వేసవికాలంలో దూరంగా ఉంచాల్సిన ఆహారాలు ఇవే!

Spicy-food-avoid-in-summer

వేసవికాలంలో దూరంగా ఉంచాల్సిన ఆహారాలు ఇవే!

సాధారణంగా మన ఆహారపు అలవాట్లు కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఆ కాలానికి అనుగుణంగా ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మన శరీరంలో జరిగే జీవ క్రియలు కూడా సరైన క్రమంలో జరుగుతాయి. ముఖ్యంగా వేసవికాలంలో ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వేసవికాలంలో ఆహార పదార్థాలు తీసుకోవడం కన్నా, అధిక మొత్తంలో ద్రావణాలు తీసుకోవడం ద్వారా మనం మరింత ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.సాధారణంగా వేసవికాలంలో వాతావరణంలోని ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మన శరీర ఉష్ణోగ్రతలు కూడా అధికంగా పెరుగుతాయి. కనుక వేసవి కాలంలో వీలైనంత వరకు మన శరీరాన్ని చల్లగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవడం ఎంతో ఉత్తమం.

వేసవికాలం అంటే వాతావరణంలో ఉష్ణోగ్రత సుమారుగా 40 డిగ్రీల పైగానే ఉంటాయి. 40 డిగ్రీల వద్ద ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పుడు మన శరీరం అధిక వేడి, చిరాకు గురవుతుంది. ఈ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం తరచూ నీటిని అధికంగా కలిగి ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. అధిక వేడి వల్ల మన శరీరం నీటిని కోల్పోతే వడదెబ్బ తగిలే అవకాశాలతో పాటు చాలామందిలో వాంతులు-విరేచనాలు కలిగి తీవ్ర అస్వస్థత ఏర్పడుతుంది. ఈ విధమైనటువంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వేసవికాలంలో ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు ఇక్కడ తెలుసుకుందాం…

1) కాల్చిన మాంసం, చేపలు:

సాధారణంగా మాంసాహారం అంటే ఎంతోమంది ఇష్టపడుతుంటారు. అయితే ఆ ఇష్టాన్ని వేసవి కాలంలో పూర్తిగా తగ్గించుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. వేసవి కాలంలో అధికంగా కాల్చిన మాంసం లేదా చేపలను తినటం వల్ల మన శరీరం అధిక వేడికి గురవుతుంది. ఈ చేపలు, మాంసాన్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద కాలుస్తారు గనక ఆ మాంసంలో అధిక ఉష్ణోగ్రత ఉంటుంది.అదేవిధంగా వేసవికాలంలో మన శరీరంలో కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కనుక ఈ రెండింటి కలయిక వల్ల శరీరంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ విధంగా అధిక వేడి కలిగిన ఆహార పదార్థాలను వేసవికాలంలో తీసుకోవటంవల్ల మన శరీరంలో క్యాన్సర్ కణాల నాణ్యతను పెంచుతాయి. తద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక కాల్చిన చేపలు, మాంసాన్ని వేసవికాలంలో వీలైనంత తక్కువగా తీసుకోవడం ఎంతో ఉత్తమం.

2) ఐస్ క్రీమ్:

వేసవికాలం వచ్చిందంటే అందరూ ఎంతో ఇష్టపడే తీసుకొనే స్నాక్స్ లో ఐస్ క్రీమ్ మొదటి స్థానంలో ఉంటుంది. ఐస్ క్రీమ్ ఈ వేడి ఉష్ణోగ్రతలను చల్లబరిచే శీతలీకరణ లక్షణాలు ఐస్ క్రీమ్ లో దాగి ఉన్నాయి. అయితే వేసవి కాలంలో ఎటువంటి పరిస్థితులలో కూడా ఐస్క్రీమ్ తీసుకోకూడదు. ఐస్ క్రీములో ఎక్కువగా కొవ్వులు, చక్కెర పదార్థాలు అధికంగా ఉంటాయి. వేసవికాలంలో తరచూ ఐస్ క్రీమ్ తినటం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

3) ఆల్కహాల్:

మద్యపానం సేవించే వారికి కాలాలతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా మద్యపానం సేవిస్తుంటారు.అయితే ఇది వేసవి కాలం అని మాత్రమే కాకుండా ఏ కాలంలో అధికంగా తీసుకున్న ఆరోగ్యానికి ప్రమాదమే. అయితే వేసవికాలంలో అధికంగా మద్యం సేవించడం వల్ల మరింత అనారోగ్య సమస్యలు తలెత్తడం కాకుండా కొన్నిసార్లు మరణాలు కూడా సంభవిస్తుంటాయి. వేసవి కాలంలో మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల నిర్జలీకరణాన్ని తీవ్రతరం చేస్తుంది. అదేవిధంగా మన శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా తగ్గిస్తుంది. దీని ద్వారా అనేక రకాల వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. కాబట్టి మద్యపానానికి వీలైనంతవరకు దూరంగా ఉండటం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

4) వేడి పానీయాలు:
ఉదయం లేవగానే ప్రతి ఒక్కరికి ఒక కప్పు వేడి వేడి కాఫీ లేదా టీ తాగితే గాని వారికి రోజు గడవదు. అయితే ఈ అలవాటు శీతాకాలంలో ఉండటం ఎంతో మంచిది కానీ వేసవికాలంలో వీలైనంత వరకు వేడి పానీయాలు అయినా కాఫీ, టీ వంటి వాటికి దూరంగా ఉండటం ఎంతో ఉత్తమం. అధిక మొత్తంలో కాఫీ, టీ తీసుకోవడం వల్ల నిర్జలీకరణం పెరుగుతుంది. కాబట్టి కాఫీ, టీ వంటి వాటిని దూరం పెట్టి గ్రీన్ టీ లేదా కోల్డ్ కాఫీ తాగటం వల్ల ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

5) సుగంధ ద్రవ్యాలు:
సుగంధ ద్రవ్యాలను భారతీయ వంటకాలలో ఎంతో విరివిగా ఉపయోగిస్తారు. ఈ విధంగా సుగంధ ద్రవ్యాలను వంటలలో చేర్చటం వల్ల వంటకు మరింత రంగు, రుచిని జోడిస్థాయి. అయితే ఈ సుగంధ ద్రవ్యాలను వేసవికాలంలో అధికంగా తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. వేసవిలో అధిక తీవ్రత ఉండటం కారణంగా సుగంధద్రవ్యాల తీసుకోవడం వల్ల కడుపులో మంట ఏంటి ఈ సమస్యలు తలెత్తుతాయి కనుక వీలైనంత వరకు సుగంధ ద్రవ్యాలను వేసవికాలంలో దూరంగా పెట్టడం ఎంతో ఉత్తమం.

6) అధిక మసాలా కలిగిన పదార్థాలు:
ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక మసాలా కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే వేసవికాలంలో అధికంగా మసాలా కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవటం మంచిది కాదు. అధిక మసాలాలను జోడించడం వల్ల జీర్ణ వ్యవస్థలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా కడుపులో మంటను కలిగిస్తాయి కనుక వేసవికాలంలో వీలైనంత వరకు అధిక మసాలా కలిగిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం ఎంతో ఉత్తమం.

7) వేయించిన ఆహార పదార్థాలు:
వేసవి కాలంలో ముఖ్యంగా వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వేసవికాలంలో వేయించిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల చర్మ వ్యాధులు ఎదురవుతాయి. ముఖ్యంగా చర్మం పై మొటిమలు ఏర్పడతాయి.అదేవిధంగా వేయించిన ఆహార పదార్థాలు జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి వేసవి కాలంలో వేయించిన ఆహార పదార్థాలను దూరం పెట్టడం ఎంతో ఉత్తమం.

8) డ్రై ఫ్రూట్స్:
సాధారణంగా డ్రైఫ్రూట్స్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.ప్రతిరోజు కొద్ది పరిమాణంలో డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని భావిస్తుంటారు. అయితే వేసవికాలంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవటంవల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. డ్రై ఫ్రూట్స్ లో నీటిశాతాన్ని పూర్తిగా కోల్పోయే చక్కెర శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది కనుక వేసవికాలంలో డ్రై ఫ్రూట్స్ వినియోగాన్ని తగ్గించి, అధిక నీటిశాతాన్ని కలిగిన తాజా పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.

9) సాస్, ప్రాసెస్డ్ ఫుడ్:
ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రాసెస్డ్ ఫుడ్, వాటిలోకి సాస్ తీసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే వేసవి కాలంలో వీటి వాడకాన్ని పూర్తిగా తగ్గించడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ప్రాసెస్ ఫుడ్ లేదా సాస్ లో అధికభాగం ఉప్పు, కృత్రిమ రుచులను కలిగి ఉంటుంది.ఈ విధమైనటువంటి ఆహారపదార్థాలను వేసవిలో తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి కనుక వీలైనంత వరకు ఈ విధంగా చేసిన ఆహార పదార్థాలను తీసుకోకపోవడం ఎంతో ఉత్తమం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *