కుంకుమ పువ్వు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. దుష్ప్రభావాలు.!

health-benefits-of-kumkuma-puvvu

కుంకుమ పువ్వు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. దుష్ప్రభావాలు.!

కుంకుమ పువ్వు ఎక్కువ సువాసన కలిగిన, విలక్షణమైన రంగును కలిగి ఉన్న ఒక మసాలా దినుసు. ఇతర మసాలా దినుసులతో పోలిస్తే కుంకుమ పువ్వు ఎక్కువ ధర కలిగినది. అదేవిధంగా ఇందులో అధికభాగం యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో మానసిక స్థితిని పెంచుతుంది లిబిడోను పెంచుతుంది. అదేవిధంగా మన శరీరంలో ఏర్పడే ఆక్సికరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడుతుంది.

కుంకుమ పువ్వు అంటే ఏమిటి దాని వల్ల కలిగే లాభాలు:

కుంకుమపువ్వు క్రోకస్ సాటివస్ అని పువ్వు నుంచి ఏర్పడే ఒక మసాలా దినుసు. కుంకుమ పువ్వులోనే దారాలు వంటి కలంక మరియు శైలుల నుంచి ఉద్భవిస్తుంది. కుంకుమ పువ్వును చేయడం ఎంతో కష్టంతో కూడుకున్న పని కావున మార్కెట్లో ఈ మసాలా దినుసులకు అంత ధర పలుకుతోంది. ప్రపంచంలోనే ఎంతో ఖరీదైన మసాలా దినుసుగా కుంకుమపువ్వు పేరుగాంచినది. ఇంత ఖరీదైన మసాలా దినుసులను ప్రతిరోజు వాడటం వల్ల ఏ విధమైనటువంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

1) యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది:

కుంకుమపువ్వు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. కుంకుమ పువ్వులో క్రోసిన్, పిక్రో క్రోసిన్, సఫ్రానాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడిన ఆక్సీకరణ ఒత్తిడికి, మన శరీరంలో ఏర్పడిన ఫ్రీ రాడికల్స్ ను బయటకు తొలగించడానికి దోహద పడతాయి. అదేవిధంగా గుండె జబ్బు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిలో ఆక్సీకరణ ఒత్తిడి అధికంగా ఉంటుంది.ఈ విధమైన వ్యాధితో బాధపడే వారిలో ఆక్సీకరణం ఒత్తిడిని తగ్గించి వారి ఆరోగ్యాన్ని కాపాడటంలో కుంకుమపువ్వు కీలక పాత్ర పోషిస్తుంది.

2) నాడీ వ్యవస్థలో లోపాలను నివారిస్తుంది:

నాడీ వ్యవస్థలో ఏర్పడే రుగ్మతల నుంచి శరీరాన్ని రక్షించడంలో కుంకుమ పువ్వు కీలకపాత్ర పోషిస్తుంది. కుంకుమ పువ్వులో ఉండే క్రోసిన్ వంటి సమ్మేళనాలు మెదడులో ఏర్పడే మంట ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. అదేవిధంగా కుంకుమ పువ్వులి జ్ఞాపకశక్తిని పెంపొందించే గుణాలు పుష్కలంగా లభిస్తాయి. అల్జీమర్స్ వ్యాధితో బాధపడేవారు 22 వారాలపాటు కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల వారిలో అభిజ్ఞ పనితీరులో మెరుగుదల కనిపించింది.

3) క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది:
కుంకుమ పువ్వులో ఉండే క్రోసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ లుకేమియా, కార్సినోమా,పెద్దప్రేగు అడెనోకార్సినోమా వంటి క్యాన్సర్ కణాలను నిరోధించే సామర్థ్యం ఉంటుంది.

4) సీజనల్ వ్యాధులతో పోరాడుతుంది:
సాధారణంగా కొందరు సీజనల్ వ్యాధులతో ఎంతో సతమతమవుతుంటారు. అలాంటి వారు కొద్దిగా కుంకుమ పువ్వు టీ లేదా, కుంకుమ పువ్వును గోరువెచ్చని పాలలో కలుపుకుని తాగడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు నయం అవడానికి దోహదపడుతుంది. అదేవిధంగా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదపడుతుంది.

5) రక్తపోటును నియంత్రిస్తుంది:
కుంకుమ పువ్వులో అధిక మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల మన శరీరంలో రక్తపోటును నియంత్రించడానికి దోహదపడుతుంది. ప్రతిరోజు కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల ధమనులలో ఏర్పడే అడ్డంకులను తొలగించి రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. దీంతో అధిక రక్తపోటును తగ్గించడమే కాకుండా, గుండెకు సంబంధించిన వ్యాధుల నుంచి కూడా కాపాడుతుంది.

6) లైంగిక శక్తిని పెంచుతుంది:
కొన్ని యుగాల నుంచి కుంకుమపువ్వు అద్భుతమైన కామోద్దీపన లక్షణాలకు ప్రసిద్ది చెందింది. కుంకుమ పువ్వును ప్రతి రోజూ తీసుకోవడం వల్ల స్త్రీ పురుషులిద్దరిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇక ఆడవారిలో కుంకుమపువ్వు ఆండ్రోజన్ స్థాయిలను మెరుగుపరచడంలో దోహదపడుతుంది. సంతానం కోసం ఎదురుచూసే జంటలు ప్రతిరోజు కుంకుమపువ్వును 1.5 గ్రాములు తీసుకోవటంవల్ల వారిలో లైంగిక సామర్థ్యం పెరిగి గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయి.

7) కాలేయాన్ని రక్షిస్తుంది:
కాలేయ వ్యాధులతో బాధపడే వారికి కుంకుమపువ్వు ఒక మంచి దివ్యౌషధమని చెప్పవచ్చు.కుంకుమ పువ్వులోని కెరోటినాయిడ్లు రియాక్టివ్ ఆక్సిజన్ జాతుల ఉత్పత్తిని నిరోధించడంలో సహాయపడతాయి.కుంకుమ పువ్వులో ఉండే సఫ్రానాల్ కాలేయాన్ని పర్యావరణ టాక్సిన్స్ నుండి కాపాడుతుందని పలు అధ్యయనాలు నిరూపించినప్పటికే ఈ విషయంపై ఇంకా సరైన దృవీకరణ వెలువడలేదు.

8) PMS లక్షణాలను తగ్గిస్తుంది:
కుంకుమ పువ్వును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ప్రీమెచ్యూరేషన్ సిండ్రోమ్ లక్షణాలను తగ్గిస్తుంది. ప్రతిరోజు కుంకుమపువ్వును తీసుకోవడంతో పాటు అదనంగా 20 నిమిషాల పాటు ఈ వాసనను తీసుకునే స్త్రీలలో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ తక్కువ స్థాయిని కలిగి ఉంటుంది. అదేవిధంగా కుంకుమపువ్వు స్త్రీలలో PMS లక్షణాలను తగ్గించడానికి కూడా దోహదపడుతుంది.

9) బరువును నియంత్రించుకోవడం:
పలు అధ్యయనాల ప్రకారం తరచు కుంకుమపువ్వు తీసుకోవటంవల్ల బరువును తగ్గించుకోవచ్చు అని తెలియజేశారు. కుంకుమపువ్వును తీసుకోవడం ద్వారా మనలో ఆకలిని అణచివేస్తుందని తద్వారా బరువును నియంత్రించుకోవడంలో కుంకుమ పువ్వు కీలకపాత్ర పోషిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

కుంకుమ పువ్వు వల్ల కలిగే దుష్ప్రభావాలు:

ఎంతటి ప్రయోజనకరమైన ఆహారం అయినా సరే మితంగా తీసుకున్నప్పుడు మాత్రమే అందులోని ఆరోగ్య ప్రయోజనాలు, పోషక విలువలు మన శరీరానికి అందుతాయి. అదేవిధంగా పరిమితికి మించి ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల విషంగా మారే ప్రమాదాలు కూడా తలెత్తుతుంటాయి.సాధారణంగా కుంకుమపువ్వు వినియోగం చాలా తక్కువ ప్రమాదాన్ని కలిగి ఉంటుంది. కుంకుమ పువ్వుతో వంట చేయటం వల్ల ఈ మసాలా ఎక్కువ తిన్న ప్రమాదం లేకుండా మన ఆహారంలో చేర్చుకునే గొప్ప మార్గం అని చెప్పవచ్చు.

ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ కుంకుమపువ్వును ప్రతిరోజు కేవలం 1.5 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నప్పుడు మాత్రమే మన శరీరానికి ఆరోగ్యప్రయోజనాలను కలుగజేస్తుంది.ఈ పరిమితికి మించి తీసుకోవడం వల్ల కుంకుమపువ్వు విష పదార్థంగా మారుతుంది.

కుంకుమ పువ్వు ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కొన్ని సార్లు ప్రమాదాలు తలెత్తుతుంటాయి. ఉదాహరణకు గర్భం ధరించిన స్త్రీలు కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఎంతో అందంగా పుడతాడని భావిస్తారు. అయితే కుంకుమపువ్వును గర్భిణి స్త్రీలు అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల ఇది గర్భాశయాన్ని ఉత్తేజపరిచే ప్రమాదాన్ని కలిగిఉంటుంది.

కొందరిలో కుంకుమపువ్వును తీసుకోవటంవల్ల పలు రకాల అలర్జీలు తలెత్తుతుంటాయి.ఈ విధంగా అలర్జీ ఉన్నవారు కుంకుమపువ్వు తీసుకోవటం మానేసి వెంటనే వైద్యుని సంప్రదించాలి. కుంకుమపువ్వు ప్రతిరోజు గ్లాస్ గోరువెచ్చని నీటిలో లేదా పాలలో కొన్ని కుంకుమపువ్వు దారాలను కలుపుకొని తాగడం ద్వారా దానిలో ఉన్న రుచిని ఆస్వాదించడంతో పాటు, ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందగలరు. మరి కొందరు కుంకుమపువ్వును వారి ఆహారంలో భాగంగా ఆహార పదార్థాలలో చేర్చుకొని తింటారు. కుంకుమపువ్వు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఖరీదైన మసాలా దినుసులలో ఒకటిగా చెప్పవచ్చు. కనుక ఈ మసాలా దినుసులు ప్రతిరోజు పరిమితంగా తీసుకోవడం వల్ల పై తెలిపిన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే కుంకుమపువ్వును తీసుకునేవారు పరిమితికి మించి తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *