అపెండిసైటిస్ గురించి తెలుసుకోవ‌ల‌సిన‌ విష‌యాలు!

what to know about appendicitis

 

అపెండిసైటిస్ గురించి తెలుసుకోవ‌ల‌సిన‌ విష‌యాలు!

మ‌న‌కు కొన్ని ర‌కాల ల‌క్ష‌ణాలు రాగానే నిర్ల‌క్ష్యం చేయొద్దు. అవి మ‌న‌కు ఎంతో హాని చేసే రోగాలు అయ్యి ఉంటాయి. అలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించాలి. అయితే మీ క‌డుపులో ముఖ్యంగా నాభి ఉండే ప్రాంతంలో ఎప్పుడైనా తీవ్రమైన నొప్పి ఉన్న‌ట్లు అనిపించిందా..? లేక‌పోతే ఎప్పుడూ వికారంతో కూడిన అనుభూతికి లోన‌వుతున్నారా..? అలాగే వాంతులతో ఇబ్బందులు ప‌డుతున్నారా..? వీటి వ‌ల‌న ఆకలిని కోల్పోతూన్నారా.. వీట‌న్నింటికి స‌మాధానం అవున‌నే అంటే వెంట‌నే మీరు వైద్యున్ని సంప్ర‌దించ‌డం చాలా ఉత్త‌మం. ఎందుకంటే ఇది అపెండిసైటిస్ అయ్యే అవకాశం ఉంది.

ఈ మ‌ధ్య కాలంలో యువతలో ఈ స‌మ‌స్య త‌ర‌చుగా క‌నిపిస్తుంది. దీంతో తీవ్రమైన నొప్పి వ‌స్తుంది. ఇది మ‌న‌ ఆరోగ్యం మీద పెనుప్రభావాన్ని చూపుతుంది. దీన్ని త్వ‌ర‌గా గుర్తించ‌క‌పోతే.. ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి.

అపెండిసైటిస్ అంటేః

అపెండిక్స్ లేక‌పోతే ఉండుకంగా పిలిచేదానికి వాపు వ‌స్తే.. దాన్ని అపెండిసైటిస్ అని పిలుస్తారు. ఇది చిన్న వేలు సైజులో పౌచ్ వలె ఉంటుంది. ఇది పెద్దపేగుకు అనుసంధానంగా ఉంటుంది. ఎప్పుడైతే మ‌న శరీరంలోని వ్యర్ధాల కారణంగా ఉండుకానికి ఇబ్బంది క‌లుగుతుందో.. అప్పుడు క్రమంగా ఉండ‌కం వాస్తుంది. అలా మొదలై ఎర్రబారడం జ‌రుగుతుంది. అలాగే సరైన రక్తసరఫరా లేక చీలిక ఏర్ప‌డుతుంది. దాంతో అపెండిసైటిస్ సమస్య వ‌స్తుంది.

ఈ అపెండిసైటిస్ లో ప్రధానంగా ఉండే స‌మ‌స్య‌లు ఉండుకం చీముతో నిండిపోవడం, దాని నుంచి చీము కారడం లాంటి సమస్యలు ఉంటాయి. దీనికి స‌ర్జ‌రీ అవసరం. ప్రతీ 10 మందిలో ఒకరు ఏదో ఒక స‌మ‌యంలో ఈ స‌మ‌స్య‌కు గుర‌య్యే అవ‌కాశాలు చాలా ఉన్నాయి. అయితే ఈ అపెండిసైటిస్ సమస్యకు వయసుతో సంబంధం ఉండ‌దు. ఇది ఏ వయసులోనైనా వ‌చ్చే అవ‌కాశం ఉంది. సాధార‌ణంగా 10-30 ఏళ్ల వారిలో ఎక్కువ‌గా వ‌స్తుంది.

దీనికి కార‌ణాలుః

అపెండిసైటిస్ సోక‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రికి తెలియ‌వు. కానీ మలద్వార సంబంధిత అవశేషాల నుంచి వ‌చ్చే బాక్టీరియా వలన వ‌స్తుంద‌ని మాత్రం చెప్ప‌వ‌చ్చు. బాక్టీరియా, ఫంగస్, వైరస్ వ‌ల‌న‌ ఉండుకం కణజాల వాపుకు కార‌ణం అవుతుంది. అందుకే ఆహారవిషయంలో జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తారు.

దీని లక్షణాలుః

ఈ అపెండిసైటిస్ లక్షణాలు మొత్తంగా బయటపడడానికి 4 నుంచి 48 గంటల సమయం ప‌ట్టే అవ‌కాశం ఉంది. కానీ నాభి లేదా ఎగువ ఉదరభాగంలో ఎక్కువ‌గా నొప్పి ఉంటుంది. ఈ నొప్పి నెమ్మదిగా దిగువ పొట్ట భాగానికి జారుతుంది. దీనికి ఇత‌ర ల‌క్ష‌ణాలు కూడా ఉంటాయి. వాటిల్లో వాంతులు కావ‌డం, ఆకలి లేకపోవడం, కొంచెం జ్వరం ఉండి నిమ్మ‌దిగా పెర‌గ‌డం, మలబద్ధకంగా ఉండ‌టం. ఈ ల‌క్ష‌ణాలు అంద‌రిలో ఒకేలా ఉండ‌క‌పోవ‌చ్చు.

మీకు క‌నుక జ్వరం లేకుంటే వాంతులతో కూడుకుని కడుపులో తీవ్రమైన నొప్పి ఉంటే ఆల‌స్యం చేయ‌కుండా హాస్పిట‌ల్ కు పోవ‌డం ఎంతో ముఖ్య‌మైన విష‌యం. ఈ లక్షణాలు నాలుగుగంటల కన్నా ఎక్కువసేపు ఉంటే వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.

ఎలా నిర్ధారించుకోవాలిః

అపెండిసైటిస్ వ్యాధి నిర్ధారణ కొత్త‌గా ఉంటుంది.దీని లక్షణాలు ఇతర పొట్ట సమస్యలాగే క‌పిపిస్తాయి. అందులో ముఖ్యంగా మలబద్దకం, గ్యాస్ట్రోఎంటెరిటీస్, మూత్ర సంక్రమణ వ్యాధిలా కనిపిస్తాయి.ఈ అపెండిసైటిస్ ను నిర్ధారించ‌డ‌డానికి వైద్యుల‌కు మీ ల‌క్ష‌ణాల‌ను చెప్పాలి. దాంతో వారి ప‌రీక్షిస్తారు. అవ‌స‌ర‌మైతే ప‌లు ప‌రీక్ష‌లు చేస్తారు. ఈ ప‌రీక్ష‌ల్లో ఇమేజింగ్ పరీక్షలు ముఖ్య‌మైన‌వి. దీంతో మీ పొట్ట భాగాన్ని ఎక్స్- రే లేక‌పోతే ఒక కంప్యూటర్ టొమోగ్రఫీ(సి.టి) స్కాన్ తీస్తారు.

అపెండిసైటిస్ రోగ నిర్ధారణలో ఖచ్చిత‌త్వం రాక‌పోతే.. డాక్ట‌ర్ మీ ల‌క్ష‌ణాల‌ను అంచ‌నా వేయ‌డానికి 24గంటల వరకు ఆగాల‌సి సూచిస్తాడు. అందులో మీకు వ‌స్తున్న నొప్పిని కూడా లెక్క‌లోకి తీసుకుంటాడు.

ఈ అపెండిసైటిస్ సమస్య ఉంటే దీనికి శస్త్రచికిత్స చేసి దీన్ని తీసివేస్తారు. ఇదే ఉత్త‌మ‌మైన మార్గం. ఎందుకంటే, ప్రభావం అధికంగా లేకపోయినా దీంతో భవిష్యత్ లో ప‌లు సమస్యలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అందుకే దీన్ని పూర్తిగా తీసి వేయ‌డం ఎంతో ఉత్త‌మం. ఇలా తీసివేయ‌డం వ‌ల‌న మ‌ళ్లీ ఈ స‌మ‌స్య‌లు పునరావృతం కావు. ఇది మ‌న శ‌రీరంలో అవ‌స‌రం లేని భాగం కూడా.

అయితే ఈ అపెండిసైటిస్ రాకుండా చేయడం కుద‌ర‌ని ప‌ని. దీనికి ఎన్నో కార‌ణాలు ఉంటాయి. కానీ మ‌నం తీసుకునే ఆహారంలో ఎక్కువ‌గా ఫైబ‌ర్ ఉండాలి. అలా ఉంటే స‌మ‌స్య క‌లిగే ప్ర‌మాధం త‌క్కువ‌గా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *