మీకు శబ్ద న్యూరోమా(శబ్ద నాడి గ్రంథి) గురించి తెలుసా ?

Acoustic Neuroma details in Telugu

మీకు శబ్ద న్యూరోమా (శబ్ద నాడి గ్రంథి) గురించి తెలుసా ?

మ‌న‌కు వ‌చ్చే వ్యాధుల్లో చాలా వాటిపేర్లు మ‌న‌కు తెలిసే ఉండ‌దు. కానీ వాటితో చాలా మంది బాధ ప‌డుతూ ఉంటారు. ఒకసారి హాస్పిట‌ల్ కు వెళ్తే గానీ ప‌లు స్కాన్ ల త‌రువాత గానీ ఆ వ్యాధి గురించి తెలియ‌దు. అలాంటిదే ఈ ఎకౌస్టిక్ న్యూరోమా. ఇది క్యాన్స‌ర్ కాని నిర‌పాయ‌మైన క‌ణితి. ఈ క‌ణితి లోప‌లి చెవి నుంచి మెద‌డు వ‌ర‌కు ఉన్న న‌రాల మీద ప్ర‌భావం చూపిస్తుంది. దీంతో వినికిడి, స‌మ‌తుల్య‌త స‌రిగ్గా చూసే నరాల ప‌ని తీరు దెబ్బ‌తింటుంది.

దీన్ని వెస్టిబ్యులర్ స్క్వాన్నోమా, శ్రవణ నాడి కణితి అని కూడా పిలుస్తారు.ఈ క‌ణితుల వ‌ల‌న మెదడులో ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ప్రాణహాని కూడా ఉంది. అయితే ఇవి క్యాన్సర్ మాదిరిగా శ‌రీరంలోని ఇత‌ర భాగాల‌కు వ్యాపించ‌వు.

ఇది ఎలా వ‌స్తుందంటే..
ష్వాన్ కణాలు అన‌బ‌డే కణాల పొర శరీరంలోని అన్ని ఆరోగ్యకరమైన నరాలను కప్పి ఉంచుతుంది. ష్వాన్ కణాలు నరాలు ప్రేరేపించ‌డానికి కావ‌ల‌సిన ఇన్సులేషన్ ను అందిస్తాయి. అలాగే వాటికి స‌హ‌క‌రిస్తాయి. అయితే ఎనిమిదవ కపాల నాడి చుట్టూ అవి త్వరగా పెర‌గ‌డం ప్రారంభ‌మైతే శబ్ద న్యూరోమా వ‌స్తుంది. అయితే ఈ క‌ణితి మాములుగా నిమ్మ‌దిగా పెరుగుతుంది. కానీ పూర్తిగా పెర‌గ‌గానే అనేక అవ‌ల‌క్ష‌ణాలు అక‌స్మికంగా క‌నిపిస్తాయి.

ఈ ఎకౌస్టిక్ న్యూరోమా చాలా అరుదుగా వ‌స్తుంది. నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ అరుదైన వ్యాధుల(ఎన్వో ఆర్ డీ) చెప్పిన లెక్క‌ల ప్ర‌కారం ఇది ప్రతీ ల‌క్ష‌ మందిలో ఒక‌రికి వ‌స్తుంది. అమెరికాలో ప్రతీ యేడు సుమారు 2,500 మందికి ఇది సోకుతుంది. ఇది మాములుగా 30 నుంచి 60 ఏండ్ల వారికి క‌నిపిస్తుంది.

అయితే చికిత్స ఏంటి..?

ఎకౌస్టిక్ న్యూరోమా చికిత్స ప‌లు అంశాల మీద ఆధార‌ప‌డి ఉంటుంది. వ్యాధి సోకిన వ్య‌క్తి వ‌య‌సు, ఆ వ్య‌క్తి ఆరోగ్యం, క‌ణితి ఎక్క‌డ ఉంది, అది ఏ ప‌రిమాణంలో ఉంది అనే విష‌యాల మీద ఆధార‌ప‌డుతుంది. ఈ విష‌యాల‌ను వైద్యులు గ‌మ‌ణించిన త‌రువాత‌. ప‌లు సూచ‌న‌లు చేస్తారు.వాటిని గుర్తుంచుకుని రోగులు వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది.

చికిత్సల్లోని ర‌కాలుః
రేడియో థెర‌పీ
రేడియో థెర‌పీ ఎకౌస్టిక్ న్యూరోమాకు ఉప‌యోగించే ఒక‌ర‌క‌మైన చికిత్స‌. దీంతో క‌ణితి ఉన్న భాగాన్ని మాత్ర‌మే చికిత్స చేయొచ్చు. ఇత‌రు భాగాల‌కు ఎలాంటి హాని జ‌ర‌గ‌దు. డాక్ట‌ర్లు దీన్ని గామా కత్తి అని కూడా అంటారు. ఈ మ‌ధ్య కాలంలో ఈ చికిత్స ఎక్కువ‌గా చేస్తున్నారు. కణితి 3 సెంటీమీటర్లు లేకుంటే అంత‌క‌న్న త‌క్కువ ఉంటే వైద్యులు రేడియో సర్జరీ చేసేందుకు ఎంచుకుంటారు. ఈ చికిత్స ప‌లు సెష‌న్ల‌ల్లో ఉంటుంది. ఈ ఈసెష‌న్ల మ‌ధ్య విడిది వారాలు, నెలలు లేదా ఏండ్లు ఉండొచ్చు.

మైక్రో సర్జరీ
ఈ చికిత్స విధానంలో డాక్ట‌ర్లు కణితి మొత్తాన్ని తీసేస్తారు. అలా తీసేయ‌డానికి పుర్రెలోని ఇక ప్లేస్ లో కోస్తారు. ఈ చికిత్స లో అనస్థీషియా ఇచ్చి, ప్రత్యేక సాధనాలతో క‌ణితిని తీసేస్తారు.

కొన్నిసార్లు, వైద్యులు కణితిలో కొంత భాగాన్ని మాత్రమే తొలగిస్తారు. ఎందుకంటే పూర్తి క‌ణితిని తొలగించడం కుద‌ర‌దు. అలా చేస్తే.. ముఖ నరాలకు నష్టం జ‌ర‌గొచ్చు. అలా ముఖ నరాలను దెబ్బతీస్తే ముఖంలో పక్షవాతం వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఈ స‌ర్జ‌రీల త‌ర్వాత ఏం జ‌రుగుతుంది ?
చికిత్స తర్వాత డాక్ల‌ర్లు రోగిని కొన్ని రోజుల వ‌ర‌కు ప‌ర్య‌వేక్షిస్తారు. ఏమైనా అవ‌లక్షణాలు పునరావృతం అవుతున్నాయా లేదా అని. అయితే కొన్నిసార్లు చికిత్స తర్వాత వినికిడి లోపం కూడా రావొచ్చు. ఇది ఎక్కువ‌గా శబ్ద నాడిపై కణితి ఉన్న స‌మ‌యంలో జ‌రుగుతుంది. ఇలా జ‌రిగితే సాధ్యమైనంత ఎక్కువ కాలం శస్త్రచికిత్స ఆలస్యంగా చేయాల‌ని వైద్యులు సూచిస్తారు.

దుష్ప్రభావాలు ఏంటి?
శ‌స్త్ర చికిత్స త‌రువాత ప‌లు దుష్ప్ర‌భావాలు బ‌య‌ట ప‌డే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు చెబుతుంటారు. అందులో మైకం, ముఖ బ‌ల‌హీన‌త‌, తిమ్మిరి, ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం లాంటివి జ‌రుగుతాయి. ఇలా జ‌ర‌గ‌డంతో కొన్నిసార్లు మాన‌సిక అప్ర‌మ‌త్త‌త త‌గ్గొచ్చు. చికిత్స వ‌ల‌న‌ నరాలకు న‌ష్టం జ‌రిగితే.. కంటి సమస్యలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఈ క‌ణితి ముఖ్య‌ లక్షణాలుః
90 శాతం మందిలో ఒక చెవిలో వినికిడి లోపం ఉంటుంది. అలాగే టిన్నిటస్, లేదా చెవుల్లో మోగుతుంది. చెవిపోటు ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే నాలుక వెనుక భాగంలో రుచి భావం కోల్పోతుంది. పెద్ద కణితి మెదడుపై ఒత్తిడి తెచ్చే అవ‌కాశం ఉంది. దాంతో తలనొప్పి, వాంతులు అవుతాయి. అలాగే కొన్నిసార్లు దృష్టి సమస్యలు వ‌స్తాయి.

ఇది రావ‌డాని కారణాలు
ష్వాన్ కణాలు గుణించిగానీ, శబ్ద న్యూరోమాకు దారితీసే కారణాల గురించిగాని ఇప్ప‌టికి స్పష్టంగా తెలియ‌దు. ప్ర‌త్యేక కార‌ణం అయితే ఏది లేదు. కొన్ని ప్రమాద కారకాలు ఉండొచ్చ‌ని వైద్యులు చెబుతారు.

ఎలా గుర్తిస్తారంటే..
శబ్ద న్యూరోమాను అనుమానించినట్లయితే వైద్యులు రోగిని MRI స్కాన్ తీసుకోవాల‌ని సూచిస్తారు. ఈ ఇమేజింగ్ ప్రక్రియ కణితి ఉంటే గుర్తిస్తుంది. అది ఎక్కడ, ఎంత పెద్ద‌గా ఉందో కూడా తెలుపుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *