వేసవిలో లభించే తాటి ముంజలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

health-benefits-taati-munjalu

వేసవిలో లభించే తాటి ముంజలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

వేసవికాలం వచ్చిందంటే చాలు మనకు మార్కెట్లో తాటి ముంజలు దర్శనమిస్తాయి. ఈ తాటి ముంజులనే ఐస్ ఆపిల్ అని కూడా పిలుస్తారు.వేసవికాలంలో మంచి శీతలీకరణగా ఉండటం వల్ల వీటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వేసవి కాలంలో లభించే ఈ ఐస్ ఆపిల్ తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. వీటిలో ఎన్నో ముఖ్యమైన పోషక విలువలు దాగివున్నాయి. తాటి ముంజలను వేసవి కాలంలో తరచూ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న అధిక వేడిని తొలగించడానికి దోహదపడుతుంది. ఈ పండ్ల నిర్మాణం చూడడానికి లీచి ఆకారంలో ఉన్నప్పటికీ, రుచి విషయానికి వస్తే లేత కొబ్బరను పోలి ఉంటుంది.

తాటి ముంజలు ఎక్కువగా దక్షిణాది ప్రాంతాలలో విరివిగా లభిస్తాయి. ఈ పండ్లలో ఎక్కువ శాతం నీటిని కలిగి ఉండటం వల్ల ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి దోహదపడుతుంది. అదేవిధంగా శరీరం నీటి స్థాయిలను కోల్పోకుండా, మన శరీరాన్ని ఎప్పుడు హైడ్రేట్ చేస్తూ మన శరీరాన్ని కాపాడుతుంది. ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ తాటి ముంజలను వేసవిలో తరచూ తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చునో ఇక్కడ తెలుసుకుందాం…

1)తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది:

తాటి ముంజలు ఎక్కువభాగం ఫైటోన్యూట్రియెంట్స్, కార్బోహైడ్రేట్లు మరియు కాల్షియం యొక్క శక్తి కేంద్రం. ఇది తక్కువ మొత్తంలో ఫైబర్ కలిగి ఉంటుంది. అదేవిధంగా కేలరీలను కూడా తక్కువగా కలిగి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా విటమిన్లు ఎ, సి, బి 7, కె మరియు ఐరన్ లభించాయి, ఇవి ఆరోగ్యానికి ఎంత సహాయపడతాయి. ఈ తాటి ముంజలలో అధిక భాగం నీరు ఉండటం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ కి లోనుకాకుండా, వడదెబ్బ నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది.

2) జీర్ణక్రియ సమస్యలను తొలగిస్తుంది:

సాధారణంగా ప్రతి ఒక్కరు జీర్ణక్రియ సమస్యతో పాటు కడుపులో మంట గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ విధమైనటువంటి సమస్యలతో బాధపడేవారికి ఐస్ ఆపిల్ ఎంతగానో దోహదపడతాయి. తరచు ఐస్ ఆపిల్ తీసుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఫైబర్ జీర్ణక్రియ సమస్యలను తొలగించడమే కాకుండా మలబద్దకం సమస్య కూడా నివారిస్తుంది.ముఖ్యంగా మహిళలు గర్భధారణ సమయంలో ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఈ విధంగా జీర్ణక్రియ సమస్యతో బాధపడేవారు ఐస్ ఆపిల్ తీసుకోవటం వల్ల జీర్ణక్రియ సమస్యనుంచి విముక్తి పొందవచ్చు.

3) వృద్ధాప్య ఛాయలు తగ్గిస్తుంది:

ఐస్ ఆపిల్ లో ఎక్కువ భాగం ఫైటో కెమికల్స్ ఉంటాయి. వీటిలో ఎక్కువభాగం యాంటీ ఆక్సిడెంట్ లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.ఈ లక్షణాలు మన శరీరంలో ఏర్పడే వృద్ధాప్య ఛాయలను తొలగించి చర్మం కాంతివంతంగా కనిపించడానికి దోహదపడుతుంది. అదేవిధంగా మన శరీరంలో ఏర్పడే వైవిధ్యమైన వ్యాధుల నుంచి మనకు విముక్తిని కల్పిస్తాయి.

4) బరువును నియంత్రించవచ్చ:

అధిక శరీర బరువుతో బాధపడేవారు తాటి ముంజలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వారి శరీర బరువును నియంత్రించుకోవడం. వీటిలో అధిక భాగం నీరు ఉండటం వల్ల వీటిని తీసుకోవడం ద్వారా మనకు ఆకలినీ అణచి వేస్తుంది. కేవలం నీటి ద్వారా మాత్రమే సంపూర్ణత్వ భావన కలగడం వల్ల అన్నం తినడానికి ఇష్టపడరు. తద్వారా శరీర బరువును ఎంతో సులభంగా నియంత్రించుకోవచ్చు.

5) అలర్జీలను నివారిస్తుంది:

వేసవి కాలంలో సాధారణంగా అనేక చర్మ సమస్యలు వెంటాడతాయి.అధిక శరీర ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల చర్మం పై చెమటలు ఏర్పడటం వల్ల ఎన్నో బాక్టీరియాలు మన చర్మంపై నివసిస్తాయి. తద్వారా వివిధ రకాల చర్మ వ్యాధులు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే కొందరికి అధిక శరీర ఉష్ణోగ్రత ఉండటం వల్ల చర్మం పై చెమట కాయలు ఏర్పడి తీవ్రమైన బాధను కలిగిస్తాయి.ఈవిధంగా చర్మంపై దద్దుర్లు ఏర్పడడం లేదా చెమటకాయల పై ఐస్ ఆపిల్ తో మసాజ్ చేయడం ద్వారా ఈ విధమైనటువంటి అలర్జీలు, దద్దుర్ల సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.

6) చికెన్ పాక్స్ సమస్యను నివారిస్తుంది:

సాధారణంగా వేసవి కాలంలో చాలామంది చికెన్ పాక్స్ సమస్యతో బాధపడుతుంటారు.చికెన్ పాక్స్ రావడం వల్ల మన చర్మం పై అధిక మొత్తంలో దద్దుర్లు మచ్చలు ఏర్పడి తీవ్రమైన దురదను కలిగిస్తాయి. ఈ విధమైన సమస్య నుంచి విముక్తి పొందాలంటే చికెన్ పాక్స్ సమస్యతో బాధపడే వారు తప్పనిసరిగా వారి ఆహారంలో ఈ తాటి ముంజలను చేర్చుకోవాలి.చికెన్ పాక్స్ వల్ల కలిగే నిర్దిష్ట చర్మ వ్యాధుల నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి.

7) వడదెబ్బ నుంచి కాపాడుతుంది:
వేసవికాలంలో వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు, మన శరీరం కూడా అధిక ఉష్ణోగ్రతకు లోనయితే మన శరీరం అధిక శాతం నీటిని కోల్పోతుంది. ఈ విధంగా శరీరం నీటి శాతాన్ని కోల్పోవడంతో చాలామంది వడదెబ్బకు గురవుతారు.ఈ విధంగా వడదెబ్బ నుంచి మనల్ని కాపాడుకోవాలంటే తరచూ తాటి ముంజలు తినడం వల్ల మన శరీరానికి కావలసినంత నీటిని సమకూరుస్తుంది. ఈ పండులో అధిక మొత్తం నీటినీ కలిగి ఉండటం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ కాకుండా కాపాడటమే కాకుండా, వడదెబ్బ నుంచి మనల్ని రక్షిస్తుంది.

8) కాలేయ సమస్యలను నివారిస్తుంది:
కాలేయ సమస్యలతో బాధపడేవారికి ఐస్ ఆపిల్ మంచి ఆహారం అని చెప్పవచ్చు.ఇందులో పొటాషియం అధిక మొత్తంలో ఉండటం వల్ల క్రమంగా కాలేయ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

9) రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది:

వేసవి కాలంలో లభించే ఐస్ ఆపిల్ లో ఎక్కువభాగం ఖనిజాలు, విటమిన్లతో నిండి ఉంటాయి. ఇవి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో దోహదపడతాయి.ముఖ్యంగా ఐస్ యాపిల్ లో పొటాషియం అధిక భాగం ఉండటం వల్ల ఇది మన శరీరంలో ఏర్పడిన విషయాన్ని బయటకు తొలగిస్తుంది. కాలేయ సమస్యలు,రొమ్ము క్యాన్సర్ తో బాధపడే వారికి డాక్టర్లు ఎక్కువభాగం ఈ పండ్లను సూచిస్తారు. ఇందులో అధిక భాగం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ అధికంగా ఉండటం వల్ల ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి వైరస్ బారిన పడకుండా, మన శరీరంలోకి ప్రవేశించే వ్యాధిని కలిగించే వైరస్లతో పోరాడుతుంది.

10) గర్భధారణ సమయంలో సహాయపడుతుంది:
గర్భం దాల్చిన మహిళలకు ఈ ఐస్ ఆపిల్స్ ఎక్కువగా తినమని డాక్టర్లు సూచిస్తారు. ఎందుకంటే గర్భధారణ సమయంలో మహిళలు అధిక భాగం జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటారు. అదేవిధంగా కడుపులో ఎక్కువ గ్యాస్, మంట, అజీర్తి వంటి సమస్యలు తరచూ తలెత్తుతుంటాయి. మరి కొందరు మహిళలు ఎక్కువ భాగం వికారం వంటి వంటి సమస్యలు అధికంగా ఉంటాయి.

కనుక తాటి పండ్లను తినడం వల్ల గర్భిణీ స్త్రీలలో మంట, గ్యాస్ తగ్గడమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగు పరుస్తాయి. అందుకోసమే గర్భం దాల్చిన మహిళలు ఎక్కువగా తాటి ముంజలు తినాలని డాక్టర్లు సిఫార్సు చేస్తారు. కేవలం గర్భిణీ స్త్రీలు మాత్రమే కాకుండా పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడ ఈ పండ్లను అధికంగా తీసుకోవటం వల్ల వారిలో పాలు ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా శిశువు పెరుగుదలకు కూడా ఇవి ఎంతగానో దోహదపడుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *