మ‌న‌ ఆరోగ్యానికి, కళ్ల రంగుకి సంబంధం ఉంటుందా

మ‌న‌ ఆరోగ్యానికి, కళ్ల రంగుకి సంబంధం ఉంటుందా ?

మ‌న క‌ళ్లు మ‌న హావ‌, భావాలను పండించ‌డంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయి. అయితే అవే క‌ళ్లు మ‌న ఆరోగ్యాన్ని కూడా సూచిస్తాయ‌ని ప‌లువురు నిపుణులు చెబుతుంటారు. మ‌న క‌ళ్ల‌ను చూస్తే.. ముందు ముందు మ‌న‌కు వ‌చ్చే అనారోగ్యాల‌ను కూడా చెప్పొయొచ్చ‌ట‌. మాములుగా  క‌ళ్లు బ్లూ, గ్రీన్, లేత గోధుమ రంగుల్లో ఉంటాయి. ఇలా  ఉండే కళ్ల రంగుని బట్టి హెల్త్ కండీషన్ ఎలా ఉండో చెప్పొచ్చ‌ట‌. రానున్న రోగాల‌ను ముందే ప‌నిగ‌ట్టి.. జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మ‌న‌కు ఎంతో మంచిద‌ని ప‌లువురు నిపుణులు చెబుతున్నారు. ఈ రంగుల వ‌ల‌న ఏయే విషయాలకు దూరంగా ఉండాలనే తెలుస్తుంద‌ట‌. వాటికి సంబంధించిన ప‌లు విష‌యాలు మీ కోసం..

అయితే మ‌న క‌ళ్ల‌కు కంటి చూపు సమస్యలు, కాలేయ వ్యాధులు, క్యాన్సర్, బొల్లి వంటి ప‌లు ర‌కాల వ్యాధుల‌కు సంబంధం ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు. మ‌న క‌ళ్ల రంగుతో వీటిని క‌చ్చితంగా అంచ‌నా వేయొచ్చ‌ని వైద్యులు సూచిస్తున్నారు. కంటి రంగుకి డిప్రెషన్ వంటి వ్యాధులకు సైతం సంబంధం ఉంద‌ని ప‌లు స‌ర్వేలు చెబుతున్నాయి. అందుకే మ‌నం డాక్ట‌ర్ల ద‌గ్గ‌ర‌కు పోగానే ముందు మ‌న క‌ళ్ల‌ను ప‌రిశీలిస్తారు. మీరు కూడా ఈ విష‌యాల‌ను తెలుసుకోండి ఇక‌..

క‌ళ్లు పేలవంగా ఉంటేః

మ‌న కళ్లు చాలా లైట్ కలర్ లోకి మ‌రితే మ్యాక్యుల‌ర్ డిజ‌న‌రేష‌న్ స‌మ‌స్య‌కు సంకేతం. అలాగే క‌ళ్లు మ‌స‌క‌బారిన‌ట్లు ఉన్నాయంటే కూడా ఈ వ్యాధికి సూచిక‌గానే భావించొచ్చు. ఇది క‌నుక 60 ఏళ్ల కంటే పెద్ద‌వారిలో ఉంటే వ్యంధ్యత్వానికి దారితీయొచ్చు.

డార్క్ ఐ కలర్ ఉంటేః

ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా మహిళల్లో పిల్ల‌ల‌కు జ‌న్మనిచ్చేట‌ప్పుడు కనిపిస్తుంది. బ్రైట్ కలర్ లో కళ్లు ఉన్న మహిళకు ఆందోళన స‌మ‌స్య ఉంటుంది. అలాగే నిద్రలో మెలుకువ వ‌చ్చే స‌మ‌స్య కూడా ఉంటుంది.

క‌ళ్లు ఎల్లో కలర్ లో ఉంటేః
మ‌న కళ్ల రంగులో ఒక్క‌సారిగా మార్పులు వ‌స్తే ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌లు రాబోతున్నాయని అర్థం‌. అట్లాగే కళ్లు పసుపు రంగులోకి మారితే కాలేయ సమస్యలు వ‌స్తున్నాయని సూచిక‌. అలాగే అది జాండీస్  అయ్యే అవ‌కాశం ఉంది.

క‌ళ్లు తెల్లగా ఉంటేః
డార్క్ కలర్ కళ్లు ఉండే వారు, వైట్ క‌ల‌ర్ కళ్లు ఉండే వాళ్ల‌తో పోల్చితే తక్కువ ఆల్కహాల్ తీసుకోవాల‌ని ప‌లువురు నిపుణులు చెబుతున్నారు. దానికి కార‌ణం వారి కళ్లు చాలా సున్నితంగా ఉండంటం.  ఇక తెల్లగా కళ్లు ఉండేవాళ్లు ఆల్కహాల్ తాగినా కానీ త‌ట్టుకునే శ‌క్తి ఉంటుంది.

క‌ళ్లు ఎర్రగా మారితేః
ఎర్రగా మారిన కళ్లు వృద్ధుల్లో  వచ్చే కంటి చూపు సమస్యలను సూచిస్తాయి. ఎర్రటి కళ్ల వల్ల కొన్ని సార్లు చూపు మందగించడం జ‌ర‌గొచ్చు. అలాగే చూపునే  కోల్పోయే అవ‌కాశం కూడా ఉంది.

క‌ళ్లు గ్రీన్ కలర్ లోకి మారితేః
లేత గోధుమ రంగు, ఆకుపచ్చ రంగులోకి మారితే క‌ళ్లు బొల్లిని హెచ్చరిస్తుంది. ఇది చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతుంద‌ని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా చర్మంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపే అవ‌కాశం ఉంది.

క‌ళ్లు నీలిరంగులోకి మారితేః
క‌ళ్లు నీలి రంగులో మారితే క్యాన్సర్ ను వృద్ధి చేస్తాయ‌ని ప‌లు రీసెర్చ్ లు చెబుతున్నాయి. ఇలాంటి వారిలో చాలా సున్నితమైన వ్యాధినిరోధక వ్యవస్థ ఉంటుంద‌ట‌. దీని వ‌ల‌న‌ క్యాన్సర్ కణాలు ఈజీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ట‌.

పై ల‌క్ష‌ణాల‌ను గ‌మ‌నిస్తే.. ఆందోళ‌న చెంద‌కుండా వైద్యుల‌ను సంప్ర‌దిస్తే.. అన్ని విష‌యాలు తెలుస్తాయి. అది నిజం అయితే వైద్యులు సూచించిన వైద్యాన్ని తీసుకుంటే స‌రిపోతుంది. అలాగే ఇది పూర్తిగ నిజం కాక‌పోవ‌చ్చు. కేవ‌లం ఇక్క‌డ ఇచ్చిన స‌మాచారం మీకు ఒక అవ‌గాహ‌న పెంచ‌డానికే త‌ప్పించి మ‌రోటి కాదు. దేన్ని న‌మ్మాల‌న్నా మీరు ముందుగా వైద్యుల‌ను సంప్ర‌దించాల్సిందే. అప్పుడే నిజాలు తెలుస్తాయి. మీ ఆరోగ్యం ప‌దిలంగా ఉండాలంటే మంచి ఆహారం, మంచి వ్యాయ‌మం మాత్రం ముఖ్య‌మ‌ని తెలుసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *