అధిక రక్తపోటును తగ్గించే ఆహార పదార్థాలు ఇవే..!

foods-that-reduce-high-blood-pressureఅధిక రక్తపోటును తగ్గించే ఆహార పదార్థాలు ఇవే..!

ప్రస్తుత ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు ఎంతో మందిని వేధిస్తున్న సమస్యలో అధిక రక్తపోటు సమస్య ఒకటి. రోజు రోజుకి ఈ రక్తపోటు వలన ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎక్కువమంది పని ఒత్తిడి, మానసిక ఆందోళన చెందటం వల్ల వారి శరీరంలో అధిక రక్త ప్రసరణ జరగటం వల్ల మన గుండె వేగం పుంజుకుంటుంది. దీనిని అధిక రక్తపోటు అని కూడా అంటారు. ఈ అధిక రక్తపోటు కొన్నిసార్లు హాట్ స్ట్రోక్ కి కూడా కారణమవుతుంది. కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. అదే విధంగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారిలో మూత్రపిండాల సమస్యలకు కూడా దారితీస్తుంది.

ప్రస్తుతం అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కొన్ని రకాల శరీర వ్యాయామాలు, యోగాలను చేస్తూ వారి మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు. అదేవిధంగా కొన్ని ఆహార నియమాలను పాటిస్తూ మందులను వాడటం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి విముక్తిని పొందుతున్నారు.కేవలం మందుల వల్ల మాత్రమే కాకుండా సహజ సిద్ధంగా లభించే టటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు నిపుణులు చెబుతున్నారు. అయితే రక్తపోటును నివారించే ఆహార పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

బెర్రీలు:

అధిక రక్తపోటు సమస్య తో బాధపడేవారు ప్రతి రోజు వారి ఆహారంలో చేర్చడం వల్ల రక్తపోటు సమస్యను అధిగమించవచ్చు. ఈ బెర్రీలలో ముఖ్యంగా బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీలు ఈ సమస్యతో పోరాడటానికి కీలకపాత్ర పోషిస్తాయి. బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీలలో ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల రక్తపోటు సమస్య నుంచి విముక్తిని కలిగిస్తుంది.క్రమం తప్పకుండా ఈ బ్యాటరీలను భోజనం తర్వాత తీసుకోవడం ద్వారా ఈ రక్తపోటు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

దుంపలు:

దుంపలు అధిక పోషక విలువలతో కూడి ఉంటుంది. ఈ రక్తపోటు సమస్యతో బాధపడేవారు వీలైనంత వరకూ బీట్ రూట్ జ్యూస్ తాగడం లేదా ఆహార పదార్థాలలో తీసుకోవటంవల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు అందడంతో పాటు, ఈ రక్తపోటు సమస్య నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. బీట్ రూట్ లో అధిక స్థాయిలో అకర్బన నైట్రేట్ రక్తపోటు తగ్గడానికి కారణమని పరిశోధకులు సూచించారు. ప్రతి రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగటం వల్ల రక్తపోటును సాధారణ స్థాయిలో ఉంచుకోవచ్చు.

అరటి:

సీజన్ లతో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా లభించే పండ్లలో అరటి పండు ఒకటి. ఈ అరటి పండ్లు అధిక శాతం పొటాషియం ఉంటుంది. పొటాషియమ్ రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తగినంత పొటాషియం మన శరీరానికి అందటం వల్ల రక్తనాళాల గోడలపై పడే తీవ్రతను తగ్గిస్తుంది. కేవలం అరటిపండులో మాత్రమే కాకుండా టమోటాలు, పుట్టగొడుగులు, తీపి బంగాళాదుంపలు, బీన్స్, అవకాడో వంటి వాటిలో కూడా పొటాషియం అధికంగా లభిస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే…. మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు పొటాషియం అధికంగా ఉన్న పనులను తీసుకోవడానికి ముందు ఒకసారి వైద్యులను సంప్రదించాలి.

కివీస్:

కివీ పోషకాల రారాజు అని చెప్పవచ్చు. కివి లో ఎక్కువగా విటమిన్ సి లభిస్తుంది. అదేవిధంగా ఈ పండులో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల ప్రతి రోజు క్రమం తప్పకుండా ఈ కివి పండును, లేదా సిట్రస్ జాతికి చెందిన పండ్లను తీసుకోవడం వల్ల మన శరీరంలో ఏర్పడిన రక్తపోటు సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.

పుచ్చకాయ:

పుచ్చకాయలో అధిక భాగం సిట్రుల్లైన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది.ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఈ సిట్రుల్లైన్ రక్తనాళాలను సడలించి, ధమనుల వశ్యతను ప్రోత్సహించే వాయువు నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేయడానికి సిట్రులైన్ శరీరానికి సహాయపడుతుంది.

ఆకుకూరలు:

ప్రతిరోజు మన ఆహారంలో ఆకుకూరలను తీసుకోవడం ద్వారా కేవలం రక్తపోటుతో బాధపడేవారు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. తాజా ఆకు కూరలలో నైట్రేట్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ నైట్రేట్లు మన శరీరంలో రక్తపోటును నియంత్రించడానికి దోహదపడతాయి. క్యాబేజీ, పాలకూర, ఆవాలకూర, బచ్చలి కూర, సోపు వంటి మొదలైన ఆకుకూరలు మనకు నైట్రేట్ శాతం అధికంగా లభిస్తుంది.ఈ ఆకు కూరలను ప్రతిరోజు మన ఆహార పదార్థాల లో చేర్చుకోవడం వల్ల పూర్తిగా రక్తపోటును సాధారణ స్థాయిలో ఉంచుతుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి ఔషధగుణాల రారాజు అని చెప్పవచ్చు. ఈ వెల్లుల్లిలో అధికశాతం యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.ప్రతిరోజు మన ఆహార పదార్థాలలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల ఆహారానికి రుచిని మాత్రమే కల్పించకుండా, నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ మన శరీరంలో మృదువైన కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి, అదేవిధంగా మన శరీరంలో రక్త పోటును కూడా నియంత్రిస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం రక్తపోటు సమస్య ఉన్నవారు తరచూ వెల్లుల్లి తినడం వల్ల సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటు రెండింటినీ తగ్గించిందని పరిశోధకులు తెలియజేశారు.

పులియబెట్టిన ఆహారపదార్థాలు:

సాధారణంగా పులియబెట్టిన ఆహారపదార్థాలను తినడానికి ఎక్కువగా ఇష్టపడరు. కానీ ఈ పులియబెట్టిన ఆహారపదార్థాలను ప్రోబయోటిక్స్ అధికంగా ఉండటం వల్ల ఇవి మన శరీరానికి ప్రయోజనకరమైన బ్యాక్టీరియాలను అందిస్తాయి. అదేవిధంగా ఈ ప్రోబయోటిక్స్ అధికశాతం మన శరీరానికి లభించటం వల్ల రక్తపోటును నియంత్రించవచ్చు. ఈ ప్రోబయోటిక్స్ అధికంగా పెరుగు, ఆపిల్ సైడర్ వెనిగర్ వంటి వాటిలో అధికంగా లభిస్తుంది.

దానిమ్మ:

అధిక రక్తపోటు సమస్యను అధిగమించడం కోసం ప్రతిరోజూ ఒక కప్పు దానిమ్మ రసాన్ని 28 రోజుల పాటు తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్యను నియంత్రించవచ్చు. దానిమ్మ పండ్లలో అధిక శాతం యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించవచ్చు.

సాల్మన్ చేపలు:

సాల్మన్ చేపలలో ఒమేగా 3 ఫ్యాటి ఆసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల అనేక గుండె ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ ఫ్యాటి యాసిడ్ మన శరీరంలో ఏర్పడే మంటను తగ్గించడంతో పాటు, రక్త పోటు స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

గుమ్మడి గింజలు:

చూడటానికి ఎంతో చిన్నవిగా కనిపించే ఈ గుమ్మడి గింజలలో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. గుమ్మడి గింజలలో లభించేటటువంటి మెగ్నీషియం, పొటాషియం, నైట్రిక్ ఆక్సైడ్, ఇవి రక్తనాళాల సడలింపు, రక్తపోటును నియంత్రించడానికి కీలకపాత్ర పోషిస్తాయి. అదేవిధంగా ఈ గుమ్మడి గింజల నుంచి లభించే నూనె కూడా అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది.

బీన్స్:

బీన్స్, లేదా గింజలలో అధిక శాతం మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ లభించడం వల్ల మన శరీరంలో ఏర్పడిన అధిక రక్తపోటు సమస్య నుంచి మనల్ని కాపాడుతుంది. క్రమం తప్పకుండా ఈ కాయలను, గింజలను తినడం ద్వారా రక్తపోటు సమస్యను ఎదుర్కోవాలని పలు అధ్యయనాల్లో ఋజువైంది.

పై చెప్పిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా మన శరీరానికి కావలసిన పోషకాలను అందించడమే కాకుండా అధిక రక్తపోటు సమస్యలు కూడా నియంత్రిస్తుంది.ఈ ఆహార పదార్థాలతో పాటు మన శరీరానికి తగినంత వ్యాయామం యోగా వంటివి చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉండి రక్తపోటు సమస్యను నియంత్రించవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *