భారతీయ పచ్చళ్లను డైట్ లో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?

do-you-know-the-benefits-of-taking-Pickles

భారతీయ పచ్చళ్లను డైట్ లో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?

భారతీయ పచ్చళ్లను డైట్ లో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?సాధారణంగా భారతీయులు వారి ప్రతిరోజూ ఆహారంలో భాగంగా ఇంట్లో తయారు చేసుకున్న పచ్చళ్లను తినడానికి ఎంతో ఇష్టపడుతుంటారు. ఈ విధంగా భారతీయులు వారి ఇండ్లలో స్వయంగా పచ్చళ్లను తయారు చేసుకోవడం కొన్ని సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా వస్తోంది. ఈ పచ్చళ్లను మామిడి, నిమ్మ, ఉసిరి, టమోటా, చింత, మిరప వంటి తదితర కూరగాయలను ఉపయోగించి పచ్చళ్లు తయారు చేసుకుంటారు.ఈ పచ్చళ్లను తయారు చేసుకోవడం కోసం ఈ కూరగాయలను చిన్నచిన్న ముక్కలుగా తరిగి వాటిలోకి సరిపడినంత ఉప్పు, కారం, సుగంధ ద్రవ్యాలను కలిపి పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటారు. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చళ్లను కలుపుకొని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. ఈ విధంగా తినడానికి ఎంతో రుచికరంగా ఉండే ఈ పచ్చళ్లను ప్రతి రోజు మన ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

1) రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

సాధారణంగా మనం పచ్చళ్లును తయారు చేసేటప్పుడు వాటిలో పసుపును కలుపుతాము. పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది.ఇందులో అధికభాగం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది మన శరీరంలోకి ఎటువంటి హానికర బ్యాక్టీరియాలను, వైరస్ ల వల్ల కలిగే అంటు వ్యాధులు మన దరికి చేరకుండా మన శరీరానికి కావల్సినంత రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది.

2) విటమిన్స్, మినిరల్స్:

భారతీయులు కేవలం కూరగాయలతో మాత్రమే కాకుండా ఆకుకూరలతో సైతం పచ్చళ్లు తయారు చేసుకోని నిల్వ ఉంచుకుంటారు. ఈ క్రమంలో గోంగూర, కరివేపాకు, కొత్తిమీర,పుదీనా వంటి ఆకు కూరలతో కూడా పచ్చళ్ళు తయారు చేసుకుంటారు. అయితే ఇటువంటి ఆకుకూరలతో తయారు చేసిన పచ్చళ్ళు తినడం వల్ల మన శరీరానికి కావల్సినంత విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. వీటితో పాటు ఐరన్ పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా అధిక మొత్తంలో మన శరీరానికి అందుతాయి.

3) ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది:
పచ్చళ్లు తయారు చేసేటప్పుడు అందులో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఎన్నో యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి.ఇవి మన శరీరంలో పేరుకుపోయిన ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపించడం లో దోహదం చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ మన శరీరంలో ఉండి DNA తో కలవడం వల్ల డిఎన్ఏ పరిమాణం, ఆకృతిలో మార్పులు జరగటం వల్ల ఎంతో ప్రమాదం వాటిల్లుతుంది. కాబట్టి మన ఆహారంలో భాగంగా పచ్చళ్లను తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన ఫ్రీరాడికల్స్ ను బయటకు తొలగించవచ్చు.

4) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
ప్రస్తుత కాలంలో మన ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఎన్నో అరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అజీర్తి సమస్యతో ఎంతోమంది సతమతమవుతున్నారు. ఈ విధంగా అజీర్తి సమస్యతో బాధపడేవారు మన ఇంటిలో సహజసిద్ధంగా పులియబెట్టిన పచ్చళ్లను మన ఆహారంలో భాగంగా తీసుకోవటం వలన జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. జీర్ణ వ్యవస్థ మన శరీరంలో ప్రో బయోటిక్స్ అనే బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తాయి. ఈ బ్యాక్టీరియాలు ఆహారం తొందరగా జీర్ణం అవ్వడంలో ఎంతో సహకరిస్తాయి. అదేవిధంగా మనం తయారు చేసుకున్న పచ్చడిలో ఎక్కువ భాగం ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల మన శరీరంలో ఏర్పడిన జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తిని కల్పిస్తుంది. అదేవిధంగా మలబద్ధక సమస్యను కూడా నివారిస్తుంది.

5) కాలేయాన్ని రక్షిస్తుంది:

మనం తయారు చేసుకుని పచ్చళ్లలో ముఖ్యంగా ఉసిరికాయలతో తయారు చేసుకున్న పచ్చళ్లను ఆహార పదార్థంలో భాగంగా తీసుకోవడం వల్ల ఇతర హానికరమైన బ్యాక్టీరియాల నుంచి కాలేయాన్ని రక్షిస్తుంది. ఈ ఉసిరికాయలలో ఉన్నటువంటి హెపాటోప్రొటెక్టివ్ అనే పదార్థం కాలేయానికి కాపాడటమే కాకుండా కాలేయానికి కలిగే నష్టాన్ని కూడ తగ్గిస్తుంది.

6) వ్యాధులతో పోరాడుతుంది:
బీటా కెరోటిన్ అనే యాంటీఆక్సిడెంట్లు దోసకాయలలో ఎక్కువ భాగం ఉంటాయి. బీటా కెరోటిన్ ఒక శక్తివంతమైన సమ్మేళనం. ఇది గుండె సమస్యలను, స్ట్రోక్, క్యాన్సర్ వంటి శ్వాసకోశ వ్యాధులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

7)డయాబెటిస్ ను తగ్గిస్తుంది:
క్రమం తప్పకుండా మన ఆహార పదార్థాలలో భాగంగా పచ్చళ్లను తీసుకోవటంవల్ల ఇందులో ఉన్నటువంటి వెనిగర్ మన శరీరంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచడంలో దోహదపడుతుంది.ముఖ్యంగా డయాబెటిస్ వంటి వ్యాధితో బాధపడేవారు ఊరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవటంవల్ల డయాబెటిస్ ను సాధారణ స్థితిలో ఉంచుకోవచ్చు.

8) గర్భధారణలో ఎంతో ఉపయోగకరం:
సాధారణంగా గర్భం ధరించిన మహిళలకు మొదటి మూడు నెలలు వాంతులు, వికారం వంటి సమస్యలతో సతమతమవుతుంటారు. ఇలాంటి సమయాలలో గర్భవతులు ఈ పచ్చళ్లను తినడం వల్ల వారికి ఈ వికారం నుంచి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. ఈ పచ్చడిలో ఉన్నటువంటి పులుపు వాంతులు రావటాన్ని అరికడుతుంది.

పచ్చళ్ళు వల్ల ఉపయోగాలు:

సాధారణంగా పచ్చళ్లను మనం వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలతో తయారు చేసుకుంటాము. తక్కువ సోడియం కలిగినటువంటి పచ్చళ్ళు తినడం వల్ల ఆహారంలో ఎక్కువ పోషకాలను చేర్చడానికి ఎంతో సులువుగా ఉంటుంది. ఊరగాయల ద్వారా తయారుచేసిన రసం తక్షణ శక్తిని అందించడం కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది. హ్యాంగోవర్ సమస్యతో బాధపడే వారు కొద్దిగా ఈ పచ్చడి తినడం వల్ల హ్యాంగోవర్ నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అదే విధంగా తిరిగి మన శరీరానికి రీహైడ్రేషన్ ని కల్పిస్తుంది. ఈ పచ్చళ్లలో అధికభాగం యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషక పదార్థాలు ఉండటం వల్ల జీర్ణక్రియకు ఎంతగానో సహకరిస్తాయి.ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి ఈ పచ్చళ్లను ప్రతి రోజూ మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపణులు తెలియచేస్తున్నారు. అయితే సహజ సిద్ధంగా ఇంట్లో తయారు చేసుకున్న పచ్చడి తిన్నప్పుడు మాత్రమే మనము ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మార్కెట్లో లభించే పచ్చడిలో అధికభాగం రసాయనాలను ఉపయోగించి తయారుచేస్తారు కాబట్టి కొంత వరకు మన ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే పరిస్థితులు ఏర్పడతాయి.

పచ్చడి వల్ల కలిగే దుష్ప్రభావాలు:

పచ్చళ్ళు ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం గురించి తెలుసుకున్నాం. అయితే వీటిని మితంగా తీసుకున్నప్పుడు మాత్రమే పై తెలిపిన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అలాకాకుండా పరిమితికి మించి పచ్చడిని తీసుకోవడం వల్ల మన శరీరం పై ఎన్నో దుష్ప్రభావాలను చూపిస్తుంది. అధిక మొత్తంలో పచ్చళ్ళు తినడం వల్ల వీటి ప్రభావం అన్నవాహిక పై పడతాయి. కొన్నిసార్లు అన్నవాహిక క్యాన్సర్, గ్యాస్ట్రిక్ , కడుపులో మంట అజీర్తి వంటి ప్రమాదాలను కూడా తలెత్తేలా చేస్తాయి. అదేవిధంగా ఈ పచ్చళ్లను తయారు చేసేటప్పుడు అధిక భాగంలో ఉప్పును ఉపయోగించటం వల్ల ఇది రక్తపోటు, గుండెజబ్బులు రావడానికి కారణమవుతుంది. ముఖ్యంగా రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఈ పచ్చళ్లను చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదాలు తలెత్తవు.కాబట్టి వీలైనంత వరకు కేవలం కొంత పరిమాణంలో మాత్రమే ఈ పచ్చళ్లను ప్రతి రోజూ మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎల్లో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని, పరిమితికి మించి తీసుకోవటంవల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *