

మీరు క‌నుక గుండె మార్పిడి పొందాలంటే ముందుగా మీరు మార్పిడి జాబితాలో ఉండాలి. కానీ ఇలా మిమ‌ల్ని ఈ మార్పిడ జాబితాలో ఉంచేముందు మీకు ఎన్నో ప‌రీక్ష‌లు చేసి వైద్యులు మీకు గెండె మార్పిడి అవ‌స‌ర‌మా.. లేదా అనే విష‌యాల‌ను తెల్చుతారు. ఇలా మీరు డాక్ట‌ర్ల చేత అన్ని విధాలుగా మార్పిడికి అర్హుడ‌ని గుర్తింపు పొందితే.. మిమ‌ల్ని మార్పిడి జాబితాలోకి చేర్చుతారు.

ఆ తర్వాత మీ గెండె మార్పిడికి అనువైన దాత అందుబాటులోకి వ‌చ్చే వ‌ర‌కు వేచి ఉండాలి. ఈ ప్రక్రియ ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. ఈ సమయానికి మీకు మాన‌సికి సాయం ఎంతో అవ‌స‌రం. మీ కుటుంబం, మీ స్నేహితుల ఈ స‌మ‌యంలో ఎంతో అవ‌స‌రం. మీకు దాత దొరికే వ‌ర‌కు మీ ఆరోగ్య ప‌రిస్థితిని గ‌మ‌ణించేందుకు డాక్ట‌ర్లు ఎప్పుడు అందుబాటులోనే ఉండాలి. ఏ మాత్రం మీకు స‌మ‌స్య వ‌చ్చినా కూడా డాక్ట‌ర్ ను క‌ల‌వాలి.

దాత‌లుః

గుండె మార్పిడి కోసం ఎంచుకునే దాత‌ల‌ను ప‌లు విధాలుగా గుర్తిస్తారు. అప్పుడే మరణించిన వ్య‌క్తుల‌ను మెదడు చనిపోయిన వ్యక్తిగా పిలుస్తారు. ఇలాంటి వారి శరీర యంత్రాల‌తో సజీవంగా ఉంటుంది కానీ, మెదడుకు ఎటువంటి సంకేతం ఉండ‌దు. ఇలా దాతల‌ను ఒక కారు ప్రమాదం, తీవ్రమైన తల గాయం లేక‌పోతే తుపాకీ గాయం కారణంగా మృతి చెందితే.. వారిని గుండె దాత‌గా ప‌రిగ‌ణిస్తారు.

కొంద‌రు వారి మరణానికి ముందే అవయవ దానం కోసం అనుమ‌తిని ఇస్తారు. ఇలా ఇచ్చిన వారి నుంచి అవ‌య‌వాల‌ను తీసుకోవ‌డానికి వారి కుటుంబం కూడా అనుమ‌తి ఇస్తే.. వారి అవ‌య‌వాల‌ను తీసుకుని రోగుల‌కు రీప్లేస్ చేస్తారు. దాత అవయవాల‌ను UNOS ద్వారా కంప్యూటరీకరణ చేసి జాతీయ వేచి జాబితాలో ఉంచుతారు. నిరీక్షణ జాబితా వాళ్లు అందుబాటులోకి వచ్చినప్పుడు అవ‌గాహ‌న‌తో అవయవాల పంపిణీకి హామీ ఇస్తారు. మార్పిడి కోసం ఒక గుండె అందుబాటులోకి వ‌స్తే.. రక్తం, శరీర పరిమాణం, UNOS స్థితిని ప్ర‌మాణికంగా తీసుకుని స్వీకర్త వేచి ఉన్న టైం ఆధారంగా మార్పిడి చేస్తారు.

దురదృష్టవశాత్తు హృద‌య మార్పిడికి ఉప‌యోగ‌ప‌డే దాత‌లు అందుబాటులోకి రావ‌డం లేదు. వ‌చ్చినా వారి ఫ్యామిలీ ఒప్పుకోక‌పోవ‌చ్చు. ఏ స‌మ‌యంలోనైనా గుండె మార్పిడి అవ‌స‌రం ఉన్న వ్య‌క్తులు 3,500 నుండి 4,000 మంది ఉంటున్నారు. ఈ మార్పిడి కోసం వారు కొన్ని నెల‌లు వేచి ఉండాల్సి వ‌స్తుంది. ఆ స‌మ‌యంలో వారు మృతి చెందొచ్చు కూడా..

మార్పిడి సమయంలో ఏం జరుగుతుందిః

దాత గుండె అందుబాటులోకి రాగానే..ఆ మార్పిడి కేంద్రం నుంచి ఒక సర్జన్ దాత గుండెను ప్ర‌త్యేక ప‌రిక‌రాల్లో హాస్పిట‌ల్ కు త‌ర‌లిస్తారు. ఇలా తీసుకుపోయిన గుండెను వీలైనంత త్వ‌ర‌గా శ‌స్త్ర చికిత్స ద్వారా మార్పిడి చేస్తారు. గుండె మార్పిడి సమయంలో, రోగి గుండె-ఊపిరితిత్తుల యంత్రంపై ఉంచుతారు. ఈ యంత్రం శరీరంలో గుండెను నిర్వహించిన‌కానీ రక్తాన్ని, ప్రాణవాయువును, పోషకాలను స్వీకరించడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *