యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించే ఆహార పదార్థాలు ఇవే..!

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించే ఆహార పదార్థాలు ఇవే..!

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించే ఆహార పదార్థాలు ఇవే..!

మన శరీరంలో జరిగే జీవక్రియలు సరైన క్రమంలో జరగాలన్నా,మన శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ను తొలగించాలంటే మనం తీసుకునే ఆహార పదార్థాలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండాలి. యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని కణాల నష్టాన్ని ఆలస్యం చేయడానికి లేదా నిరోధించడానికి ఉపయోగపడతాయి. అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఉండటం వల్లమన శరీరంపై ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడి మన శరీరంలో ఏర్పడిన ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపిస్తాయి.ఫ్రీ రాడికల్స్ ఒక వ్యక్తి రక్తంలో నిర్మించినప్పుడు, అవి ఆక్సీకరణ ఒత్తిడిని, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను సృష్టించగలవు.

ఈ విధమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందాలంటే సరైన పోషకాహారం తప్పనిసరి. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ భాగం యాంటీఆక్సిడెంట్లు ఉండే విధంగా జాగ్రత్త పడాలి.మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు స్థాయి పెరగటం వల్ల అధిక ఒత్తిడిని తగ్గించవచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే అధిక శాతం యాంటీఆక్సిడెంట్లు కలిగే ఆహారపదార్థాలు ఏమిటో తెలుసుకుందాం…

1) బ్లూ బెర్రీస్:

బ్లూ బెర్రీస్ నిత్యం మనం తీసుకోవటంవల్ల ఇందులో ఉన్న పోషకాలు మన శరీరానికి అందుతాయి. ఈ బ్లూ బెర్రీస్ లో అధిక శాతం పోషకాలు ఉండి తక్కువ మోతాదులో కేలరీలను కలిగి ఉంటుంది. పలు అధ్యయనాల ప్రకారం బ్లూ బెర్రీస్ లో అధిక శాతం ఔషధగుణాలు ఉంటాయి.ఆంథోసైనిన్లు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ చర్యలను కలిగి ఉన్న రసాయనాల సమూహానికి చెందినవి. ఈ ఆంథోసైనిన్లు మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో దోహదపడి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

2) డార్క్ చాక్లెట్:

సాధారణంగా చాక్లెట్ తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పెద్దలు పిల్లలను వాదిస్తుంటారు.అయితే చాక్లెట్లలో డార్క్ చాక్లెట్ తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మంచి నాణ్యత గల చాక్లెట్ లో అధికశాతం పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఉంటాయి.తరచూ ఈ డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన అన్ని యాంటీఆక్సిడెంట్లు అంది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను దహనం చేసి మంచి కొలెస్ట్రాల్ ను అందిస్తుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారు సైతం డార్క్ చాక్లెట్ తినడం వల్ల రక్త పోటును, కడుపులో మంట సమస్యను నియంత్రిస్తుంది.

3) ఆర్టిచోకెస్:

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే వాటిలో ఆర్టిచోకెస్ ఒకటని చెప్పవచ్చు. ఈ ఆర్టిచోకెస్ శరీరంలో ఏర్పడిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి వారి గట్ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ఇవి దోహదపడతాయి. పలు అధ్యయనాల ప్రకారం ఆర్టిచోకెస్ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌పై యాంటీఆక్సిడెంట్ ప్రభావాన్ని చూపుతాయని, తరుచూ వీటిని తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

4) స్ట్రాబెర్రీస్:

చూడటానికి ఎరుపుగా ఎంతో చిన్నవిగా కనిపించే స్ట్రాబెర్రీస్ పులుపు ,తీపి రుచులను కలిగి ఉంటాయి. ఇందులో ఎక్కువ భాగం విటమిన్ సి లభిస్తుంది. అదేవిధంగా స్ట్రాబెర్రీస్ లో ఉండేటటువంటి ఎరుపు రంగును ఆంథోసైనిన్లకు ఎంతో రక్షణ కల్పిస్తూ ఉంటాయి.ఈ ఆంథోసైని యాంటీ ఆక్సిడెంట్ కణాలకు శక్తిని కల్పిస్తూ ఉంటాయి. ఈ స్ట్రాబెర్రీలను కాయల రూపంలో లేదా సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి సరిపడినంత యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఇతర పోషకాలు, విటమిన్ సి అధికంగా లభిస్తుంది.విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించి ఎన్నో రకాల అంటువ్యాధుల నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది.

5) ఎర్ర క్యాబేజీ:

ఎరుపు రంగును కలిగి ఉన్నటువంటి పండ్లు కూరగాయలు ఎక్కువగా ఆంథోసైనిన్లకు నిలయంగా ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఎర్ర క్యాబేజీలో విటమిన్ ఏ, సి, కె, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. పలు అధ్యయనాల ప్రకారం తరచూ తినడం వల్ల మన శరీరానికి కావలసిన శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. అదేవిధంగా మన శరీరంలో ఏర్పడిన క్యాన్సర్ కణాలను అణచివేయడంలో ఇందులో ఉన్న పోషకాలు ముఖ్యంగా ఉపయోగపడతాయి. తరచూ ఎర్రటి క్యాబేజీ తీసుకోవడం వల్ల డయాబెటిస్ ను నియంత్రించడమే కాకుండా శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు.

6) బీన్స్:

బీన్స్ ను పోషకాల రారాజు అని చెప్పవచ్చు. ఇందులో అధిక శాతం పోషక పదార్థాలతో పాటు ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పింటో బీన్స్ లో అధికభాగం యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది. అదేవిధంగా పింటో బీన్స్‌లో కెంప్ఫెరోల్ అనే మొక్క ఫ్లేవనాయిడ్ ఉంటుంది, ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అణిచివేసేందుకు, కడుపులో కలిగే మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. తరచూ మన ఆహార పదార్థాలు లో భాగంగా బీన్స్ తీసుకోవడం వల్ల రొమ్ము, ఊపిరితిత్తులు, మూత్రాశయ, మూత్రపిండం అంటే క్యాన్సర్ల నుంచి విముక్తి పొందవచ్చు.

7) బచ్చలి కూర:

మామూలుగా ఆకుకూరలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. తరచూ ఆకుకూరలు తినటం వల్ల ఎన్నో రకాల పోషక పదార్థాలు మన శరీరానికి అందుతాయి. ఈ ఆకు కూరలలో ముఖ్యంగా బచ్చలి కూర విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లకు నిలయం అని చెప్పవచ్చు. ఈ ఆకుకూరలు పోషక పదార్థాలు అధికంగా ఉండే కేలరీలు తక్కువ స్థాయిలో ఉంటాయి.ఈ ఆకు కూరలు ఎక్కువగా సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి తగినంత యాంటీ ఆక్సిడెంట్లను పొందవచ్చు.

8) దుంపలు:

సాధారణంగా దుంపలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. ముఖ్యంగా దుంపలలో అధిక భాగం బీటాలైన్స్ అని పిలువబడే వర్ణద్రవ్యం ఉండటం వల్ల అధిక భాగం యాంటీఆక్సిడెంట్లు ను కలిగి ఉంటుంది. మన శరీరంలో ఏర్పడే పెద్దప్రేగు క్యాన్సర్, జీర్ణక్రియ సమస్యలను నివారించడానికి బీటాలైన్స్ ఎంతో ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ దుంపలో లభించే అయినా పొటాషియం వంటి పోషకాలు మన కడుపులో ఏర్పడే మంటను తగ్గిస్తాయి.

9) ఆరెంజ్ కూరగాయలు:

సాధారణంగా నారింజ కూరగాయలు అధికభాగం విటమిన్ సి లభిస్తుంది. ఇది మన శరీరానికి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ విధమైన రంగును కలిగి ఉన్నటువంటి కూరగాయలలో అధికశాతం ఫైటోకెమికల్స్ ఉంటాయి. అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్స్ తీపి బంగాళాదుంప, క్యారెట్, అకార్న్ స్క్వాష్, బటర్నట్ స్క్వాష్ వంటి నారింజ రంగులో ఉండే కూరగాయలు తరచూ ఆహారపదార్థాలలో లేదా సలాడ్ రూపంలో తీసుకోవడం ద్వారా మనకు ఎన్నో పోషక విలువలు చేకూరుతాయి.

10) పెకాన్స్:

పెకాన్స్ మంచి కొవ్వు, కేలరీలు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అధికంగా అందిస్తాయి. పలు అధ్యయనాల ప్రకారం శరీరం పెకాన్ల నుండి యాంటీఆక్సిడెంట్లను గ్రహించడం వల్ల, రక్తంలో వాటి స్థాయిలను పెంపొందించుకుంటుంది.ముడి పెకాన్స్ తినడం వల్ల ఆక్సిడైజ్డ్ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క రక్త స్థాయిలను తగ్గించటానికి సహాయపడుతుంది, అంటే ఈ గింజలు గుండె పనితీరును మెరుగుపరచడానికి కూడా దోహదపడతాయి.ఈ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి సరిపడే యాంటీఆక్సిడెంట్లు లభ్యమవుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *