అరటి పండు తొక్కల ద్వారా కలిగే ప్రయోజనాలివే..!

benefits-of-banana-peels

అరటి పండు తొక్కల ద్వారా కలిగే ప్రయోజనాలివే..!

అరటి పండ్లు సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో దొరికే పండుగా చెప్పవచ్చు. అరటి పండ్లు తినడానికి ఎంతో రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అరటి పండులో ఎక్కువ భాగం ఫైబర్, పొటాషియం వంటి పోషకాలతో పాటు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇకపోతే అరటి పండ్లను ఎక్కువగా వివిధ పూజా కార్యక్రమాలలో కూడా ఉపయోగిస్తారు. అరటిపండు తినేటప్పుడు ప్రతి ఒక్కరు అరటిపండు పై ఉన్న తొక్కను తీసి పండును మాత్రమే తింటాము. కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే అరటిపండు లో ఉన్న పోషకాలు కన్నా అరటిపండు పై ఉన్న తొక్కలో అధికభాగం పోషకాలు కలిగి ఉంటాయి. అరటి పండు తో పాటు తొక్కను తినడానికి చాలా మంది మొహమాట పడటం వల్ల ఎన్నో పోషక విలువలను మనం కోల్పోతున్నామని చెప్పవచ్చు. అరటి పండ్లను తినడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అదేవిధంగా అరటి పండు తొక్క ను ఉపయోగించి వివిధ రకాల ప్రయోజనాలను పొందవచ్చు. అరటి పండు తొక్కలు మనకు ఏ ఈ విధమైన ప్రయోజనాలను కలిగిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం…

1) చర్మ సంరక్షణ కోసం:

మన చర్మం ఎల్లప్పుడు కాంతివంతంగా మెరుస్తూ ఉండాలంటే అరటిపండు తొక్కలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అరటిపండు తొక్కలను తీసుకొని మన మొహం పై బాగా మసాజ్ చేయడం ద్వారా ముఖం పై ఏర్పడిన దుమ్ము ధూళి కణాలు, తొలగిపోవడమే కాకుండా చర్మాన్ని ఎంతో కాంతివంతంగా తయారుచేస్తాయి.అదే విధంగా చర్మం పై ఏర్పడిన మచ్చలను, ముడతలను కూడా తగ్గించి యవ్వనంగా కనబడేలా విధంగా చేస్తాయి.

మన చర్మం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు ఈ అరటి తొక్కలతో బాగా మసాజ్ చేయడం ద్వారా చర్మం తిరిగి హైడ్రేట్ అవుతుంది. ఇది చర్మానికి మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. అదేవిధంగా సోరియాసిస్ సమస్యతో బాధపడేవారు ఈ అరటి తొక్కతో బాగా మసాజ్ చేయటం ద్వారా సొరియాసిస్ నుంచి విముక్తి పొందవచ్చు. ఈ విధంగా అరటి తొక్కను ఉపయోగించడం వల్ల కాంతివంతమైన చర్మాన్ని పొందడానికి కాకుండా, చర్మాన్ని సంరక్షిస్తుంది.

2) తలనొప్పి నుంచి ఉపశమనం:

చాలామంది అధికమైన తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. అయితే అధిక తలనొప్పి నుంచి ఉపశమనం కల్పించడానికి అరటి తొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి. అరటిపండు తొక్కలని ఒక అరగంట పాటు డి ఫ్రిజ్లో ఉంచి తరువాత వాటిని తలపై వేసుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటే తల నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

3) జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది:

వాతావరణ కాలుష్యం వల్ల, వివిధ రకాల హెయిర్ షాంపూ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం వల్ల ఎక్కువ మందిలో అధికంగా రాలిపోతూ ఉంటుంది. మరికొందరు చుండ్రు సమస్యతో బాధపడుతుంటారు. ఈ విధమైన సమస్యతో బాధపడేవారు తల మాడుకు బాగా రుద్దిఅరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయడం వల్ల ఈ సమస్య తగ్గిపోవడమే కాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. అరటి తొక్కలో అధిక భాగం యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మన తలలో బ్యాక్టీరియా ద్వారా వ్యాపించిన చుండ్రును తొలగించడమే కాకుండా ఫ్రీ రాడికల్స్ ను కూడా తొలగించడంలో ఈ అరటి తొక్కలు కీలక పాత్ర పోషిస్తాయి.

4 దంతాలకు మెరుపునిస్తుంది:

చాలామంది రోజుకు రెండు సార్లు బ్రష్ చేస్తున్నప్పటికీ కొందరిలో పళ్ళు పసుపు పచ్చ రంగులో ఉంటాయి. ఈ విధమైన పళ్ళు ఉన్నవారు నలుగురిలో మాట్లాడటానికి ఎంతో ఇబ్బంది పడుతుంటారు.ఈ సమస్యతో బాధపడే వారు  వారంలో కనీసం రెండు సార్లు తాజా అరటిపండు తొక్కతో పళ్ళ పై రుద్దటం వల్ల దంతాలు పసుపుపచ్చని తొలగించుకొని తెల్లగా మెరుస్థాయి.

5) దోమకాటు దురదను తగ్గిస్తుంది:

చాలా మందిలో దోమలు ఇతర కీటకాలు కుట్టినప్పుడు చర్మంపై దద్దుర్లు ఏర్పడి చాలా దురదగా అనిపిస్తుంది. ఆ విధంగా దోమలు కుట్టిన చోట అరటిపండు తొక్కతో రుద్దటం వల్ల దురద తగ్గిపోతుంది.

6) షూ పాలిష్:
అరటి తొక్కల ను ఉపయోగించి బూట్లు, లెదర్ బ్యాగులు, వెండి వస్తువులను శుభ్రం చేయవచ్చు. అరటి తొక్కలతో వీటిని శుభ్రం చేయటం ద్వారా ఎంతో మెరుగ్గా కనిపిస్తాయి.

7) u.v ప్రొటెక్షన్:
సూర్యుడి నుంచి వెలువడే అతి నీల లోహిత కిరణాల నుంచి మన కళ్ళను రక్షించుకోవడానికి అరటి తొక్కలు కీలకపాత్ర పోషిస్తాయి. కళ్ళు మంటగా ఉన్నప్పుడు ఈ అరటి తొక్కలను కాసేపు సూరి కిరణాలు పడేటట్టు నుంచి కళ్ళపై వేసుకోవటం వల్ల కళ్ళకు రక్షణగా ఉంటాయి.

8) చమురు నియంత్రణ:
చాలామంది చర్మం పై జిడ్డు ఏర్పడటంవల్ల ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. అలాంటి వారికి అరటి మంచి ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మం ఉపరితలం పై ఉన్న అదనపు సెబమ్‌ను మందగించడానికి సహాయపడుతుంది. దీనిలో పొటాషియం, నీటిశాతం అధికంగా ఉండటం వల్ల పొడి చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా తయారు చేస్తుంది.

9) జుట్టును మృదువుగా తయారు చేస్తుంది:
అరటిలో ఎక్కువ భాగం సిలికా కంటెంట్ ఉండటం వల్ల జుట్టు మృదువుగా తయారవడానికి సహాయపడుతుంది.కొల్లాజెన్ ప్రోటీన్‌ను ఉత్పత్తి చేయడానికి సిలికా మన శరీరం ద్వారా గ్రహించబడుతుంది.

అరటి తొక్కల వల్ల ఇతర ప్రయోజనాలు:
అరటి పండులో మాదిరిగానే అరటి తొక్కలో కూడా ఎన్నో పోషక పదార్థాలు దాగి ఉన్నాయి.ఇందులో విటమిన్లు, పొటాషియం, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి. పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు సమస్యను తగ్గించడంతోపాటు గుండె సమస్యలు రాకుండా నివారిస్తుంది. అరటి పళ్ళ తొక్కలను ప్రథమ చికిత్సలో భాగంగా ఉపయోగిస్తారు. ఏదైనా ముళ్ళు తొక్కినప్పుడు ఆ ప్రదేశంపై అరటి పళ్ళ తొక్కను ఉంచినప్పుడు ముళ్ళు తొందరగా బయటకు వస్తుంది. అదేవిధంగా అరటి తొక్కలను సేంద్రియ ఎరువుల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు.

అరటి తొక్కలను ప్రయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

*అరటి తొక్కల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని మనం తెలుసుకున్నాం.కానీ ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉన్న అరటి తొక్కలను ఉపయోగించకూడదు. తాజా అరటిపండు తొక్కలని ఉపయోగించినప్పుడు మాత్రమే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.

*అదేవిధంగా అరటి తొక్కను ఒలిచిన కొంత సమయం తర్వాత అరటి పండ్లు తినకూడదు. వెంటనే అరటి పండుతో పాటు తొక్కని కూడా తిన్నప్పుడు మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

*అరటి పండ్లు ఎప్పుడూ కూడా సూర్యరశ్మి తగిలే విధంగా పెట్టకూడదు. వీటిని ఎల్లప్పుడు చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి.

*అరటిపండు తొక్కలని ఎప్పుడూ కూడా రిఫ్రిజరేటర్ లో భద్రపరచుకోకూడదు. అదే విధంగా వీటిని విచక్షణరహితంగా ఎక్కడ పడితే అక్కడ పడేయడం మానుకోవాలి.

అరటిపండును తిని తొక్కను తినకుండా పడేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, చర్మ సౌందర్య ప్రయోజనాలను కూడా కోల్పోవటం జరుగుతుంది. కనుక వీలైనంతవరకు అరటి పండుతో పాటు అరటి తొక్కలను తినటం వల్ల ఈ అద్భుతమైన ప్రయోజనాలను మనం పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *