నోటిపూతను నివారించే అద్భుతమైన మార్గాలు!

amazing-ways-to-prevent-mouth-ulcers

నోటిపూతను నివారించే అద్భుతమైన మార్గాలు!

సాధారణంగా మనలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్యలలో నోటిపూత సమస్య ఒకటి. నోటి పూత ఏర్పడటం వల్ల కలిగే బాధ వర్ణనాతీతం. సాధారణంగా నోటిపూత పెదవులపై, నోటి లోపల బుగ్గలకు, నాలుక భాగానికి, తరచూ చిన్నపాటి గాయాలుగా లేదా పుండు మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి.

ఇవి తీవ్రమైన మంటను నొప్పిని కలిగించినప్పటికీ వీటి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. సాధారణంగా నోటిపూత అనేది మలబద్ధక సమస్య ఏర్పడినప్పుడు, హార్మోన్ల అసమతుల్యత, విటమిన్ బి, సి, ఐరన్ లోపం ఏర్పడినపుడు ఈ విధంగా నోటి లోపల పూత ఏర్పడుతుంది. నోటి పూత అనేది ఎక్కువగా పురుషులతో పోలిస్తే కౌమారదశలో ఉన్న ఆడపిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది.

నోటి పూత ఏర్పడటంవల్ల ఆహారం తీసుకోవడానికి కూడా ఎంతో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఈ నొప్పి భరించలేనిదిగా అయినప్పటికీ ప్రమాదకారి మాత్రం కాదు. మలబద్ధకం విటమిన్ల లోపం వల్ల మన శరీరంలో అధిక వేడి ఉండటం ద్వారా ఈ విధమైనటువంటి నోటి పూత ఏర్పడుతుంది.ఈ నోటిపూతకు మార్కెట్లో మందులు దొరికినప్పటికీ ఇంటి నివారణ పద్ధతులను ఉపయోగించి ఎంతో సులభంగా, తొందరగా ఈ నోటి పూత సమస్యను నుంచి బయటపడవచ్చు. నోటి పూత సమస్యను నివారించడానికి గల మార్గాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

1) తేనె:

తేనెలో ఎన్నో పోషక విలువలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. ఎన్నో ప్రయోజనాలు కలిగిన తేనే నోటి పూత నివారణను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. నోటి పూత సమస్యతో బాధపడే టప్పుడు కొద్దిగా తేనెను తీసుకొని నోటిపూత పై వేయాలి. ఈ విధంగా తేనె పూసినప్పుడు మన నోటిలో లాలాజలం ఉత్పత్తి కావడం వల్ల తేనెను మనం తినవచ్చు.

తేనెలో అధికభాగం యాంటి మైక్రోబియల్ లక్షణాలు ఉండటం వల్ల ఇది తెరిచి ఉన్న గాయాన్ని తొందరగా మానిపించడానికి సహాయపడుతుంది. తేనె కేవలం నోటిపూతను తగ్గించడం మాత్రమే కాకుండా నోటి పూత ఏర్పడిన ప్రాంతం నుంచి ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది.

2) బేకింగ్ సోడా పేస్ట్:

నోటి పూత సమస్యను నుంచి తొందరగా ఉపశమనం పొందడానికి బేకింగ్ సోడా పేస్ట్ ఎంతో ప్రయోజనకరం అని చెప్పవచ్చు.ముందుగా బేకింగ్ సోడాను ఎంత పరిమాణంలో తీసుకుంటామో నీటిని కూడా అంతే పరిమాణంలో తీసుకుని మిశ్రమంలా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని మనకు నోటి పూత ఎక్కడైతే ఏర్పడిందో ఆ ప్రాంతంలో వేయాలి. అయితే ఈ మిశ్రమం బాగా ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేయాలి.

ఈ విధంగా బేకింగ్ సోడా మిశ్రమంతో రోజుకు మూడు సార్లు చేయడం వల్ల నోటి పూత సమస్యను నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. సాధారణంగా బేకింగ్ సోడా సోడియం బైకార్బొనేట్ సమ్మేళనం. దీని గుణం నొప్పిని నివారించడమే. నోటి పూత నుంచి ఏర్పడిన ఆమ్లత్వాన్ని తటస్థం చేయడంలో బేకింగ్ సోడా కీలక పాత్ర పోషిస్తుంది.

3) కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెను మనం వివిధ రకాల ప్రయోజనాలకు విరివిగా ఉపయోగిస్తుంటారు. కొబ్బరి నూనెలో తేనె మాదిరి యాంటి మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.కనక నోటిపూత పై కొద్దిగా కొబ్బరి నూనె రెండు చుక్కలు వేయడం వల్ల నోటి పూత సమస్యను కలిగించడమే కాకుండా నొప్పిని నివారిస్తుంది.ప్రతిరోజు రాత్రి నిద్ర పోయేటప్పుడు నోటిపూత పై రెండు చుక్కలు కొబ్బరి నూనె వేసుకోవడం వల్ల కొబ్బరి నూనెలో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లను తగ్గించి ఈ సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది.

4)ఉప్పు నీరు:
నోటి పూత సమస్యతో బాధపడే వారు నొప్పి నుంచి విముక్తి పొందటానికి ఉప్పు నీరు ఎంతగానో దోహదపడతాయి. కొద్దిగా ఉప్పు నీరుని తీసుకొని నోట్లో బాగా పుక్కలించి పడేయాలి ఈ విధంగా ప్రతి రోజుకు రెండు మూడు సార్లు చేయడం ద్వారా నోటిలో ఏర్పడిన పుండు నుంచి ఉపశమనం పొందడమే కాకుండా, నొప్పిని కూడా నివారిస్తుంది.

5) ఆరెంజ్ జ్యూస్:
నోటి పూత సమస్యను నుంచి విముక్తి పొందడానికి ఆరెంజ్ జ్యూస్ కీలకపాత్ర పోషిస్తుంది. సిట్రస్ జాతికి చెందిన ఈ పండులో ఎక్కువభాగం విటమిన్ సి లభిస్తుంది.నోటి పుండు విటమిన్ సి లోపం వల్ల ఏర్పడుతుంది కనుక ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన విటమిన్ సి పుష్కలంగా లభించడంతో నోటి పూత సమస్యను నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. నోటి పూత సమస్య ఏర్పడినప్పుడు ఆరెంజ్ ను తీసుకోవడం వల్ల కొద్దిగా మంట అనిపిస్తుంది.

కనుక జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.ప్రతిరోజు రెండు గ్లాసుల ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల నొప్పి తగ్గడమే కాకుండా ఈ సమస్య నుంచి తొందరగా విముక్తి పొందవచ్చు. విటమిన్ సి మన శరీరానికి అందటం వల్ల నోటి పూత సమస్య తగ్గడం మాత్రమే కాకుండా, మన శరీరానికి కావలసినంత రోగ నిరోధక శక్తిని కూడా అందిస్తుంది.

6) లవంగం నూనె:
మన భారతదేశ వంటలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో లవంగాలు ఒకటి. లవంగాలు వంటకు రుచి మాత్రమే కాకుండా మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అదేవిధంగా లవంగాల నుంచి మనకు నూనెను కూడా తీస్తారు. లవంగం నూనె ఎన్నో ఆరోగ్యమైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది. లవంగం నూనెలో ఎక్కువ భాగం యూజినాల్ మరియు యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. నోటి పూత సమస్యతో బాధపడేవారికి లవంగ నూనె ఒక చక్కటి నివారణ మార్గం అని చెప్పవచ్చు.

కొద్దిగా దూదితో లవంగం నూనెను తీసుకొని నోటిలో ఏర్పడిన పూత పై ఆ దూదిని ఉంచాలి. లవంగ నూనెను ఆ కణజాలం మొత్తం గ్రహించి అక్కడ ఏర్పడిన బ్యాక్టీరియాను నివారిస్తుంది. తద్వారా నోటి పూత సమస్యను నుంచి ఏర్పడే నొప్పిని తగ్గించడమే కాకుండా నోటి పూత సమస్యను నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ నూనెను మనం అప్లై చేసుకోవడానికి ముందు మన నోటిని గోరు వెచ్చని వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి.

7) పసుపు:
పసుపు మన భారతీయ వంటలలో ఉపయోగించే సాంప్రదాయమైన పదార్థం. పసుపు వంట గురించి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.పసుపులో ఎక్కువభాగం యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి.బ్యాక్టీరియా వైరస్ నుంచి ఏర్పడే అంటు వ్యాధులని ఎదుర్కోవడంలో పసుపు కీలకపాత్ర వహిస్తుంది.

ఈ క్రమంలోనే నోటి పూత సమస్యను ఎదుర్కోవడంలో కూడా పసుపు దోహదపడుతుంది. కొద్దిగా పసుపు తీసుకొని రెండు చుక్కలు నీటిని కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నోటిపూత పై అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ మిశ్రమం మొత్తం ఆరిపోయిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజూ రెండు సార్లు చేయటం ద్వారా నోటి పూత సమస్య తగ్గడమే కాకుండా వెంటనే నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది.

నోటి పూత సమస్యకు మందులు, మాత్రలు వాడకుండా ఈ విధంగా మన ఇంట్లో దొరికే సహజ నివారణ పద్ధతులను ఉపయోగించి నోటి పూత సమస్యను నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *