డ‌యేరియా (అతిసారం)నివార‌ణ మార్గాలు!

Diarrhea Causes

డ‌యేరియా (అతిసారం) నివార‌ణ మార్గాలు!

మీకు గానీ కొంచెం కడుపు నొప్పి ఉండి.. ఎక్కువ సార్లు విరోచనాలు గాని అవుతుంటే మీరు త్వ‌ర‌గా వైద్యుల‌ను సంప్ర‌దించాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా డయేరియా (అతిసారం) వ్యాధి ముఖ్య ల‌క్ష‌ణాలు. కొన్ని సార్లు ఈ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా కూడా మారుతుంది. అయితే ఈ విరోచ‌నాలు కావ‌డానికి బాక్టీరియా, వైరస్ లు కార‌ణం. వీటి ద్వారానే ఇవి సంక్ర‌మిస్తాయి. వీటివ‌ల‌న ఎంతో అసౌకర్యం క‌లుగుతుంది.

అయితే డయేరియాకు కారణమైన బ్యాక్టీరియా వ్యాపించ‌డానికి కార‌ణ‌మైన‌ వాహ‌కాలు మ‌నం తీసుకునే ఆహారం ద్వారా తాగే నీటి ద్వారా మ‌న‌కు డ‌యేరియా సోకేలా చేస్తాయి. అందుకే మనం తినే ఆహార విష‌యంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. లేకుంటే మనం తీసుకొన్న ఆహారం కడుపులోనున్న‌ ప్రేగుల కదలికలపై చెడు ప్ర‌భా‌వాన్ని చూపిస్తుంది.

అయితే అవసరమైన దానికన్నా ఎక్కువ ఆహారాన్ని తిన‌డం, కెఫీన్, ఆల్కహాల్ లాంటి పదార్థాలను తీసుకోవడంతో డయేరియా వ‌స్తుంద‌ని వైద్యుల చెబుతుంటారు. డయేరియా వ‌ల‌న ప్రేగుల్లో అసాధారణమైన కదలిక‌లు రావొచ్చు. దీంతో ఎంతో బాధ అలాగే త‌ర‌చుగా విరోచ‌నాలు అవ్వ‌డానికి అవ‌కాశాలు చాలా ఉన్నాయి.

ఏం చేయాలి ?
డయేరియాతో బాధపడుతున్నప్పుడు తక్షణ చికిత్స కోసం అందుబాటులో ఉన్న మందుల‌ను వాడాలి. కానీ ఆ మందుల‌ను ఎప్పుడెప్పుడు వేసుకోవాలో తెలిసి ఉండాలి. అలా కాకుండా ఎప్పుడు ప‌డితే అప్పుడు వేసుకోవ‌ద్దు. మీకు డయేరియా ఉంటే చికిత్స కోసం మీ వంటగదిలోనే ఉండే ప‌లు ప‌దార్థాల‌ను వాడుకోవ‌చ్చు. అవి మీకు రిలీప్ ను ఇస్తాయి. ఈ సహజ నివారణలు మీకు ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించ‌వు. ఇది అత్యంత గొప్ప విషయం.

ఇంటి చిట్కాలు ఏంటి?
ఇంట్లో ఉంటే వాటితో డ‌యేరియాను త‌గ్గించుకోవ‌చ్చు. అందులో ముఖ్య‌మైన ప‌దార్థాలు

పెరుగుః
పెరుగు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. ఇందులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ప్రతిరోజూ పెరుగును తిన‌డం వ‌ల‌న డయేరియాతో పాటు ప్రేగుకు సంబంధించిన ప‌లు అంటురోగాలను దూరం చేసుకోవ‌చ్చు.

నీరు బాగా తాగాలిః
అతిసారంతో బాధపడుతుంటే శరీరం చాలా మటుకు నీటి శాతాన్ని కోల్పోతుంది. దీంతో బలహీనంగా మారిపోతారు. అలాగే డీహైడ్రేట్ కు గుర‌య్యే అవ‌కాశం ఉంది. అందుకే మాములు రోజుల్లో తాగే నీటి మోతాదు కన్నా ఎక్కువ స్థాయిలో నీటిని తాగాలి. అలా చేస్తే మీ శరీరానికి అవసరమైన శక్తిని మీరు పొందొచ్చు. దీంతో మీ శరీరం హైడ్రేట్ అవుతుంది. నీటితో పాటు ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ‌గా ఉండే కొబ్బరినీళ్ల‌ను ఎక్కువ‌గా తాగాలి. ఇది శరీరాన్ని త్వరగా హైడ్రేట్ చేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

మెంతులుః
మెంతుల్లో మెంసిలేజ్ అనే ముఖ్యమైన సమ్మేళనం ఉంటుంది. ఇది హానికరమైన బ్యాక్టీరియా నుంచి మ‌న‌ శరీరాన్ని రక్షిస్తుంది. ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో మెంతులను కొంత మేరా తీసుకోవాలి.2-3 టీ స్పూన్ల మెంతి గింజలను రోజూ తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. లేకుంటే రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో మెంతి గింజలను 7 – 8 గంటల నాన‌బెట్టాలి. ఆ నీళ్ల‌ను మార్నింగ్ పూట తాగాలి. అవి మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్ః
దీనికి మంచి యాంటీబయోటిక్ లక్షణాలు ఉంటాయి. ఈ ఆపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ ప్రేగుల కదలికల సమస్యలను తీర్చ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో ఉండే పెక్టిన్ అనే పదార్థం ఈ ల‌క్ష‌ణాన్ని క‌లిగి ఉంటుంది. దీనికి మీరు చేయాల్సింద‌ల్లా.. రోజువారి ఆహారంలో ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోవాలి.

చమోమిలే-టీః
చమోమిలే-టీకి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.ప్రేగు సంక్రమణకు సంబంధించిన వ్యాధుల‌ను ఇది న‌యం చేయ‌డంలో చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. అతిసారంతో బాధపడేవాళ్లు చమోమిలే-టీని రోజులో 2 – 3 సార్లు తాగాలి. ఇలా చేస్తే మంచి ఫ‌లితాలు ఉంటాయి.

పసుపు, మజ్జిగ
పసుపు మంచి యాంటీసెప్టిక్ లక్షణం క‌ల‌ది. రోజూ ఒక చిన్న పసుపుకొమ్ము లను తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి, మెత్తని పొడిగా చేసి, దాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని మజ్జిగలో క‌ల‌పాలి. అలా చేసి రోజూ తాగాలి. ఇలా చేయడం వ‌ల‌న‌ అతిసారం నుంచి ఉపశమనం క‌లుగుతుంది.

తేనెః
ఉత్తమమైన‌ సహజ పదార్థాల్లో తేనె మెద‌టిది. డయేరియాతో బాధపడుతున్నవాళ్లు ఒక గ్లాసు వేడి నీటిలో, 3 – 4 టీ స్పూన్ల తేనెను కలిపి తాగాలి. ఇలా చేస్తే.. తక్షణమే అతిసారము నుండి ఉపశమనం క‌లుగుతుంది.

అరటిః
డయేరియాతో బాధపడుతున్న వాళ్లు అరటి పండ్ల‌ను ఎక్కువ‌గా తినాలి. అరటిలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దీంతో డయేరియా నుంచి సత్వర ఉపశమనం వ‌స్తుంది. అయితే ఎక్కువ అర‌టి పండ్ల‌ను తిన‌డం కూడా మంచిది కాదు.

ఆరెంజ్ పీల్ టీః
నారింజ పండు తొక్క జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అతిసారాన్ని నిరోధించడానికి ఇది చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. నారింజ పండు పీల్ ను తీసి చిన్న ముక్కలుగా చేసి, కుండలో వేడి చేస్తున్న నీటిలో ఈ ముక్కలను వేయాలి. అలా పైకి పొంగుతూ మరగకాచబడిన వేడి నీటిని, చల్లార్చాలి. ఇలా చేసిన త‌ర్వాత తయారైన పానీయాన్ని వ‌డ‌క‌ట్లి రోజూ తాగాలి. ఇందులో రుచి కోసం ఒక టీస్పూను తేనెను కలిపి తీసుకోవ‌చ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *