పిల్లలు బరువు పెరగాలంటే.. ఈ ఆహారం తప్పనిసరి !

healthy-food-for-kids-to-gain-weight

పిల్లలు బరువు పెరగాలంటే.. ఈ ఆహారం తప్పనిసరి !

సాధారణంగా పెరిగే పిల్లలు వయసుతో పాటు బరువు కూడా పెరుగుతారు. వయస్సుకు తగ్గ బరువు ఉన్నప్పుడు ఆరోగ్యం ఎంతో అద్భుతంగా ఉన్నదని భావిస్తారు. కానీ కొంతమంది వయసు పెరిగినప్పటికీ బరువు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. ఈ విధంగా బరువు తక్కువగా ఉంటారు.ఈ విధంగా బరువు తక్కువగా ఉండటానికి గల కారణం పోషకాహార లోపం అని చెప్పవచ్చు.ఈ పిల్లలు తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేనప్పుడు వారు వయసుతోపాటు బరువు పెరగరు.

వయస్సుకు తగ్గ బరువు లేని పిల్లలలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వెంటాడతాయి. ముఖ్యంగా బరువు తక్కువ ఉన్న పిల్లలు చురుకుదనం పూర్తిగా తగ్గిపోతుంది. అదేవిధంగా వాటి శరీరంలో రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోవటం వల్ల తరచు జబ్బుల బారిన పడుతుంటారు. ఈ క్రమంలోనే తక్కువ బరువు ఉన్న పిల్లలకు వీలైనంత పోషకాహారం అందించడం వల్ల వారు శరీర బరువు పెరగటం కాకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే తక్కువ బరువు ఉన్న పిల్లలు తీసుకోవలసిన పోషకాహారాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

పిల్లలు బరువు పెరగడానికి ఉత్తమమైన ఆహార పదార్థాలు:

1) బంగాళాదుంపలు:
తక్కువ బరువుతో బాధపడే పిల్లలకు బంగాళాదుంపలు ఉత్తమమైన ఆహారం. బంగాళాదుంపలలో ఎక్కువ భాగం మార్చబడిన పిండి పదార్థాలు ఉంటాయి. ఈ పిండి పదార్థాలు పిల్లల్లో బరువు పెరుగుదలకు సహకరిస్తాయి. అదే విధంగా ఈ కూరగాయలలో ఎక్కువభాగం కార్బోహైడ్రేట్లు, అమైనో ఆమ్లాలు, ఫైబర్ లు అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు అన్ని పిల్లల శరీర బరువును పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పిల్లలు కూడా బంగాళదుంపను ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. బంగాళదుంపలను బాగా ఉడికించి వాటిని స్మాష్ చేసి తినిపించడం , లేదా వాటిపైకి కొద్దిగా ఉప్పు, కారం వేసి తినిపించడం ద్వారా అధిక పోషకాలను పొందవచ్చు.

2) గుడ్లు:
గుడ్లు పోషకాలకు నిలయం అని చెప్పవచ్చు. గుడ్లలో అధికభాగం ప్రొటీన్లు, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. ప్రొటీన్లు శరీర పెరుగుదలకు దోహదం చేయడంతో పాటు, శరీర బరువును పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గుడ్లలో ఉన్న పోషకాలు కేవలం పిల్లల బరువును పెంచడమే కాకుండా, పిల్లలలో మెదడు మరియు నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడటానికి నాడీ వ్యవస్థ అభివృద్ధికి దోహదపడతాయి. అయితే గుడ్లను కేవలం ఉడికించి ప్రతిరోజు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ విధమైన పోషకాలు మన శరీరానికి అంది బరువు పెరుగుతారు. గుడ్లను ఉడికించి తినకుండా వాటిని వివిధ రకాల ఆహార పదార్ధాలుగా చేసుకొని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను మనం గుడ్ల నుంచి పొందలేము.

3) అరటి పండ్లు:
పిల్లలలో శరీర బరువును పెంపొందించటానికి, తక్షణమే శక్తిని అందించడానికి అరటిపండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. అరటి పండ్లను తక్షణ శక్తి వనరులుగా భావిస్తారు. అరటి పండ్లు ఎక్కువ భాగం కార్బోహైడ్రేట్ ల తో నిండి ఉంటుంది. ఒక అరటిపండులో సుమారు 105 క్యాలరీలు ఉన్నట్లు తెలుస్తోంది. అరటిపండులో కార్బోహైడ్రేటులు మాత్రమే కాకుండా విటమిన్లు, ఫైబర్ లు పొటాషియం అధిక మొత్తంలో లభిస్తాయి. ప్రతిరోజు పిల్లలకు అల్పాహారంగా అరటిపండును అనిపించవచ్చు. అదేవిధంగా అరటి పండుతో మిల్క్ షేక్, ఫ్రూట్ సలాడ్, ఐస్ క్రీమ్ వంటి వాటిని తయారు చేసి పిల్లల చేత తాగించడం వల్ల వారు తొందరగా శరీర బరువు పెరుగుతారు. అదేవిధంగా అరటి పండులో ఎక్కువభాగం ఫైబర్ ఉండటం వల్ల తేలికగా జీర్ణం అయ్యి అధిక ఆకలిని కూడా కలుగజేస్తుంది.

4) పాల ఉత్పత్తులు:
శరీర బరువు తక్కువగా ఉన్న పిల్లలు తొందరగా వారి శరీర బరువు పెరగాలంటే పాలు, పాల ఉత్పత్తులు ఎంతగానో దోహదపడతాయి. పాలు, జున్ను వంటి ప్రాథమిక పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం వల్ల తొందరగా పిల్లలలో శరీర బరువు పెరుగుతారు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం పాలను తీసుకోవడం వల్ల పాలలో తగిన మోతాదులో క్యాల్షియం లభిస్తుంది. దీని ద్వారా పిల్లలలో ఎముకలు దృఢంగా తయారవుతాయి. ప్రతిరోజు పిల్లలకు రెండు గ్లాసుల పాలు తాగే ఎలా చూసుకోవాలి. అదేవిధంగా పాలతో మిల్క్ షేక్ లు, సలాడ్లు,ఐస్ క్రీమ్ వంటి వాటిని తయారు చేసి తినిపించడం ద్వారా శరీర బరువును తొందరగా పెంచుకోవచ్చు.

5) డ్రై ఫ్రూట్స్:
డ్రై ఫ్రూట్స్ అధిక పోషక విలువలతో నిండి ఉంటాయి.డ్రై ఫ్రూట్స్ తరుచు మన ఆహార పదార్థాల లో భాగంగా చేసుకోవడం వల్ల తొందరగా శరీర బరువు పెరగడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా బరువు తక్కువగా ఉన్న పిల్లలు తరచూ డ్రై ఫ్రూట్స్ ఉడికించి తినిపించడం, లేదా కొద్దిగా నెయ్యి వేసి వాటిని వేయించి స్నాక్స్ లాగా తినిపించడం వంటివి చేయడం ద్వారా వారి శరీరానికి కావలసిన పోషక విలువలు సమృద్ధిగా అందుతాయి. వీటిలో అధిక భాగం ఫైబర్లు, ప్రొటీన్లు, విటమిన్లు ఉండటం వల్ల ఇవి పిల్లల బరువు పెరుగుదలలో కీలక పాత్ర వహిస్తాయి. డ్రైఫ్రూట్స్ తినే పిల్లలలో వీటిని కొద్దిగా నీటితో వేయించి బాగా పొడి చేసి వారు తినే ఆహార పదార్థాలలో కలపడం లేదా మిల్క్ షేక్ లో కలపడం, ఫ్రూట్ సలాడ్ వంటి వాటి ద్వారా పిల్లలు తీసుకునేలా చేయటం వల్ల వారి శరీర బరువును క్రమంగా పెంచవచ్చు.

6)ఓట్స్:
ఓట్స్ పిల్లల బరువు పెరగడానికి సహాయపడటమే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి. ఓట్స్ లో అధిక మొత్తం పోషకాలతో నిండి ఉంటుంది. ముఖ్యంగా వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది మన శరీరంలోని పేగుల కదలికలకు ఎంతగానో దోహదపడుతుంది. పేగు కదలికలవల్ల పేగులలో పేరుకుపోయిన మలిన పదార్థాలు బయటకు తొలగించడమే కాకుండా పేగులను శుభ్రపరుస్తుంది. దీంతో జీర్ణక్రియ సమస్యలు తలెత్తకుండా, పిల్లలకు ఆకలి కలుగజేస్తాయి. ఐరన్, జింక్,మెగ్నీషియం వంటి మూలకాలు అధికంగా ఉన్న ఈ ఓట్స్ ప్రతిరోజు పిల్లలకు తినిపించడం వల్ల వారిలో జీర్ణక్రియ సమస్యలు తొలగిపోయి శరీర బరువును పెంచడానికి కూడా ఇవి తోడ్పడతాయి.

7) చికెన్, సాల్మన్ చేపలు:

శరీర బరువు తక్కువగా ఉన్న పిల్లల్లో తరచూ చికెన్, తినిపించడం వల్ల శరీర బరువు పెరుగుదలకు దోహదపడుతుంది. చికెన్ లో ఎక్కువ కేలరీలు, ఎక్కువ ప్రొటీన్లను కలిగి ఉండటం వల్ల శరీర బరువును పెంచడానికి దోహదపడతాయి.ఇందులో ఉన్నటువంటి క్యాల్షియం పాస్పరస్ శరీరంలోని ఎముకలు దృఢత్వాన్ని కల్పించడంతోపాటు దంతాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.
సాల్మన్ చేపలు అధికభాగం ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్లు కలిగి ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉన్న చెడు కొవ్వును కరిగించి మంచి కొవ్వును కలిగిస్తాయి. ఈ విధమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల పిల్లలు శరీర బరువు పెరగడంతోపాటు నాడీ వ్యవస్థ పనితీరు కూడా ఎంతో మెరుగ్గా ఉంటుంది. కనుక పిల్లలకు వారంలో రెండు సార్లు మాంసాహారం లేదా సాల్మన్ చేపలను తినిపించడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.

8) బెల్లం:
శరీర బరువు తక్కువగా ఉన్న పిల్లలు అధిక శరీర బరువు పెరగాలంటే బెల్లం ఎంతో ఉత్తమమైన మార్గం. బెల్లం లో అధిక మొత్తం ఐరన్ మెగ్నీషియం ఉండటం వల్ల ఇది పిల్లలు అధిక శక్తిని అందించడంతోపాటు శరీర బరువు పెరగడానికి దోహదపడుతుంది. బెల్లంలో ఐరన్ తో పాటు,ఎస్సెన్షియల్ మినరల్స్ ఉన్నాయి కనుక తరచూ బెల్లం తినిపించడం ద్వారా పిల్లలు శరీర బరువు తో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

పై తెలిపిన ఆహారపదార్థాలను తరచూ పిల్లలకు అందించటం ద్వారా వారిలో వారి శరీరానికి సరిపడా పోషకాలు అందడంతో పాటు శరీర బరువును కూడా పెరుగుతారు.అయితే వయసు కన్నా అధిక శరీర బరువు ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల వారి శరీర బరువు మరింత పెరిగి అది ఊబకాయానికి దారితీస్తుంది. దీని ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి కనుక వయసుతో పాటు శరీర బరువును నియంత్రణలో ఉంచుకోండి అసలైన ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *