తాజా పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!

health-benefits-of-fresh-yogurt

తాజా పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!

మన భారతీయ భాషలో యోగర్ట్ ను పెరుగు అని కూడా పిలుస్తారు. పెరుగును వందలాది సంవత్సరాల క్రితం నుంచి ఆహారపదార్థాలలో ఒక భాగంగా ఉపయోగిస్తున్నారు.క్రమం తప్పకుండా మన ఆహారంలో పెరుగును తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాము. పెరుగులో ముఖ్యంగా అధిక పోషక పదార్థాలు కలిగి ఉండడమే ఇందుకు కారణం.క్రమం తప్పకుండా పెరుగును తీసుకోవడం వల్ల గుండెజబ్బుల వ్యాధి నుంచి కాపాడటానికి కాకుండా, ఎముకలు దృడంగా తయారు చేయడంతో పాటు, బరువును నియంత్రించడంలో సహకరిస్తుంది.

అయితే పెరుగు అనేది పాల నుంచి మనకు లభిస్తుంది. పాలలో ఒక పదార్థమే పెరుగు.పాలు పెరుగు గా మారిన తర్వాత ఎన్నో పోషక విలువలు పెరుగులో నుంచి మన శరీరానికి అందుతాయి కాబట్టి పెరుగు మన ఆహారపదార్థాలలో రోజు తప్పనిసరి ఒక భాగం అయింది. ఇందులో లభించే టటువంటి విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, లాక్టిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉండటం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.

పెరుగు ఎలా తయారవుతుంది?

ముందుగా పాలను బాగా మరిగించిన తర్వాత చల్లార్చాలి. పాలు పూర్తిగా చల్లారకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో రెండు చుక్కలు మజ్జిగను వేయటం వల్ల ఐదు గంటల వ్యవధిలో పాలు మొత్తం పెరుగుగా తయారవుతుంది. ఈ విధంగా లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుంది. లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా అన్ని బ్యాక్టీరియాల మాదిరి హానికర బ్యాక్టీరియా కాదు. మన శరీరంలోకి ప్రవేశించిన హానికర బ్యాక్టీరియా ల ను చంపటం లో ఈ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా దోహదపడుతుంది.

పెరుగు ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటుంది:

మన శరీరానికి అవసరం అయ్యే ప్రతి పోషకాలను పెరుగులో పొందవచ్చు. ప్రతిరోజు మన ఆహార పదార్థాల లో భాగంగా పెరుగును తీసుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి పోషకాలు మన శరీరానికి అందుతాయి. ముఖ్యంగా పెరుగులో క్యాల్షియం అధిక మొత్తంలో ఉంటుంది. క్యాల్షియం మన శరీరానికి ఎంతో ఉపయోగం అయిందని చెప్పవచ్చు. ఎముకలు, దంతాలు పటిష్టంగా ఉండటం కోసం క్యాల్షియం ఎంతో అవసరం.

పెరుగులో క్యాల్షియంతోపాటు విటమిన్లను కూడా కలిగి ఉంటుంది. విటమిన్ బి 12, రైబోఫ్లెవిన్ పెరుగులో విరివిగా లభిస్తాయి. ఈ రెండు విటమిన్లు గుండెజబ్బుల నుంచి శరీరాన్ని కాపాడటంలో దోహదపడతాయి. అదేవిధంగా పొటాషియం మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరచడంలో దోహదపడుతుంది. పెరుగులో విటమిన్ డి కూడా పుష్కలంగా లభించడం వల్ల ఎముకలు దృఢంగా పెరగడానికి విటమిన్-డి సహకరిస్తుంది.

అధిక మొత్తంలో ప్రోటీనులను కలిగి ఉంటుంది:

ప్రతి రోజు రెండు వందల గ్రాముల పెరుగును తీసుకోవడం వల్ల మన శరీరానికి,12 గ్రాముల ప్రొటీన్లు అందుతాయి. అధిక మొత్తంలో ప్రోటీన్లు మన శరీరానికి అందటం వల్ల శరీర పెరుగుదలకు తోడ్పడుతుంది. పెరుగులో ముఖ్యంగా గ్రీకు రకం పెరుగు అధిక ప్రోటీనులను కలిగి ఉంటుంది. మనలో ఆకలిని, బరువును నియంత్రించడానికి పెరుగు ఎంతగానో సహాయపడుతుంది.అదేవిధంగా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను కరిగించి గుండె కు సంబంధించినటువంటి వ్యాధులను దూరం చేయడంలో పెరుగు కీలక పాత్ర పోషిస్తుంది.

జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి:

పెరుగులో ఉన్నటువంటి ప్రోబయోటిక్స్, బిఫడో బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అనే యాంటీబ్యాక్టీరియల్ మన శరీరంలోకి ప్రవేశించిన హానికర బ్యాక్టీరియాలతో పోరాడి జీర్ణక్రియలో తలెత్తే సమస్యలను నివారిస్తుంది. అదేవిధంగా కడుపులో ఉబ్బరం విరేచనాలు మలబద్ధకం వంటి సమస్యలను నివారించడం కోసం క్రమం తప్పకుండా పెరుగును తీసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక రకాల వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది:

తాజాగా తయారు చేసిన పెరుగు లో అధిక భాగం ఖనిజాలు, ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.ఇవన్నీ తగిన మోతాదులో మన శరీరానికి అందటం వల్ల మన శరీరానికి కావాల్సినంత రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. మన శరీరానికి సరిపడినంత రోగనిరోధక శక్తి ఉండటం వల్ల అంటు వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది.

అందమైన ఆరోగ్యకరమైన చర్మం:

క్రమం తప్పకుండా మన ఆహార పదార్థాల లో భాగంగా పెరుగును తీసుకోవడం వల్ల కేవలం ఆరోగ్యప్రయోజనాలను మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన చర్మాన్ని కూడా మనకు ప్రసాదిస్తుంది. పెరుగు మన శరీరాన్ని డీహైడ్రేట్ చేయకుండా ఎల్లప్పుడూ తేమను కలిగించే విధంగా ఉంటుంది. పెరుగు పొడి చర్మానికి సహజ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.పెరుగు లో ఉన్నటువంటి లాక్టిక్ యాసిడ్ చర్మానికి ఒక మంచి ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేయడంతో పాటు, మన చర్మంలో పేరుకుపోయిన మృత కణాలను బయటకు తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదే విధంగా మొహం పై ఏర్పడిన మచ్చలు, మొటిమలను సైతం తొలగిస్తుంది.

యోని ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది:
మహిళల్లో ముఖ్యంగా ఋతు చక్ర సమయంలో యోని భాగంలో అనేక ఇన్ఫెక్షన్లు కలుగుతాయి. పెరుగులో ఉన్నటువంటి ఈస్ట్ ఇన్ఫెక్షన్ పెరుగుదల రేటును నియంత్రించడం వల్ల మహిళలు పెరుగును తీసుకోవడం ఎంతో మంచిది.పెరుగులో కనిపించే లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ బ్యాక్టీరియా శరీరంలో సంక్రమణ పెరుగుదలను నియంత్రిస్తుంది. అదేవిధంగా పెరుగు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉత్పత్తి చేయడం ద్వారా ఈస్ట్ పెరుగుదలను నాశనం చేస్తుంది.

అధిక రక్తపోటును తగ్గిస్తుంది:

పెరుగు లో ఉన్నటువంటి పొటాషియం మెగ్నీషియం తో పాటు ప్రొటీన్లు అధిక సంఖ్యలో లభించటం వల్ల క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన శరీరంలో అధిక రక్తపోటును నియంత్రించి గుండె పనితీరును మెరుగు పరుచుకోవచ్చు.అయితే రక్తపోటుకు మందులను ఉపయోగించేవారు పెరుగును తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. మందులను వాడుతూ పెరుగు తినడం వల్ల తక్కువ రక్తపోటు స్థాయిలు ఏర్పడే ప్రమాదం ఉంది.

ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక టేబుల్ స్పూన్ పెరుగును తినడం వల్ల మన శరీరంలోని ప్రేగులలో పేరుకుపోయిన మలినాలను తొలగించడంలో పెరుగు కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా పెరుగు తినటం వల్ల కడుపులో మంట, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తొలగిపోయి ఆహారం తొందరగా జీర్ణం అవ్వడానికి సహకరిస్తుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా పాల నుంచి తయారైనటువంటి పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా మన చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం లో కూడా పెరుగు కీలకపాత్ర పోషిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

చాలామందికి పెరుగును సహజసిద్ధంగా తయారు చేసుకునే అవకాశాలు లేక పోవడం వల్ల ఎక్కువ శాతం మంది పెరుగును కొని తింటూ ఉంటారు.అయితే మార్కెట్లో లభించే పెరుగు ప్యాకెట్లను కొనేటప్పుడు కచ్చితంగా వాటిపై ఉన్నటువంటి లేబుల్ ను చదివి అందులో ఏ పోషక పదార్థాలు ఎంత పరిమాణంలో ఉన్నాయో చదివి తీసుకోవాలి.ముఖ్యంగా పెరుగును ఎంచుకునేటప్పుడు పెరుగులో ఎటువంటి చక్కెర పదార్థాలు లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి. చక్కెర పదార్థాలతో కలిపిన పెరుగు ను తీసుకోవడం వల్ల అధిక శరీర బరువును పెంచడానికి దోహదపడుతుంది. పెరుగు ని ఎంపిక చేసుకునే సమయంలో పెరుగును ఎంపిక చేసుకోవడం మంచిది. ఇందులో ఎక్కువ శాతం ప్రొటీన్లు, తక్కువ పరిమాణంలో పిండిపదార్థాలు ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *