ఆరోగ్యకరమైన దంతాల కోసం ఈ చిట్కాలు పాటించండి!

 Health dental precautions

ఆరోగ్యకరమైన దంతాల కోసం ఈ చిట్కాలు పాటించండి!

ఎంత మంచి ఆహారం తీసుకోవాలన్నా.. అది మంచిగా జీర్ణం కావాల‌న్నా.. ముందుగా నోటిలోకి పోగానే మ‌నం న‌మ‌నాల్సిందే. ఆహారాన్ని ఎంత మంచిగా న‌మిలితే అంత మంచిగా జీర్ణం అవుతుంది. ఇదే విష‌యాన్ని వైద్యులు ప‌దే ప‌దే చెప్తుంటారు. మంచిగా న‌మ‌ల‌క‌పోతే.. జీర్ణం స‌రిగ్గా కాద‌ని.. దాంతో ప‌లు స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని వైద్య‌లు సూచిస్తుంటారు. అయితే స‌రిగ్గా న‌మ‌లాలి అంటే మ‌న దంతాలు ఆరోగ్యంగా ఉండాలి. అలా ఉంటేనే మ‌నం ఏ ఆహారాన్ని అయిన ఈజీగా న‌మ‌ల‌గ‌ల‌ము.

అలా న‌మిలితేనే ఆహారం స‌రిగ్గా జీర్ణం అవుతుంది. అప్పుడే మ‌నం ఆరోగ్యంగా ఉంటాము. దాని కోసం మంచి బ్రెష్ స‌రిగ్గా చేయాలి. అలాగే డెంటిస్టుల‌ను త‌ప్ప‌క క‌ల‌వాలి. మాములుగా అంద‌రూ ప్రతీ 6 నెలలకొకసారైనా డెంటిస్ట్ ను సంప్రధించాల్సిన అవ‌స‌రం చాలా ఉంది. ఇలా డెంటిస్టును అప్పుడప్పుడు కలవడం వ‌ల‌న దంతాల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. అలాగే డైట్ ను మార్పు చేయడం వ‌ల్ల కూడా మ‌న దంతాల హెల్త్ ను కాపాడొచ్చు.

ఈ డైట్ వ‌ల‌న డెంటల్ క్యావిటినీ నేచురల్ గా తగ్గించుకోవ‌చ్చ‌ని వైద్యులు సూచిస్తున్నారు. అలా కాకుండా డైట్ ప్రొపర్ గా లేక‌పోతే, నోట్లో ఉండే ఆమ్లాలు దంతాల ఔటర్ లేయర్ ను కరిపోయోలా చేస్తాయ‌ని చెబుతున్నారు. ఇలా ఔట‌ర్ లేయ‌ర్ క‌రిగిపోతే.. దంతాలు మరింత సెన్సిటివ్ గా మారిపోతాయని సూచిస్తున్నారు. అలాగే దంతాల హెల్త్ దెబ్బ‌తింటుంద‌ని చెబుతున్నారు. ప‌ళ్ల‌ నొప్పి, తినేటప్పుడు లేదా ఏదైనా తాగేట‌ప్పుడు వ‌చ్చే నొప్పి, వేడి , చల్లటి పదార్థాల‌ను తాగేట‌ప్పుడు సెన్సిటివ్ గా అనిపిస్తుంది అంటే మీకు దంత స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని అర్థ‌మ‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా ఉంటే డెంటిస్ట్ ను ఒక సారి క‌ల‌వాల‌ని సూచిస్తున్నారు. అలాగే దంతాల మీద కలర్ మార‌డం లాంటి ల‌క్ష‌ణాలు దంత‌ల అనారోగ్యానికి సూచిక‌ని డెంటిస్టులు చెబుతున్నారు.

ఫైటిక్ యాసిడ్స్ కలిగిన ధాన్యాలు, నట్స్, లెగ్యుమ్స్ ను ఎవ‌రైతే ఎక్కువ‌గా తీసుకుంటారో వారిలో దంత స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తాయి.  అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల‌న దంతాల‌ను, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. ఆ ఆహారాలు ఎంటో ఒక సారి చూడండి.

క్యాల్షియంః
క్యాల్షియం ఎక్కువ‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. దాంతో ఆరోగ్యంగా ఉంటాము. అలాగే ఇవి దంతాల‌కు, చిగుళ్ల ర‌క్ష‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇవి చిగుళ్ల వ్యాధుల‌ను, దంతక్షయం వంటి స‌మ‌స్య‌ల‌ను రాకుండా చేస్తాయి. కాల్షియం పాలు, పెరుగు, చీజ్, కేల, బ్రొకోలీ వంటి వాటిద్వారా ఎక్కువ‌గా దొరుకుతుంది.

మెగ్నీషియంః
రక్తంలో ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ ను క్రియేట్ చేయడానికి మెగ్నీషియం చాలా సాయ‌ప‌డుతుంది. అలాగే విటమిన్ డి గ్రహించడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. విట‌మిన్ డి క్యాల్షియంగా మార్పు చెందడానికి కూడా చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. మెగ్నీషియం ఎక్కువ‌గా ఆకుకూరల్లో , ధాన్యాల్లో, బాదంలో, బీన్స్, ఫిష్, అవొకాడో, అరటిపండ్లల్లో ఉంటుంది.దంతక్షయాన్ని నివారించ‌డానికి ఇంది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.

మాంసంః
మాంసాహారం నోటిలో ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ ను క్రియేట్ సాయ‌ప‌డుతుంది.  అలాగే అసిడిక్ ఫైటిక్ యాసిడ్ పిహెచ్ క్రియేట్ చేయడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. రెడ్ మీట్, చికెన్, ఫిష్, సీఫుడ్స్ లో విటమిన్ బి12, బి2 లు సంవృద్ధిగా దొరుకుతాయి. టూత్ డెకేని నివారించడంలో మాంసాహారం ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.

విటమిన్ డిః
విట‌మిన్ డి పొద్దున్నే వ‌చ్చే సూర్య రశ్మిలో పుష్కలంగా ఉంటుంది.  అలాగే ఆయిల్ ఫిష్,  గుడ్లు, పాల‌ల్లో విట‌మిన్ డి ఎక్కువ‌గా దొరుకుతుంది.

హెల్తీ ఫ్యాట్ః
ఓమేగా3 నుంచి ల‌భించే హెల్తీ ఫ్యాట్ టీత్ కు ఎంతో మేలు చేస్తుంది. సాల్మన్, సార్డిన్స్, మెకరెల్స్ వాల్ నట్స్ నుంచి ఇది బాగా దొరుకుతుంది.

కొబ్బరి నూనెః
కొబ్బ‌రి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఈ  ల‌క్ష‌ణాలు నోట్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియాన్ చంపేస్తాయి. అందుకే టూత్ పేస్ట్ లో కొద్దిగా కొబ్బరితురుము లేకుంటే కొబ్బరి నూనె జోడించి రుద్దాలి. దాంతో టీత్ కు ఎంతో మేలు జ‌రుగుతుంది.

ఆర్గానిక్ బటర్ః
ఆర్గానిక్ బటర్ లో క్యాల్షియం పుష్క‌లంగా ఉంటుంది. దంతక్షయాన్ని నివారిండంలో ఇది చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. లోఫ్యాట్ ఉన్న బటర్ ను తీసుకోవ‌డం ఎంతో మంచిది.

వెజిటేబుల్స్ః
వెజిటేబుల్స్ లో ఫైబర్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది దంతాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే నోట్లో లాలాజలం ఊరడానికి  ఉప‌యోగ‌ప‌డుతుంది.

బేకింగ్ సోడః
టీత్ మీద బేకింగ్ సోడాను వేసి తోముకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల‌న దంతక్ష‌యం రాకుండా చేయొచ్చు.  ఇది నోట్లో ఉండే బ్యాక్టీరియాన్  చంపుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *