మన శరీరంలో టాక్సిన్లను(వ్యర్థాలు) తొలగించే ఆహార పదార్థాలు ఇవే..!

Foods that remove Toxins

మన శరీరంలో టాక్సిన్లను(వ్యర్థాలు) తొలగించే ఆహార పదార్థాలు ఇవే..!

ప్రస్తుత కాలంలో మనం తీసుకొనే ఆహారపు అలవాట్లలో క్రమంగా మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిలో ముఖ్యంగా జీర్ణక్రియ సమస్య ఒకటి. మనం తీసుకునే ఆహార పదార్థాలలో అధిక శాతం టాక్సిన్లు ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతున్నాయి. మన శరీరంలో ఏర్పడిన ఈ సమస్య నుంచి విముక్తి పొందటానికి కొన్ని డిటాక్సిన్ ఆహార పదార్థాలను తీసుకోవాలి.

డిటాక్సిన్ పదార్థాలు అంటే మన శరీరంలో ఉన్న టాక్సిన్ లకు వ్యతిరేకంగా పని చేస్తూ వాటిని మన శరీరం నుంచి బయటకు పంపుతాయి. తద్వారా మన శరీరంలో జీర్ణక్రియ మెరుగుపడటంతో కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఈ డీటాక్సిన్ ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా క్రమంగా బరువు తగ్గడమే కాకుండా మన శరీరములో అన్ని అవయవాలు క్షేమంగా వాటి పనితీరును మెరుగుపరుస్తాయి. అయితే మన శరీరంలో విషపూరితమైన టాక్సిన్లను తొలగించడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…

గోరువెచ్చటి నిమ్మరసం:

ప్రతిరోజూ ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలోకి నిమ్మకాయ రసం కలిపి త్రాగడం ద్వారా మన రోజును ప్రారంభించాలి.ఈ విధంగా ప్రతి రోజు క్రమం తప్పకుండా పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి తాగడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి విషపదార్థాలు బయటకు తొలగిపోతాయి. వీలైతే వీటిలోకి ఒక టేబుల్ టీ స్పూన్ అల్లం తురుమును కలుపుకొని తాగడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు.

గ్రీన్ టీ:

చాలా మంది ఉదయం లేవగానే వారి దినచర్యను ఒక కప్పు కాఫీ లేదా టీ తో ప్రారంభిస్తారు. ఈ విధంగా కాఫీ లేదా టీ త్రాగటం వల్ల వాటిలో ఉండే కెఫిన్ అనే పదార్థం మన శరీరానికి మంచి కన్నా చెడు ఎక్కువ కలుగజేస్తుంది.ఇలాంటి హానికరమైన ప్రభావాలను నుంచి బయటపడాలంటే ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో కాకుండా అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలను పెంపొందిస్తుంది.

ప్రాసెస్డ్ ఫ్రూట్ జ్యూస్ కు దూరంగా ఉండాలి:

సాధారణంగా ఎంతో మంది చిన్న పిల్లలు వివిధ రంగులతో తయారు చేసినటువంటి చక్కెర పానీయాలను త్రాగడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఈ చక్కెర పానీయాలు ప్యాకెట్ల రూపంలో నిల్వ చేసి ఉంచిన వాటిని త్రాగటం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ప్రాసెస్డ్ ద్రావణాలను తాగడం కన్నా తాజా పండ్లను తీసుకోవడం ద్వారా మన శరీరానికి అవసరం అయ్యే పీచు పదార్థాలను పొందవచ్చు.

అధికంగా నీరు తీసుకోవడం:

ఎల్లప్పుడు మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి.మన శరీరానికి తగినంత నీటి శాతం అందటం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు యూరిన్ రూపంలో లేదా చెమట ద్వారా బయటకు వెలువడతాయి.అంతేకాకుండా అధికంగా నీటిని తీసుకోవడం ద్వారా మన శరీరంలో జరిగే జీవక్రియలు సక్రమంగా పని చేస్తాయి. కనీసం రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని త్రాగటం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపవచ్చు.

దాల్చిన చెక్క టీ త్రాగడం:

ప్రతి రోజూ ఉదయం లేవగానే గ్లాసు గోరువెచ్చటి నిమ్మరసంతో ప్రారంభిస్తే ఆ రోజును ఒక కప్పు దాల్చిన చెక్క టీతో ముగించాలి. దాల్చిన చెక్క టీ లోకి కొంత పరిమాణంలో తేనె వేసి తయారు చేసుకొని త్రాగటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహకరించడమే కాకుండా శరీరంనుంచి టాక్సిన్లను విడుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ప్రతి రోజూ ఆహారంలో పెరుగు తీసుకోవడం:

మన శరీరంలో ఉన్నటువంటి అనేక హానికర బ్యాక్టీరియా లను తొలగించాలంటే ప్రతిరోజూ ఆహారంలో పెరుగును తీసుకోవాలి. పెరుగులో ఉన్నటువంటి లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అధికశాతం లాక్టిక్ ఆమ్లం విడుదల చేయటం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి హానికర బ్యాక్టీరియాలను, విషపదార్థాలను తొలగించడంలో పెరుగు కీలక పాత్ర పోషిస్తుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజు మన ఆహార పదార్థాలలో భాగంగా వెల్లుల్లిని తీసుకోవటంవల్ల మన రక్తంలో, ప్రేగులలో ఏర్పడినటువంటి హానికర బ్యాక్టీరియాలను బయటకు విసర్జింప చేయటంలో వెల్లుల్లి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వెల్లుల్లిలో ఉన్నటువంటి యాంటీబ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మన శరీరంలో క్యాన్సర్ కారక కణాలను నశింప చేస్తాయి.

బీట్ రూట్:

డీటాక్స్ ఆహారపదార్థాలలో బీట్రూట్ ఎంతో ప్రాచుర్యం పొందినది. మన శరీరానికి త్వరగా ఆహార పోషకాలను అందించే వాటిలో బీట్ రూట్ ఒకటని చెప్పవచ్చు. బీట్ రూట్ తీసుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సి మన శరీరానికి కావల్సినంత పోషకపదార్థాలను రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా మన శరీరంలో ఏర్పడినటువంటి విషపదార్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ ను సైతం కరిగించే మంచి డిటాక్స్ ఆహార పదార్థాలలో బీట్ రూట్ ఒకటి అని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *