పెద్దప్రేగు ను శుభ్రపరచడానికి ఉత్తమమైన ఆహార పదార్థాలు ఇవే..!

Healthy-foods-that-Cleans-Colon

పెద్దప్రేగు ను శుభ్రపరచడానికి ఉత్తమమైన ఆహార పదార్థాలు ఇవే..!

మన శరీరంలో కోలన్(పెద్ద ప్రేగు) కీలకమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో పెద్ద పేగు ఎంతో ఆరోగ్యంగా శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే మన జీర్ణ క్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తవు. మనం తినే ఆహార పదార్థాలు మన కోలన్(పెద్ద ప్రేగు) లో పేరుకుపోవటం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ జీర్ణక్రియ సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే మన శరీరంలో ఈ కోలన్ శుభ్రపరచడానికి సరైన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కోలన్(పెద్ద ప్రేగు) లో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు, విష పదార్థాలను శుభ్రం చేసుకోవచ్చు.

తరచు జీర్ణక్రియ సమస్యలు తలెత్తడం కొత్తేమి కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఈ సమస్య తలెత్తుతూ ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం పెద్ద ప్రేగులోకి వెళ్లడం ద్వారా ఆహారంలో ఉన్న పోషకపదార్థాలను ఈ పెద్దప్రేగు శోషణం చేసుకొని వ్యర్థ పదార్థాలను చిన్న ప్రేగు నుంచి పాయువు ద్వారా బయటకు విసర్జిస్తుంది. మనం తీసుకునే ఆహార పదార్థాలు కొన్నిసార్లు పెద్ద ప్రేగులో తీవ్రమైన నొప్పిని కలిగించి అనారోగ్యానికి గురిచేస్తుంది. ఈ విధంగా పెద్దప్రేగులో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను శుభ్రం చేయడానికి కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా మన శరీరంలో కోలన్(పెద్ద ప్రేగు) శుభ్ర పరచుకోవచ్చు. అయితే ఆహార పదార్థాల జాబితా ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….

1. ఆపిల్:

సాధారణంగా ఒక ఆపిల్ పండులో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు ఒక ఆపిల్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని మనకు తెలిసిన విషయమే. అయితే కోలన్(పెద్ద ప్రేగు) ను శుభ్రపరచడంలో ఆపిల్ కీలక పాత్ర పోషిస్తుంది. పెద్దప్రేగును శుభ్రం చేయడానికి ఆపిల్ ను ఏ రూపంలో నైనా తీసుకోవచ్చు. ఆపిల్ లో ఉండే పెక్టిన్ అనే పదార్థం మన శరీరంలో కోలన్(పెద్ద ప్రేగు)లో పేరుకుపోయిన విషపదార్థాలను,వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. అదేవిధంగా ప్రేగు పోరను బలోపేతం చేయడంలో కూడా ఆపిల్ పండు కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఆపిల్ పండులో అధిక శాతం ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ వ్యవస్థను మెరుగు పరచడంతో పాటు మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.

2. అవిసె గింజలు:

అవిసె గింజలు మన పెద్దపేగు శుభ్రపరచడంలో ముందు వరుసలో ఉంటాయి. అవిసె గింజలు అధిక శాతం ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియలో కీలకపాత్ర పోషిస్తాయి. అదేవిధంగా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి శరీర బరువును తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి.

3. అవకాడో:

ప్రతిరోజు మన ఆహార పదార్థాలలో భాగంగా అవకాడో తినడం ద్వారా మన జీర్ణక్రియను ఆప్టిమైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రతిరోజు అవకాడో తీసుకోవడం ద్వారా మన ప్రేగు కదలికలను మెరుగుపరచడమే కాకుండా వాటిని పూర్తిస్థాయిలో శుభ్రంగా ఉంచుతాయి. అదే విధంగా అవకాడో పెద్దప్రేగు క్యాన్సర్ నుంచి కూడా విముక్తిని కలిగిస్తుంది.

4. పండ్ల రసం:

మన శరీరంలో ఆహారం తేలికగా జీర్ణం అవ్వడానికి సరైన మోతాదులో నీటిని లేదా పండ్ల రసాలను అధికంగా తీసుకోవాలి.ఈ విధంగా అధిక మోతాదులో ద్రావణాలను తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు కదలికలను మెరుగు పరుస్తుంది. మన శరీరంలో పెద్ద ప్రేగు శుభ్రంగా ఉండాలంటే క్రమం తప్పకుండా పండ్ల రసాలను తీసుకోవాలి. ఈ పండ్ల రసాలలో ఉన్న ఎంజైమ్‌లు మరియు ప్రక్షాళన లవణాలు మీ పెద్దప్రేగులో ఎలాంటి విషపదార్ధాలు లేకుండా ఆరోగ్యంగా ఉంచగలవు.

5. ఆకుకూరలు:

ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా తాజా ఆకుకూరలను తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆకు కూరల్లో ముఖ్యంగా బచ్చలికూర తీసుకోవడం ద్వారా మన శరీరంలో పెద్ద ప్రేగు కదలికలకు ఎంతగానో సహకరిస్తుంది. ఈ బచ్చలికూర పెద్దప్రేగు ప్రక్షాళన చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ అన్ని రకాల వ్యాధుల నుంచి జీర్ణ వ్యవస్థను సంరక్షిస్తుంది.

6. వెల్లుల్లి:

వెల్లుల్లి ఔషధగుణాల రారాజు అని చెప్పవచ్చు. ఈ వెల్లుల్లిలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నాయి.ఈ వెల్లుల్లిని ప్రతిరోజు మన ఆహార పదార్థాల ద్వారా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడటంతో పాటు పెద్దప్రేగును శుభ్రపరచడంలో కీలకపాత్ర వహిస్తుంది. వెల్లుల్లి జీర్ణ సమస్యలకు అత్యంత ప్రాచుర్యం పొందినది.వెల్లుల్లి కేవలం పెద్దప్రేగు ను శుభ్రపరచడానికి మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె పనితీరును మెరుగు పరచడంలో వెల్లుల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది.

7. అధిక ఫైబర్ కలిగిన ఆహారం:

మన శరీరంలో పెద్ద పేగును ప్రక్షాళన చేయడానికి అధిక మొత్తంలో ఫైబర్ కలిగినటువంటి తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ముఖ్యంగా చిక్కుడు గింజలు, ధాన్యాలను తీసుకోవడం ద్వారా మన శరీరంలో జీర్ణక్రియ వ్యవస్థ మెరుగు పరచడంతో పాటు పెద్ద ప్రేగులను కూడా శుభ్రం చేయడంలో ఉపయోగపడతాయి. అదేవిధంగా మలబద్ధకాన్ని నివారించడంలో వల్ల పెద్ద ప్రేగు ప్రక్షాళన సాధ్యమవుతుంది.ఫైబర్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు మలబద్ధకాన్ని నివారించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *