జామ ఆకుల వల్ల స్త్రీ పురుషులలో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!

guava-leaves-health-Benefits

జామ ఆకుల వల్ల స్త్రీ పురుషులలో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!

జామ ఆకులు ప్రతి ఒక్కరికీ ఎంతో అందుబాటులో ఉంటాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన జామ ఆకులను గత కొన్ని సంవత్సరాలుగా ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. జామ ఆకులు అధిక భాగం యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, పొటాషియం, విటమిన్లు వంటి తదితర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. జామ చెట్టును లాటిన్ భాషలో సైడియం గుజావా అని పిలుస్తారు. భారత దేశంతో పాటు చైనా వంటి దేశాలలో జామ ఆకులను ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాల కోసం విరివిగా ఉపయోగిస్తారు.

జామ ఆకులను ఉపయోగించి తయారు చేసేటటువంటి జామ టీ ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. జామ ఆకులు ముఖ్యంగా పంటి నొప్పి, కడుపు నొప్పి, మధుమేహం, గాయాలు నయం కావడానికి, అధిక రక్తపోటు వంటి సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా జామ ఆకులలో ప్రాణాలను రక్షించే రసాయనాలు కూడా అధికంగా ఉండటం వల్ల ఈ జామ ఆకులను వైద్యరంగంలో చికిత్స చేయటానికి విరివిగా ఉపయోగిస్తారు. జామ ఆకులలో మాత్రమే కాకుండా జామపండులో కూడా ఈ విధమైనటువంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఎన్నో పోషకాలు కలిగిన ఈ జామ పండును ప్రతిరోజు తినటం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

1) రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది:

జామ ఆకులు లేదా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. సాధారణంగా సిట్రస్ జాతి పండ్లు విటమిన్ సి కి నిలయమని చెప్పవచ్చు. అయితే సిట్రస్ పండ్లలో కన్నా నాలుగురెట్లు అధికంగా జామ ఆకులలో విటమిన్ సి లభిస్తుంది. వ్యాధికారక బ్యాక్టీరియాలతో పోరాడటానికి విటమిన్ సి మన శరీరంలో రోగనిరోధక శక్తిని ఏర్పరుస్తుంది. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా, కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది.

2) క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది:

జామ ఆకులలో విటమిన్ సి, లైకోపీన్, పాలీఫెనాల్స్ మంచి యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని క్యాన్సర్ కణాలను తటస్థం చేయడమే కాకుండా, క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తుంది. ప్రతి రోజు ఒక జామ పండును తినటం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.

3) డయాబెటిస్ ను నివారిస్తుంది:
జామ పండు, జామాకులలో అధిక భాగం ఫైబర్,గ్లైసెమిక్ ఇండెక్స్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. కనుక మధుమేహంతో బాధపడేవారు ప్రతి రోజు జామ పండు తినడం వల్ల మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు.

4) గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది:
జామలో అధిక భాగం సోడియం, పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్తపోటుతో బాధపడుతున్న వారిలో రక్తపోటును నియంత్రించడంలో దోహదపడతాయి. అధిక రక్తపోటును తగ్గించడానికి, రక్తపోటును సమతుల్యం చేయటానికి ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కారణమని చెప్పవచ్చు. అయితే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచే లక్షణాలు అధికంగా ఉన్నాయి.

5) మలబద్ధకాన్ని నివారిస్తుంది:

జామలో అధిక భాగం ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఈ ఫైబర్ మన శరీరంలో ఆహారం జీర్ణం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు ఒక జామపండును తినడం వల్ల 12% ఫైబర్ మన శరీరానికి అందుతుంది. ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, ప్రేగులలో ఏర్పడిన మలినాలను శుభ్రం చేస్తుంది.ఈ విధంగా పేగులలో కదలికలు ఏర్పడటం వల్ల మలబద్దక సమస్య నుంచి పూర్తిగా విముక్తి కలిగిస్తుంది.

6) కంటిచూపును మెరుగు పరుస్తుంది:
జామ పండ్లలో అధికంగా విటమిన్లు ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల కంటి చూపును మెరుగు పరచడానికి దోహదపడుతుంది. అదేవిధంగా కంటిలో కంటిశుక్లం, మాక్యులార్ డీజెనరేషన్ అభివృద్ధి చెందకుండా కంటి చూపును కాపాడుతుంది.

7) అధిక ఒత్తిడి నుంచి విముక్తి:
అధిక పని వల్ల మన శరీరంలో ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది. ఈ అధిక ఒత్తిడి నుంచి విముక్తి కలిగించి కండరాలు, నరాలు విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగపడే మెగ్నీషియం జామపండులో పుష్కలంగా లభిస్తుంది. మెగ్నీషియం మన శరీరంలో ఏర్పడిన ఒత్తిడిని తగ్గించి మన శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది.

8) గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరం:
గర్భిణి స్త్రీలు ప్రతిరోజు జామ పండు తినటం వల్ల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జామపండులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 9 అధికంగా ఉన్నాయి. ఇది శిశువు నాడీవ్యవస్థను అభివృద్ధి చేయడంలో దోహదపడతాయి. అదేవిధంగా నాడీ వ్యవస్థ రుగ్మతల నుంచి కాపాడటమే కాకుండా ఆ శిశువు ఎదుగుదలకు కూడా దోహదపడుతుంది. అందుకోసమే గర్భం దాల్చిన మహిళలకు ఎక్కువగా జామను సిఫార్సు చేస్తారు.

9) పంటి నొప్పికి ఉత్తమ పరిష్కారం:
పంటి నొప్పి, చిగుళ్ళు వాపు, దంత క్షయం వంటి సమస్యలతో బాధపడే వారికి జామాకులు మంచి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు. జామ ఆకులలో శోథ నిరోధక,యాంటీ బాక్టీరియల్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది మన దంతాలలో బ్యాక్టీరియా వల్ల ఏర్పడిన దంతక్షయం, చిగుళ్ళు వాపు, నోటి దుర్వాసన, నోటి పూత వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

జామ ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు:

సాధారణంగా దగ్గు, జ్వరం, వంటి ఫ్లూ సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా ఇంగ్లీష్ మందులను వేసుకుని తొందరగా వాటినుంచి ఉపశమనం పొందుతుంటారు.అయితే ఈ విధమైనటువంటి సమస్యల నుంచి తొందరగా ఉపశమనం కలిగించడంలో జామ ఆకులు కీలకపాత్ర పోషిస్తాయని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. జామ పండులో మాదిరిగానే ఆకులలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు ఒక కప్పు నీటిలో 4-5 జామ ఆకులను బాగా మరిగించాలి.ఈవిధంగా మరిగిన నీటిని చల్లార్చి ప్రతిరోజు ఉదయం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..

* విరేచనాల సమస్యతో బాధపడేవారికి జామాకుల టీ తొందరగా ఉపశమనం కలిగిస్తుంది.
* శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
* బరువు తగ్గడానికి సహాయ పడటంతో పాటు, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది.
* క్యాన్సర్ కారక కణాలతో పోరాడి క్యాన్సర్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
* కంటిచూపును మెరుగు పరుస్తుంది.
* చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే మొటిమల సమస్య నుంచి విముక్తి కల్పిస్తుంది.
* ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడే వారికి జామ ఆకుల టీ నొప్పుల నుంచి పూర్తి ఉపశమనం కలిగిస్తుంది.
*అధికంగా జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు వేడి నీటిలోకి జామ ఆకులను వేసి ఆ నీటితో స్నానం చేయడం వల్ల తలలో ఏర్పడిన చుండ్రు వంటి ఇన్ఫెక్షన్లను తగ్గించి జుట్టు రాలే సమస్య నుంచి కాపాడుతుంది.
* దంత క్షయం, అధిక పంటి నొప్పి, చిగుళ్ళు వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలతో బాధపడేవారు. జామ ఆకులను ఉడకబెట్టిన నీటిని ప్రతి రోజు ఉదయం సాయంత్రం నోటిలో వేసుకొని పుక్కిలించడం వల్ల పంటి నొప్పి నివారణ, చిగుళ్ళు వాపు రక్తస్రావం వంటి సమస్యల నుంచి పూర్తి ఉపశమనం కలిగిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *