వేప వల్ల మనం పొందగలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!

health-benefits-from-neem

వేప వల్ల మనం పొందగలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!

వేప చెట్టు ఒక సహజ మూలికా వృక్షం. ఈ వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వేప చెట్టునుంచి లభించే నూనె, ఆకులు, చెట్టు బెరడు వంటి కొన్ని భాగాలను గత కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో పలు రకాల వ్యాధులను నయం చేయడానికి ఎంతో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో ఈ వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ వేప చెట్టును అజాడరిక్ట ఇండికా అనే బొటానికల్ పేరుతో పిలుస్తారు. సంస్కృతంలో నింబా అని కూడా పిలుస్తారు. వేప చెట్టు దాదాపు 130 విభిన్న జీవసంబంధ క్రియాశీల సమ్మేళనాలకు నిలయం అని చెప్పవచ్చు.

వేప నుంచి ఎంతో శక్తివంతమైన రోగనిరోధక ఉద్దీపనతో పాటు రక్తాన్ని శుద్ధి చేయడం రక్తపోటును నియంత్రించడం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అదే విధంగా వివిధ రకాల చర్మ సమస్యలు తొలగించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇక తలలో ఏర్పడే చుండ్రు వంటి సమస్యలను కూడా పూర్తిగా తగ్గించవచ్చు.గత కొన్ని సంవత్సరాలుగా ఆయుర్వేదంలో ఎంతో విరివిగా ఉపయోగిస్తున్న ఈ వేప వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

1) చర్మ ప్రయోజనాలు:

వేప ఆకులు మన చర్మం పై ఏర్పడిన మలినాలను తొలగించి, చర్మం కాంతివంతంగా ఉండటానికి దోహదపడుతుంది. చర్మంపై ఏర్పడే వివిధ రకాల అలర్జీలను, దురద, తామర వంటి చర్మ వ్యాధులను తొలగించడంలో వేపాకు కీలక పాత్ర పోషిస్తుంది. వేపాకు లో కొద్దిగా పసుపు చేర్చి ఆ మిశ్రమాన్ని చర్మానికి రాయడం వల్ల చర్మం పై ఏర్పడిన గాయాలు పూర్తిగా నయం అవుతాయి. వేప ఆకులలో అధిక భాగం యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల చర్మంపై వచ్చే అలర్జీలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వేపాకులను నమలడం ద్వారా మన శరీరం లోపల రక్తం శుద్ధి చేయడమే కాకుండా అంతర్గత గాయాలను కూడా నయం చేయడంలో దోహదం చేస్తుంది. వేపాకు చాలా చేదుగా ఉండటం వల్ల చాలామంది దీనిని తినడానికి ఇష్టపడరు. అయితే వేపాకులలో కొద్దిగా తేనె మిశ్రమాన్ని కలిపి తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వేపాకు ఉడకబెట్టి ఆ నీటిని త్రాగటం వల్ల మన చర్మం పై ఏర్పడిన మొటిమలు, మచ్చలు తొలగిపోయి చర్మం ఎంతో కాంతివంతంగా నిగనిగలాడుతుంది.

2) జుట్టు సాంకేతికతకు మంచిది:

వేపాకులను నమలడం ద్వారా అందులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వేపలో ఉండే ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఏర్పడిన ఫ్రీరాడికల్స్ ను తొలగించడానికి దోహదపడతాయి. అదేవిధంగా ఆక్సీకరణ ఒత్తిడి నుంచి మనల్ని రక్షిస్తాయి. బాగా ఉడక బెట్టిన వేప నీటిని చల్లార్చి ఆ నీటితో తలస్నానం చేయడం ద్వారా తలలో ఏర్పడిన చుండ్రు తొలగిపోతుంది. అదేవిధంగా మన జుట్టు ఎంతో దృఢంగా మారడానికి కూడా వేప దోహదం చేస్తుంది. వేపాకులలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వల్ల ఇవి తలలో ఏర్పడిన చుండ్రును తొలగించి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

3) కంటికి మంచిది:
ఆయుర్వేదం వేపాకు కళ్లకు ఎంతో ప్రయోజనకరమని తెలియజేస్తుంది. ప్రతిరోజు వేపాకు నమలటం వల్ల మన దృష్టి మెరుగుపడుతుంది. చికాకులు, అలసట, ఎర్రబడిన కళ్ళకు చికిత్స చేయడానికి వేపాకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. బాగా ఉడకబెట్టిన వేపాకు నీటిని చల్లబరిచి ఆ నీటితో కళ్లను శుభ్రం చేసుకోవడం వల్ల తలలో ఏర్పడిన మలినాలు తొలగిపోయి కళ్లకు విశ్రాంతి కల్పిస్తుంది. ఈ విధంగా కళ్లను శుభ్రం చేసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.

4) రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:
వేపాకులలో అధిక భాగం యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్న ఈ వేప ఆకులను తరచూ నమలడం ద్వారా మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. అదే విధంగా ఇందులో ఉన్న ఈ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మన శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తాయి. అదే విధంగా క్యాన్సర్ కణాలను నాశనం చేసి క్యాన్సర్ నుంచి కాపాడతాయి.

5) ఎముకలకు మంచిది:
వేపలో అధికభాగం క్యాల్షియం నిండి ఉంటుంది. కనుక ఈ వేప గింజల నుంచి తయారైన నూనెను కీళ్ల నొప్పులతో బాధపడేవారు, కీళ్ల వాపులు ఉన్నవారు వేప నూనెతో బాగా మర్దన చేయడం వల్ల తక్షణమే కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అదే విధంగా ఈ వేప ఆకులను కొద్ది పరిమాణంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న క్యాల్షియం మన శరీరానికి అంది ఎముకల నొప్పుల నుంచి కాపాడి ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది.

6) నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది:
చాలామంది నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. ఈ విధమైన సమస్యతో బాధపడే వారికి వేప ఒక మంచి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు. మన దంతాలను శుభ్ర పరచడం కోసం పూర్వకాలంలో వేపపుల్లలని ఉపయోగించేవారు.వేప పుల్లలతో దంతాలు శుభ్రం చేసుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్లు మన నోటిలో ఏర్పడిన సూక్ష్మ క్రిములను నాశనం చేసి, నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. అదేవిధంగా దంతాలకు, చిగుళ్ళకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది.

7) మధుమేహాన్ని తగ్గిస్తుంది:

మధుమేహంతో బాధపడే వారికి వేప ఒక చక్కని పరిష్కార మార్గం. మధుమేహ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ వేప ఆకులను ఉడికించి ఆ నీటిని తాగటం వల్ల మన శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

వేప నూనెతో కలిగే లాభాలు:

వేప చెట్టు నుంచి కేవలం ఆకుల ద్వారా మాత్రమే కాకుండా వేప గింజల నుంచి తీసే నూనె ద్వారా కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వేప నూనె చెద పురుగులను నియంత్రించడానికి, చిమ్మటలను తరిమివేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. వేప నూనె లో అధిక భాగం యాంటి ఆక్సిడెంట్ లు ఉండటం వల్ల ఇది ఈగలు, దోమలను పారద్రోలడానికి దోహదపడుతుంది. చాలా మంది ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడుతుంటారు అలాంటి వారికి వేప నూనె ఒక మంచి పరిష్కార మార్గం. వేప నూనెను కీళ్లపై వేసి మర్దన చేయడం ద్వారా ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

అదేవిధంగా చాలామందిలో పెను సమస్య బాధిస్తుంటుంది. ఈ విధమైన సమస్యతో బాధపడే వారు వేప నూనె తలకురాయడం వల్ల పెను సమస్యలు తొలగిపోవడంతో పాటు తలలో ఏర్పడిన ఫంగస్ ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది.

దుష్ప్రభావాలు:
వేప ఉత్పత్తులు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కల్పిస్తుందని భావించినప్పటికీ కొందరిలో దీని వల్ల అలెర్జీ సమస్యలు తలెత్తుతుంటాయి. మొదటిసారిగా ఈ వేప నూనెను ఉపయోగించేటప్పుడు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. కొన్ని వేప నూనె చుక్కలను చేతిపై వేసుకొని పరీక్షించాలి. మన చర్మం పై ఎలాంటి చర్యలు జరగకపోతే నిరభ్యంతరంగా ఈ వేప ఉత్పత్తులను మనం ఉపయోగించవచ్చు. లేకపోతే చర్మం మొత్తం ఎరుపుగా మారి దద్దుర్లు ఏర్పడతాయి. ఇకపోతే గర్భిణి స్త్రీలు మొదలైనవారు ఈ విధమైనటువంటి ఉత్పత్తులను ఉపయోగించే ముందు డాక్టర్లను సంప్రదించి ఉపయోగించాలి. ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నప్పటికీ కొందరి శరీర తత్వానికి ఇవి సరిపడవు కనుక ఈ ఉత్పత్తులను ఉపయోగించే ముందు ముందుగా పరీక్షించడం లేదా డాక్టర్లను సంప్రదించడం ఎంతో ఉత్తమం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *