నెలసరి లేట్ గా వస్తున్నాయా..కారణాలు ఇవే కావొచ్చు..!

Reasons for Missed Periods

నెలసరి లేట్ గా వస్తున్నాయా..కారణాలు ఇవే కావొచ్చు..!

సాధారణంగా యుక్త వయస్సుకు వచ్చిన అమ్మాయిలను నుంచి ఈ విధమైన నెలసరి సమస్యలు చాలా మందిలో వేధిస్తుంటాయి.ఈ సమస్య రావడానికి కొన్ని హార్మోనుల అసమతుల్యత కాగా మరికొందరికి నెలసరి మిస్ అయితే గర్భం అయిన దాల్చడం కారణమవుతుంది. ముఖ్యంగా మహిళల్లో అధిక పని ఒత్తిడి, ఆందోళన కారణంగా నెలసరి లేటుగా రావడం జరుగుతుంది.మరి కొందరిలో వారి శరీర బరువు తక్కువగా ఉండడం వల్ల లేదా ఆహారంలో పోషకాహారాలు లోపం వల్ల కూడా ఈ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతుంటాయి.

అయితే ఈ విధమైనటువంటి సమస్య మహిళల్లో చాలా సర్వసాధారణం. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు కొన్ని ఆహార నియమాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే ముఖ్యంగా ఈ నెలసరి ఆలస్యంగా రావడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

1) ఒత్తిడి:

మహిళల్లో ముఖ్యంగా అధిక ఒత్తిడి తగ్గడం వల్ల నెలసరి సమస్యలు ఎదురవుతుంటాయి.కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలో లేదా ఉద్యోగరీత్యా పనులను సక్రమంగా నిర్వహించడంలో వారిపై అధిక ఒత్తిడి కలుగుతుంది. ఈ విధంగా మహిళల్లో అధిక ఒత్తిడి కలగడం వల్ల మన దినచర్యలను నిర్వర్తించే మెదడు భాగం పై ప్రభావం చూపుతుంది. మెదడులోని హైపోథాలమస్ అధిక ఒత్తిడి, అనారోగ్యం, ఆకస్మికంగా బరువు పెరగడం వంటివి తీవ్ర నష్టానికి దారి తీస్తాయి. ఈ క్రమంలోనే నెలసరి ఆలస్యంగా రావడానికి కారణం అవుతుంది.

ఈ క్రమంలోనే మన శరీరంపై ఏర్పడిన అధిక ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల ఈ సమస్య నుంచి తొందరగా విముక్తి పొందవచ్చు. ఒత్తిడినుంచి విముక్తి పొందాలంటే మనసుకు హాయి నిచ్చే పాటలు వినడం, మనసుకు నచ్చిన స్నేహితులతో మాట్లాడటం, శరీర వ్యాయామం, మనస్ఫూర్తిగా నిద్రపోవడం బంటి ఈ పద్ధతులను పాటించడం ద్వారా క్రమంగా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. ఈ విధంగా మన శరీరంలో నుంచి తొలగించుకున్న అప్పుడే మనకు నెలసరి సక్రమంగా వస్తాయి.

2) తక్కువ శరీర బరువును కలిగి ఉండటం:

ప్రస్తుత కాలంలో అమ్మాయిలు శరీరాకృతిని అందంగా ఉంచుకోవడం లో దాదాపు తినడం మానేస్తున్నారు. ఈ క్రమంలోనే వారిని అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. అందులో ఒకటిగా నెలసరి ఆలస్యంగా రావడం అని చెప్పవచ్చు. అనోరెక్సియా నెర్వోసా లేదా బులిమియా వంటి రుగ్మత ఉన్నవారిలో ఆహారం ఎక్కువగా తినాలనిపించదు. ఈ క్రమంలోనే శరీర బరువు తక్కువగా ఉండి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. మన సాధారణ ఎత్తు కంటే పది శాతం బరువు తక్కువగా ఉన్నా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే మహిళలు అనోరెక్సియా వ్యాధికి చికిత్స తీసుకున్నప్పుడే ఈ విధమైనటువంటి వ్యాధి నుంచి బయట పడవచ్చు. ఈ విధంగా శరీరానికి తగ్గ బరువు ఉన్నప్పుడు మాత్రమే నెలసరి సక్రమంగా రావడంతో పాటు ఎటువంటి సమస్యలను తలెత్తకుండా చేయగలదు. కనుక వీలైనంత వరకు తగినన్ని పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకొని శరీర బరువును పెంచుకోవాలని అప్పుడే ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

3) ఊబకాయం:
శరీర బరువు తక్కువగా ఉన్న మహిళల్లో నెలసరి సమస్యలు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే అధిక శరీర బరువు పెరిగినా కూడా ఈ విధమైనటువంటి సమస్య తలెత్తుతుంది. తనక ఎత్తుకు తగ్గ బరువు ఉన్నప్పుడు మాత్రమే మన శరీరంలో హార్మోన్ల పనితీరు సక్రమంగా ఉంటుంది. చాలామంది మహిళలలు ఊబకాయ సమస్యతో బాధపడుతుంటారు. ఈ విధంగా అధిక శరీర బరువు వారి నెలసరి పై ప్రభావం చూపుతుంది. స్థూలకాయం ఉండటం వల్ల నెలసరి సమస్య ఉన్న మహిళలలో  కొన్నిసార్లు స్త్రీకి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పిసిఒఎస్) వంటి వైద్య చికిత్సలు కూడా అవసరమవుతాయి. ఈ విధంగా నెలసరి సమస్యలు ఎదురైనప్పుడు ముందుగా వైద్యుని సంప్రదించి ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా అండాశయం పరిస్థితిని గుర్తించి తగిన చికిత్స తీసుకోవాలి. ఈ క్రమంలోనే ఆహార నియమాలను పాటిస్తూ సరైన వ్యాయామాలు చేస్తూ శరీర బరువును తగ్గించుకోవడం చేయాలి. ఈ విధమైన జాగ్రత్తలను పాటించినప్పుడు మాత్రమే ఈ నెలసరి సమస్య నుంచి బయట పడవచ్చు.

4) పెరి మోనోపాజ్:

సాధారణంగా మహిళలు నెలసరి 52 సంవత్సరాలకు ఆగిపోవడం జరుగుతుంది. మరికొందరిలో ముందుగానే ఋతుక్రమం ఆగిపోయే లక్షణాలను అనుభవిస్తారు. ఈ విధమైన లక్షణాలు అనే పేరు మోనోపాజ్ అని పిలుస్తారు. ఈ విధమైన లక్షణాలు మనలో ఉన్నాయంటే మన శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు హెచ్చుతగ్గులుగా ఉన్నట్టు పరిగణించాలి. ఈస్ట్రోజన్ హార్మోన్ల అసమతుల్యత కారణంగా మహిళల్లో నెలసరి సమస్యలు తలెత్తుతాయి.

5) జనన నియంత్రణ:
సాధారణంగా కొత్తగా పెళ్లైన మహిళలు ఇప్పుడే తమకు పిల్లలు వద్దని భావిస్తుంటారు. ఈ సమయంలోనే పిల్లలు కలగకుండా మాత్రలను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మాత్రలలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ లు కలిగి ఉంటాయి. ఈ హార్మోన్లు అండాశయంలో లో గుడ్డు ని విడుదల చేయకుండా అడ్డుపడతాయి.ఈ విధంగా మాత్రాన ఆపేసిన తర్వాత తిరిగి ఋతుచక్రం సరైన సమయంలో సరిగ్గా రావడానికి సుమారు ఆరు నెలల పాటు పడుతుంది. ఈ విధంగా జనన నియంత్రణ కోసం తీసుకున్న ఇంజెక్షన్లు, మాత్రలు కూడా నెలసరి సమస్యలకు దారి తీస్తాయి.

6) దీర్ఘకాలిక వ్యాధులు:
చాలా మంది మహిళలు చిన్న వయసులోనే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారు. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం, కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటారు. ఈ విధమైనటువంటి సమస్యలతో బాధపడే వారి శరీరంలో హార్మోన్ల మార్పులు జరుగుతాయి.ఏవిధమైన హార్మోనుల మార్పుల వల్ల చాలామందిలో నెలసరి సమస్యలు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే ఈ విధమైన దీర్ఘకాలిక పేదలకు మందులను ఉపయోగించటం వల్ల కూడా కొందరిలో ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి.

7) థైరాయిడ్ సమస్యలు:
సాధారణంగా థైరాయిడ్ కందుల ప్రతి ఒక్కరిలో ఎంతో కీలకమైనవి. అయితే మన శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత వల్ల థైరాయిడ్ గ్రంథిలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ విధంగా అధిక ఉత్తేజిత థైరాయిడ్ గ్రంథులు మన శరీరంలో నెలసరి సమస్యలు తలెత్తడానికి కారణమవుతాయి.ఈ విధమైన థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు సరైన చికిత్స తీసుకొని మందులను ఉపయోగించుట ద్వారా థైరాయిడ్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. థైరాయిడ్ సమస్య లేనివారిలో క్రమంగా నెలసరి సరైన సమయంలో వస్తుంది.

పై తెలిపిన సమస్యలలో ఒకే ఒక్క సమస్య తో మహిళలు బాధపడుతున్న వారిలో నెలసరి సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే ఈ సమస్యను అధిగమించడానికి సరైన పద్ధతులను పాటించినప్పటికీ నెలసరి ఆలస్యంగా వస్తుంటే ఒక సారి వైద్యున్ని సంప్రదించాలి. నెలసరి సమస్య ఆలస్యంగా రావడానికి గల కారణాలు తెలుసుకోవడానికి వివిధ రకాల రక్తపరీక్షలు నిర్వహించు కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నెలసరి ఆలస్యంగా వచ్చిన మహిళలు అనేక సమస్యలు ఎదురవుతుంటాయి.

ఆలస్యంగా నెలసరి వచ్చిన వారిలో అధిక రక్తస్రావం జరుగుతుంది. తీవ్రమైన నొప్పి, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. నెలసరి సమస్య ఆలస్యంగా వచ్చిన అధికంగా రక్తస్రావం 7 రోజుల కన్నా ఎక్కువగా జరిగితే వెంటనే వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఎంతో ఉత్తమం.ఈ విధమైనటువంటి సమస్య రాకుండా ఉండాలంటే ముఖ్యంగా అధికంగా విటమిన్లు పోషకాలు తో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ నెలసరి సమస్య నుంచి విముక్తి పొందవచ్చనీ నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *