మెరిసే చర్మం కోసం… అద్భుతమైన మార్గాలు..!

for-glowing-skin-amazing-ways

మెరిసే చర్మం కోసం… అద్భుతమైన మార్గాలు..!

మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవంతో పాటు, చర్మం కూడా ఎంతో ముఖ్యమైనది. చర్మం మన శరీరాన్ని ఉంచడంలో దోహదపడుతుంది. ఇలాంటి చర్మం కోసం ఎన్నో రకాలైన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం.ఈ విధమైనటువంటి చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తుంటారు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం కోసం మార్కెట్లో లభించే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించడం మనం చూస్తూనే ఉంటాం.

ఈ సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల కొందరిలో కొన్ని రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మరి కొందరి శరీరతత్వానికి ఈ ప్రొడక్ట్స్ సరిపడక అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఈ విధమైన రసాయనాలతో తయారుచేసిన సౌందర్య ఉత్పత్తులను కాకుండా మన ఇంట్లో దొరికే సహజసిద్ధమైన వాటి నుంచి మన చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. అయితే ఏ పదార్థాల ద్వారా అందమైన మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు ఇక్కడ తెలుసుకుందాం…

1) పసుపు:
పసుపు ప్రతిరోజు మనం వంటలలో వాడే ఒక పదార్థం. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయనే విషయం అందరికీ. పసుపులో కర్క్యుమిన్ అనే పదార్థం ఒక యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాన్ని కలిగి ఉంటుంది. నిత్యం పసుపు ను వాడటం వల్ల మన చర్మం ఎంతో కాంతివంతంగా మెరవడం కాకుండా మన చర్మం పై ఏర్పడిన మృత కణాలను బయటకు తొలగించడంలో సహాయపడుతుంది. మన చర్మంలో ఉన్న ఫ్రీరాడికల్స్ ను బయటకు తొలగించి చర్మంలో కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడానికి దోహదపడుతుంది.

అర టీ స్పూన్ పసుపు పొడిని ఒక కప్పు శెనగపిండిలో కలిపి ఆ మిశ్రమంలోకి తగినంత పాలు నీళ్లు వేసి బాగా మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కి కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి ముఖానికి, మెడకి ప్యాక్ లా వేసుకోవడం వల్ల ఎంతో కాంతివంతమైన మృదువైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

2) తేనె:
తేనె మన ముఖానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. తేనెను మొహానికి అంటించుకోవడం వల్ల చర్మం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఎల్లప్పుడు హైడ్రేట్ చేస్తుంది.తేనెలో ఉన్నటువంటి యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అంటువ్యాధుల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ముఖంపై ఎటువంటి తేమ లేకుండా శుభ్రంగా కడిగి తేనెల మొహం పై అంటించుకుని రెండు నిమిషాలపాటు మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం ద్వారా ముఖంపై ఉన్నటువంటి మృత కణాలు తొలగిపోయి మచ్చలు లేని మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

3) ఆలివ్ ఆయిల్:
ఆలివ్ ఆయిల్ చర్మానికి ఒక యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్ తోచర్మానికి బాగా మసాజ్ చేయడం ద్వారా చర్మం పై ఏర్పడిన ముడతలు తొలగిపోయి వృద్ధాప్య ఛాయలను పోగొడుతుంది. సూర్యకాంతి కి గురైన తర్వాత చర్మంపై ఆలు ఆయిల్ రాసుకోవడం వల్ల చర్మంలో ఉన్న క్యాన్సర్ కణాలతో పోరాడి చర్మ నష్టాన్ని సరిచేస్తుంది.ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ మొహానికి రాసుకుని రెండు నుంచి మూడు నిమిషాలపాటు మసాజ్ చేసిన తరువాత శుభ్రమైన టవల్తో వేడి నీటిలో అద్ది నీటిని బాగా పిండి ఆ టవల్ తో మొహాన్ని తుడుచుకోవడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు.

4) నారింజ రసం:
నారింజ పండు సిట్రస్ జాతికి చెందినది అనే విషయం అందరికీ తెలిసినదే పండ్లలో విటమిన్ సి అధికంగా లభించడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది.ఒకవైపు మన శరీరానికి కావలసినంత రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా మరొక వైపు చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. ప్రతి రోజూ ఉదయం ఒక ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్లచర్మం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. అదేవిధంగా విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చర్మం పై ఏర్పడిన మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది.

ప్రతిరోజు ఉదయం నారింజ పండు రసం తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు నల్లమిరియాల పొడి కలుపుకొని తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా నారింజ తొక్కలను ఎండబెట్టి వాటిని మెత్తగా పొడి చేసుకుని అందులో రోజ్ వాటర్ కలిపి మొహానికి ప్యాక్ లా వేసుకోవడం వల్ల చర్మంపై ఏర్పడినటువంటి మృతకణాలు, దుమ్ము ధూళి మలినాలను బయటకు పంపించడంలో ఈ నారింజ తొక్కలు కీలక పాత్ర పోషిస్తాయి.

5) పాలు:
మన చర్మం నల్లబడటానికి గల కారణం టైరోసిన్, మెలనిన్ నియంత్రించే హార్మోన్లు చర్మం నల్లబడటం కి దారి తీస్తుంది. అయితే పాలు చర్మంలో ఉన్నటువంటి టైరోసిన్ స్థాయిలను నియంత్రించి ఎంతో కాంతివంతమైన చర్మాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది. అయితే పచ్చిపాలను మొహానికి రాసుకోవటం లేదా ఇందులో పసుపు ఇతర పదార్థాలను కలిపి పేస్ట్ లా తయారు చేసుకొని అయినా మొహానికి అప్లై చేసుకోవడం ద్వారా కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.

6) దోసకాయ:
మన చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడంలో దోసకాయ ప్రముఖ పాత్ర వహిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు కళ్ల కింద ఏర్పడినటువంటి నల్లటి వలయాలను, కళ్ళకింద క్యారియర్ బ్యాగ్స్ ను తొలగించడంలో దోస కాయలు ఎంతో దోహదపడతాయి. దోస కాయలు కూడా మన శరీరం మాదిరి పీహెచ్ స్థాయిలను కలిగి ఉంటుంది. దోసకాయలను ముక్కలుగా కత్తిరించి కళ్లపై పెట్టుకోవడం వల్ల కళ్ళ కింద ఉన్నటువంటి నల్లటి వలయాలు తొలగిపోతాయి. అదేవిధంగా మెత్తగా పేస్టులాగా ఒప్పుకొని మొహానికి ప్యాక్ లాగా వేసుకోవడం వల్ల కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.

7) బొప్పాయి:

బాగా పండిన బొప్పాయి మన చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడంలో దోహదపడుతుంది. ఈ బొప్పాయిలో ఉన్నటువంటి పాపైన్ అనే ఎంజైమ్ చర్మం ఎంతో కాంతివంతంగా ఉండేలా దోహదపడుతుంది. చర్మం పై ఏర్పడిన మృతకణాలను తొలగించడంలో ఈ బొప్పాయ కీలక పాత్ర పోషిస్తుంది. బాగా పండిన బొప్పాయిని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ మిశ్రమంతో రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది.

8) నిమ్మకాయ:
నిమ్మకాయ కూడా సిట్రస్ జాతికి చెందిన ఒక పండు కావడంవల్ల ఇందులో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఎంతో పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి చేసి చర్మం స్థితిస్థాపకతను రక్షిస్తుంది. అదేవిధంగా మన శరీరంలో ఏర్పడిన ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో దోహదపడుతుంది. నిమ్మకాయ లో ఉన్నటువంటి యాంటీబ్యాక్టీరియల్ గుణాలు చర్మంపై మొటిమలను మచ్చలను తగ్గించడమే కాకుండా చర్మానికి తగినంత తేమను అందిస్తూ కాంతివంతంగా మెరిసేలా తయారు చేస్తుంది. ప్రతి రోజూ ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగు పడటమే కాకుండా, మన శరీరానికి తగినంత తేమను అందిస్తుంది.అయితే కొందరు నిమ్మకాయతో చర్మంపై మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. అయితే కొందరి శరీర తత్వాన్ని బట్టి నిమ్మరసం శరీరానికి పడకపోవడం వల్ల అలర్జీలు రావచ్చు.నిమ్మకాయను ఉపయోగించేటప్పుడు ముందుగా పరీక్ష చేసుకుని నిమ్మకాయ ఉపయోగించాలి.

ఈ విధమైనటువంటి సహజసిద్ధ పద్ధతులను పాటించడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందమైన, సహజసిద్ధమైన కాంతివంతంగా మెరిసే చర్మాన్ని పెంపొందించుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *