మందారం(హైబిస్కస్) టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

benefits-of-hibiscus-tea

మందారం(హైబిస్కస్) టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

మందారం పువ్వు చూడటానికి ఎంతో అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. చూడటానికి మాత్రమే కాకుండా ఈ మందారం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉన్నాయి. మందార మొక్క నుంచి లభించేటటువంటి పువ్వులు, ఆకులు చర్మ సౌందర్యాన్ని, ఆరోగ్య ప్రయోజనాలను పెంపొందించుకోవడం కోసం ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా మందారం టీ ని త్రాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ మందారం టీ అనేది ఒక మూలికా టీ. ఈ మందారం టీ ను ఈ మొక్క భాగాలను నీటిలో ఉడికించి తయారు చేస్తారు.కొన్ని వాతావరణ పరిస్థితులను బట్టి వివిధ రకాల జాతులకు చెందిన మందార మొక్కలు పెరుగుతూ ఉంటాయి. క్రమంతప్పకుండా మందారం టీ త్రాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు పలు పరిశోధనలో వెల్లడించారు.

ఈ మందారం టీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన పానీయం అని చెప్పవచ్చు. మందారం టీ ఎరుపు రంగులో ఉండి పుల్లని రుచిని కలిగి ఉండటం వల్ల దీనిని “పుల్లని టీ” అని కూడా పిలుస్తారు. ఈ టీని వేడిగా లేదా చల్లగా తాగినా కూడా దీని రుచిని ఆస్వాదించవచ్చు. ఈ మందార టీ లో కేలరీలతో పాటు కెఫిన్ ఫ్రీ అని చెప్పవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ మందారం టీ ను త్రాగటం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

1) రక్తపోటును తగ్గిస్తుంది:

బోస్టన్ లో టఫ్ట్స్ విశ్వవిద్యాలయంలో జరిపిన పలు పరిశోధనల్లో భాగంగా ప్రతిరోజు ఒక కప్పు టీ తాగేవారిలో రక్తపోటు సమస్యతో బాధపడేవారికి పూర్తిస్థాయిలో రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుందని గుర్తించారు.రక్తపోటు సమస్యలు నివారించడమే కాకుండా గుండెకు సంబంధించిన వ్యాధులను దూరం చేయడంలో కూడా ఈ మందారం టీ ఎంతగానో ఉపయోగపడుతుందని బోస్టన్ శాస్త్రవేత్తలు తెలియజేశారు.

2) కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:

ప్రస్తుత కాలంలో ఎంతో మంది బాధ పడుతున్న సమస్యలలో అధిక బరువు సమస్య ఒకటి. ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల అమాంతం శరీర బరువు పెరిగి శరీరంలో అధిక శాతం కొవ్వు పేరుకుపోయి స్థూలకాయంతో బాధపడుతున్నారు. దీని ద్వారా అనేక అనారోగ్య సమస్యలు రావడానికి కారణం అవుతుంది కనుక,మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడానికి మందారం టీ ఎంతగానో ఉపయోగ పడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. మందారం టీలో అధిక భాగం యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వల్ల ఇది గుండె వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతూ, రక్తనాళాలలో జరిగే నష్టాన్ని కూడా నివారిస్తుంది. అదేవిధంగా మన శరీరంలో పేరుకుపోయినటువంటి ఎల్.డి.ఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తక్కువగా ఉంచడానికి మందారం టీ దోహదపడుతుంది.

3) మధుమేహాన్ని తగ్గిస్తుంది:

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరో ఒకరు ఈ వ్యాధితో సతమతమవుతున్నారు. మధుమేహంతో బాధపడే వారు క్రమంతప్పకుండా మందారం టీ తాగటం వల్ల ఇందులో ఉన్నటువంటి హైపోలిపిదేమిక్ మరియు హైపోగ్లైసీమిక్ లక్షణాలు మధుమేహం వంటి వ్యాధితో బాధపడేవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పలు అధ్యయనాల్లో రుజువైంది.టైప్ II డయాబెటిస్ రోగులలో నిర్వహించిన ఒక పరిశోధనలో భాగంగా మందారపు పుల్లని టీ వినియోగం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఊహించలేని వ్యాధులను నిరోధించడానికి ఈ మందారం ఎంతగానో ఉపయోగపడిందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.

4) కాలేయాన్ని కాపాడుతుంది:
కాలేయ వ్యాధుల సమస్యలతో బాధపడేవారికి మందారం టీ ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఈ మందారం టీ లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కాలేయ వ్యాధి చికిత్సలో ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని కణాలు, కణజాలాలలో పేరుకుపోయిన ఫ్రీరాడికల్స్ ను తొలగించడానికి దోహదపడతాయి.దీని ద్వారా మన శరీరంలో వివిధ అవయవ వ్యవస్థలు సరైన పనితీరును కనబరుస్తాయి.

5) క్యాన్సర్ ను నివారిస్తుంది:
మందారం టీ లో అధిక భాగం యాంటీ కణితి, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన హైబిస్కస్ ప్రోతోకాతెచుక్ ఆమ్లం ఉంటుంది. పలు పరిశోధనల్లో భాగంగా మందారం టీ లో ఉన్నటువంటి ఈ లక్షణాలన్నీ హైబిస్కస్ కణ మరణాన్ని ప్రేరేపించడం ద్వారా క్యాన్సర్ కణాల వృద్ధిని తగ్గిస్తుందని సూచించారు. దీనినే ప్రోగ్రాం సెల్ మరణం అని కూడా పిలుస్తారు. కనుక ప్రతి రోజు మందారం టీ తాగటం వల్ల క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు.

6) రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

మందారం టీ లో అధిక మొత్తంలో ఆస్కార్బిక్ ఆమ్లం, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఈ రెండు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదపడతాయి. అదేవిధంగా దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల హానికర బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించి అంటువ్యాధులు అయిన జలుబు, దగ్గు వంటి ఫ్లూలను తొందరగా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మందారం టీను ఒక శీతలీకరణ ప్రభావం కలిగి ఉండటం వల్ల జ్వరం వల్ల వచ్చే అసౌకర్యానికి మంచి చికిత్సగా మందారం టీ ఉపయోగపడుతుంది.

7) నెలసరి నొప్పిని నివారిస్తుంది:

క్రమంతప్పకుండా మందారం టీ తాగడం వల్ల నెలసరి సమయంలో వచ్చేటటువంటి నొప్పి, తిమ్మిరి వంటి సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం కలిగిస్తుంది. అదేవిధంగా హార్మోన్ల సమతుల్యతకు దోహదపడుతుంది. మందారం టీ లో అధిక భాగం విటమిన్స్, ఫ్లవనోయిడ్స్ యాంటిడిప్రెసెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది.

8) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
చాలామంది జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు క్రమం తప్పకుండా మందారం టీని తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరచడానికి దోహదపడుతుంది. మలబద్దక సమస్యతో బాధపడేవారికి మందారం టీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

9) బరువును తగ్గిస్తుంది:
అధిక బరువు సమస్యతో బాధపడేవారికి మందారం టీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. క్రమం తప్పకుండ మందారం టీ త్రాగటం వల్ల ఏమేలేస్ యొక్క ఉత్పత్తిని తగ్గించి కార్బోహైడ్రేట్లను మరియు స్టార్చ్ శోషణకు సహాయపడుతుంది. కనుక మందార టీ త్రాగటం వల్ల శోషణ జరగకుండా నిరోధిస్తుంది. అందువలన, మందార టీ అధిక శరీర బరువును నియంత్రించడంలో దోహదపడుతుంది.

మందారం టీ వల్ల కలిగే దుష్ప్రభావాలు:

మందారం టీను క్రమం తప్పకుండా త్రాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయనే విషయం మనం తెలుసుకున్నాం. అయితే ఈ టీ ను అధిక భాగంలో తీసుకోవడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు కూడా కలుపుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అధికభాగం ఈ టీ సేవించడం వల్ల కాలేయం పై ప్రభావం చూపుతుంది. ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మందులు ఉపయోగించేవారు తప్పకుండా వైద్యులను సంప్రదించిన తరువాతనే ఈ టీ సేవించాలి. రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలకు మందులు వాడుతూ మందారం టీ తాగటం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు రక్తపోటు చాలా తక్కువ స్థాయికి చేరుకోవడం వల్ల ప్రమాదాలు తలెత్తుతాయి. ముఖ్యంగా గర్భం దాల్చిన మహిళలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు ఇలాంటి పరిస్థితుల్లో కూడా మందారం టీ త్రాగ కూడదని నిపుణులు తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *