రోజ్ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో!

advantages-of-drinking-rose-tea

రోజ్ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో!

గులాబీ రేకులతో తయారు చేసినటువంటి టీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ గులాబీ రేకులను గత కొన్ని సంవత్సరాల నుంచి వివిధ రకాల ఉత్పత్తులలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ గులాబి కుటుంబంలో దాదాపు 130 జాతులు సాగులో ఉన్నాయి. అయితే ఈ 130 జాతులు కూడా మన ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ గులాబీ రెక్కలు లేదా గులాబీ పువ్వు మొగ్గ నుంచి తయారైన సుగంధ పానీయమే రోజ్ టీ.

గులాబీ రెక్కలలో ఎన్నో రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు,యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల ఇది మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కల్పిస్తాయి. గులాబీ రెక్కల నుంచి తయారైన టీ మాత్రమే కాకుండా రోజ్ వాటర్ కూడా ఎన్నో సౌందర్య ప్రయోజనాలను కల్పిస్తుంది. ఈ గులాబీ ఉత్పత్తులను గత కొన్ని సంవత్సరాల నుంచి సహజ సౌందర్య ఉత్పత్తులలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే రోజ్ టీను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్యప్రయోజనాలను పొందుతామో ఇక్కడ తెలుసుకుందాం..

1) కెఫిన్ లేనిది:

సాధారణంగా మనం తాగే కాఫీ లేదా టీ లలో అధికభాగం కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. చాలామంది కాఫీలో ఉండే కెఫిన్ వల్ల పని ఒత్తిడి, అలసట తగ్గుతుందని భావిస్తారు. మరికొందరు కెఫిన్ వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుందని భావిస్తుంటారు. ఉదాహరణకు కెఫిన్ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్యతో బాధపడాల్సి వస్తుందని చాలా మంది భావిస్తారు. ఈ విధమైనటువంటి ఆలోచనలు ఉన్నవారికి రోజ్ టీ ఎంతో ప్రయోజనకరం అని చెప్పవచ్చు. ఇందులో కెఫిన్ అనే పదార్థం ఉండదు. కెఫిన్ నివారించుకోవాలనుకునేవారికి 100% రోజ్ టీ ఎంతో ప్రయోజనకరమని చెప్పవచ్చు.

2) శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది:

రోజ్ టీ ప్రధానంగా నీటితో తయారవుతుంది కనుక ప్రతిరోజు రెండు మూడు కప్పులు టీ తాగడం వల్ల మన శరీరానికి తగినంత నీటిని అందించవచ్చు. మన శరీరానికి కావలసినంత నీరు అందటం వల్ల మన శరీరంలో జరిగే జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. మన శరీరం డీహైడ్రేషన్ అయితే అలసట, తలనొప్పి, చర్మ సమస్యలు కండరాల నొప్పులు వంటివి తలెత్తుతాయి. కనుక మన శరీరానికి వీలైనంత వరకు తగినంత మోతాదులో నీటిని అందించడం ఎంతో అవసరం. అదే విధంగా భోజనానికి ముందు అధిక మొత్తంలో నీటిని తీసుకోవడం వల్ల ఆహారం ఎక్కువగా తీసుకోలేము. కనుక అధికంగా నీటిని తీసుకోవటం వల్ల కూడా మన బరువును తగ్గించుకోవచ్చు.

3) యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి:

రోజ్ టీ లో పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో పేరుకుపోయిన ఫ్రీరాడికల్స్ ను బయటకు తొలగించి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి విముక్తిని కలిగిస్తుంది. పాలీఫెనాల్స్ అధికంగా ఉండటం వల్ల ఇది క్యాన్సర్, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వంటి ప్రమాదాలను తగ్గిస్తాయి. రోజ్ టీ లో గల్లిక్ ఆమ్లం, ఆంథోసైనిన్స్, కెంప్ఫెరోల్ మరియు క్వెర్సెటిన్ వంటి పాలీఫెనాల్స్ అధికంగా ఉంటాయి.

4) నెలసరి నొప్పిని తగ్గిస్తుంది:
పలు అధ్యయనాల ప్రకారం ఋతు స్రావం సమయంలో ఎంతోమంది మహిళలు లేదా బాలికలు తీవ్రమైన వెన్ను నొప్పి, కడుపు నొప్పి, అలసట వంటి సమస్యలతో బాధపడుతుంటారు. నెలసరి ఒక వారం ముందు నుంచే రోజ్ టీ త్రాగటం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పిని అరికట్టవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

5) జలుబు, గొంతు నొప్పి నుంచి విముక్తి కలిగిస్తుంది:
జలుబు గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు రోజ్ టీ తాగటం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. రోజ్ టీ లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి వ్యాధికారక బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. విటమిన్ సి తో పాటు బి 1, బి 2, కె విటమిన్లు బీటా-కెరోటిన్ లను కలిగి ఉంటాయి.

6) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
గులాబీ మొగ్గలు, గులాబీ రేకుల నుంచి తయారుచేసిన టీను క్రమం తప్పకుండా తాగడం వల్ల జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తాయి.రోజ్ టీ మైక్రోఫ్లోరా లేదా మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడంతో జీర్ణక్రియను మెరుగు పరచడమేకాకుండా, మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.రోజ్ టీలో ఉన్న పెక్టిన్ పేగులలోని కొవ్వు మరియు కొలెస్ట్రాల్‌తో బంధిస్తుంది. అదేవిధంగా నీరసం విరోచనాలకు చికిత్స చేయడానికి రోజ్ టీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

7) ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది:
అధిక పని వల్ల కలిగే ఒత్తిడి, ఆందోళన నుంచి రోజ్ టీ ఉపశమనం కల్పిస్తుంది. రోజ్ టీ లో ఉండే సుగంధ ప్రభావం మనస్సును అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించి శాంత పరుస్తుంది. రాత్రి పడుకునే సమయంలో ఒక కప్పు రోజ్ టీ తాగటం వల్ల మంచి నిద్రకు సహకరిస్తుంది.

8) గర్భిణీ స్త్రీలకు ఎంతో ఉపయోగం:
చాలామంది స్త్రీలు గర్భం ధరించినప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ విధంగా గర్భం దాల్చిన మహిళలు మూలికా ఉత్పత్తులను తీసుకోవడానికి కొంతవరకు ఆలోచించి వెనుకడుగు వేస్తారు. అయితే గర్భం ధరించిన మహిళలు రోజ్ టీ తాగడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రోజ్ టీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరిలో కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తి కావడానికి విటమిన్ సి ఎంతో అవసరం. విటమిన్ సి రోజ్ టీలో పుష్కలంగా లభిస్తుంది. గులాబీ టీలో విటమిన్ ఇ, సెలీనియం, మాంగనీస్, బి కాంప్లెక్స్, పొటాషియం, మెగ్నీషియం అధికంగా లభిస్తాయి. ఈ పోషకాలు అన్ని తల్లి బిడ్డను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడతాయి. కనుక గర్భం ధరించిన మహిళలు ఎలాంటి సందేహం లేకుండా రోజ్ టీ తాగవచ్చు.

9) క్యాన్సర్ ను నిరోధిస్తుంది:
గులాబీలు క్యాన్సర్ కి కారణమయ్యే జన్యు ఉత్పరివర్తనాలు నిరోధించడంలో సహాయపడతాయని శాస్త్రవేత్తలు నిరూపించారు.గులాబీలలో ఆంథోసైనిన్స్ పుష్కలంగా ఉన్నాయి.EGCG, కాటెచిన్స్, పాలీఫెనాల్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న రోజ్ టీ శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను తొలగించి క్యాన్సర్ కణాలను నివారిస్తుంది.

రోజ్ టీ తయారు చేసే విధానం:
ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉన్న రోజ్ టీ తయారీ విధానం ఎంతో సులభం. ఈ టీ తయారు చేసుకోవడానికి మన పెరటిలో పూసిన గులాబీ మొగ్గలు, గులాబీ రేకులను రెండు కప్పులు తీసుకొని బాగా శుభ్రపరచుకోవాలి. ఒక గిన్నెలో మూడు కప్పుల నీటిని 80 డిగ్రీల వద్ద బాగా మరిగించాలి. మరుగుతున్న నీటిలోకి గులాబీ మొగ్గలు, రేకులు వేసి అవి నల్లగా మారే వరకూ తక్కువ మంటపై మరిగించాలి. గులాబీ రేకులు నల్లగా మారిన తర్వాత వాటిని వడపోసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. అయితే కొందరు మరింత రుచి కోసం ఈ రోజ్ టీ లో తేనెను కలుపుకొని తాగవచ్చు. ఈ విధంగా రోజ్ టీ క్రమం తప్పకుండా తాగటం వల్ల పై తెలిపిన ఆరోగ్యప్రయోజనాలన్నింటిని పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *