పిల్ల‌ల‌కు సాధారణంగా వ‌చ్చే ఆరోగ్య స‌మ‌స్య‌లు- వాటి చికిత్స‌

Common Diseases in Kids

పిల్ల‌ల‌కు సాధారణంగా వ‌చ్చే ఆరోగ్య స‌మ‌స్య‌లు- వాటి చికిత్స‌

ప‌సి పిల్ల‌లు ఎక్కువ‌గా అనారోగ్యానికి గుర‌వుతుంటారు. ఒక స‌మ‌స్య తీరే లోపే మ‌రో స‌మ‌స్య వ‌స్తుంది. అందులో ఒక‌రోజు జ‌లుబు అయితే.. అది త‌గ్గేలోపే కడుపు నొప్పి రావొచ్చు. ఇలాంటి స‌మ‌స్య‌లు వర్ష కాలంలో ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. వ‌ర్ష‌కాలంలో జ్వరం వారి వెంట ప‌డుతుంది. దాన్ని త‌గ్గించేందుకు త‌ల్లిదండ్రులు హాస్పిటల్స్ చుట్టు తిర‌గాల్సి వ‌స్తుంది. అయితే ప్ర‌తి చిన్న స‌మ‌స్య‌కు డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్ల‌ల్సిన అవ‌స‌రం లేద‌ని ప‌లువురు చెబుతుంటారు. అందుకు కొన్ని చిట్కాలు తెలుసుకోవాలి. అవి మీ పిల్ల‌ల హెల్త్ కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వాటిల్లో కొన్ని మీ కోసం..

జలుబుః

సాధ‌ర‌ణ జ‌లుబు అవ్వ‌డంతో చిన్న పిల్ల‌ల్లో ముక్కు కారడం, తుమ్ములు, కొన్నిసార్లు దగ్గు వ‌స్తుంటాయి. ఇవి సాధారణంగా 2-3 రోజుల కంటే ఎక్కువ రోజులు వేధిస్తాయి. ముఖ్యంగా శీతాకాలం, వర్ష కాలంలో పిల్ల‌ల్లో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది.

జ‌లుబుకు చికిత్సః

ఈ సాధ‌ర‌ణ జ‌లుబు లేక‌పోతే దగ్గుకు సంబంధించిన వాటికోసం ఊరికే మందుల‌ను వాడొద్దు. పిల్ల‌లు నిద్ర‌పోతున్న స‌మ‌యంలో ఆ గదికి హ్యూమిడిఫైయర్ ని అమార్చాలి. పిల్ల‌లు రొమ్ము పాలు తాగడానికి నిరాకరిస్తే.. నీరు, పెడాలియేట్ వంటి ఎలెక్ట్రోలైట్ లాంటి వాటిని ఇవ్వాలి.

హాస్పిట‌ల్ కు ఎప్పుడు తీసుకుపోవాలిః

ప‌సిపిల్ల‌ల‌కు ఎక్కువ జ్వరం వ‌స్తే.. ఏ మాత్రం ఆలోచించ‌కుండా డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు తీసుకుపోవాలి.

జ్వరంః

పిల్ల‌ల‌ను ఎంతో నీర‌సంగా చేసేది జ్వ‌రం. దీంతో పిల్ల‌లు ఎంతో చిరాకు ప‌డ‌తారు. ఇది కొన్ని సార్లు జ‌లుబు లేకుంటే ఇన్పెక్ష‌న్ వ‌ల‌న వ‌స్తుంది. మ‌రికొన్ని సార్లు కొన్ని టీకాల‌కు పరిచర్యగా కూడా వ‌స్తుంది.

చికిత్సః

చాలా మంది త‌మ పిల్ల‌లు కొంచెం వేడిగా క‌నిపించినా డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు తీసుకుపోతుంటారు. కానీ 101 డిగ్రీల కంటే శ‌రీర వేడి ఉంటే ప్ర‌మాద‌మేమి ఉండ‌దు. అందుకు కొంచెం వేడిగా ఉంటే భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఈ స‌మ‌యంలో ఇంట్లోనే చికిత్స చేయొచ్చు. దానికి ముందు పిల్ల‌ల బ‌ట్ట‌ల‌ను తీసివేయాలి. ఆ త‌ర్వాత త‌డి గుడ్డ‌తో తుడ‌వాలి. ఆ త‌ర్వాత ఎక్కువ ద్ర‌వ ప‌దార్థాల‌ను ఇవ్వాలి.

హాస్పిట‌ల్ కు ఎప్పుడు తీసుకుపోవాలంటేః

పిల్ల‌ల‌కు జ్వరం వ‌చ్చి 3 రోజుల కంటే ఎక్కువ రోజులైనా.. శ‌రీర ఉష్ణోగ్ర‌త 102 డిగ్రీలు దాటినా ఏ మాత్రం ఆల‌స్యం చేయొద్దు. వెంటనే హాస్పిట‌ల్ కు తీసుకుపోవాలి.

చెవి నొప్పిః

పిల్ల‌లు త్వ‌ర‌గా చెవి నొప్పికి లోన‌వుతుంటారు. దీనికి కార‌ణం ఇన్ఫెక్షన్ కావొచ్చు. దీంతో పిల్ల‌ల‌కు చెవిలో చీము ప‌ట్టొచ్చు. అందువ‌ల్ల వారికి విప‌రీతంగా నొప్పి వేస్తుంది.

చెవి నొప్పికి చికిత్సః

కొన్ని ర‌కాల చెవి ఇన్ఫెక్షన్స్ వాతంటత అవే తగ్గుతాయి. కానీ హాస్పిట‌ల్ కు తీసుకుపోతే వైద్యుడు నొప్పి త‌గ్గ‌డానికి యాంటిబయోటిక్ ఇస్తారు. టైలెనోల్ అనే టాబ్లెట్ చెవి నొప్పితో బాధ ప‌డే పిల్లల‌కు ఉప‌యొగ‌క‌రంగా ప‌ని చేస్తుంది. ఈ టాబ్లెట్ వేడంతో పిల్ల‌లు సుఖంగా నిద్రపోతారు. కానీ పిల్ల‌ల‌కు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వేయొద్దు.

హాస్పిట‌ల్ కు ఎప్పుడు తీసుకుపోవాలంటేః

2-3 రోజుల కన్నా ఎక్కువగా మీ పిల్ల‌లు చెవి నొప్పితో బాధపడుతుంటే.. ఆల‌స్యం చేయ‌కుండా వైద్యున్ని సంప్ర‌దించాలి. అలాగే ఇన్ఫెక్షన్ అయినట్టు అనిపిస్తే కూడా ఆల‌స్యం చెయొద్దు. ఇన్ఫెక్షన్ ఎక్కువ అయితే కర్ణభేరికి గాయం జ‌రిగే ప్ర‌మాధం ఉంది. దాంతో వినికిడి శక్తి కోల్పోయే ప్ర‌మాధం లేక‌పోలేదు.

విరోచనాలుః

మీ పిల్ల‌ల‌కు తరచుగా డైపర్స్ మార్చాల్సి వ‌స్తే.. విరోచనాలు అయ్యే అవకాశం ఉంద‌ని గ్ర‌హించాలి. ఈ విరోచనాలకు వైరస్, బాక్టీరియ సంక్రమణ, అలెర్జీ కారణమని చెప్పొచ్చు. మ‌రికొన్ని సార్లు మందులు వేయడం వ‌ల్ల‌కూడా విరోచ‌నాలు అవుతాయి.

విరోచ‌నాల‌కు చికిత్సః

మీ పిల్ల‌ల‌కు విరోచ‌నాలు అయితే.. వాళ్లు డిహైడ్రాషన్ కు గుర‌వుతారు. ఇది ఎన్నో స‌మ‌స్య‌ల‌ను తీసుకువ‌స్తుంది. ఈ విరోచ‌న‌నాలు 5-10 రోజుల పాటు కొనసాగుతాయి. మీరు మీ పిల్ల‌ల‌కు ఈ స‌మ‌యంలో ఎక్కువ‌గా ద్ర‌వాల‌ను తాపాలి. ఒక వాంతి అయ్యిందంటే ఎలక్ట్రోలైట్ పానీయాన్ని చిన్న చిన్న మోతాదులో ఇస్తూ ఉండాలి.

హాస్పిట‌ల్ కు ఎప్పుడు తీసుకుపోవాలంటేః

మీ పిల్ల‌ల‌కు ఎక్కువ జ్వ‌రం వ‌స్తే.. అలాగే ఈ విరోచ‌నాల ల‌క్ష‌ణాలు ఎక్కువైతే.. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వైద్యున్ని సంప్ర‌దించాలి. అది చాలా ఉత్త‌మం.

ఫ్లూః

చిన్న పిల్ల‌ల‌కు జలుబు, ఫ్లూ వంటివి సాధార‌ణంగా క‌నిపించే స‌మ‌స్య‌లు. వీటి భారిన ప‌సి పిల్ల‌లు ప‌డితే.. చాల చికాకుగ ఉంటారు. దేనికైనా ఏడుస్తూ ఉంటారు. అలాగే ఈ ఫ్లూ సులువుగా ఒకరి నుంచి మ‌రొక‌రికి సోకుతుంది. అందుకే దీన్ని త‌గ్గించ‌డం చాలా క‌ష్టం.

చికిత్సః

పిల్ల‌ల‌కు వ‌చ్చే జ‌లుబుకు చికిత్స లేకుండాఆనే కొన్ని రోజుల్లో త‌గ్గుతుంది. కానీ ఆ కొన్ని రోజులు మీ పిల్ల‌లు ఎంతో ఇబ్బంది ప‌డ‌తారు. అలా కాకుండా ఉండాలంటే.. ఆవిరి ప‌ట్ట‌డం చాలా మంచిది. అయితే భవిష్యత్తులో అంటురోగాలను నివారించడానికి టీకాలు వేయించాలి.

హాస్పిట‌ల్ కు ఎప్పుడు తీసుకుపోవాలంటేః

మీ పిల్ల‌ల్లో ఈ ఫ్లూ ల‌క్ష‌ణాలు 5 రోజులలో త‌గ్గ‌క‌పోతే.. వెంట‌నే వైద్యున్ని సంప్రదించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *